Jio VR Headset : జియో ఫస్ట్ వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ ఇదిగో.. ఐపీఎల్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేయొచ్చు.. ఫీచర్లు, ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Jio VR Headset : రిలయన్స్ జియో విఆర్ (VR) హెడ్‌సెట్ వచ్చేసింది.. జియోడైవ్ పేరుతో భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. వర్చువల్ రియాలిటీ వీడియోలను ఎంజాయ్ చేయొచ్చు.

Jio VR Headset : జియో ఫస్ట్ వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ ఇదిగో.. ఐపీఎల్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేయొచ్చు.. ఫీచర్లు, ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Jio launches first VR headset_ check price, availability, features and more

Jio VR Headset : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) మొట్టమొదటి వర్చువల్ రియాలిటీ (VR) హెడ్‌సెట్‌ను (JioDive) పేరుతో లాంచ్ చేసింది ఈ కొత్త డివైజ్ ద్వారా జియో యూజర్లు ఆన్‌లైన్ IPL 2023 మ్యాచ్‌లను వర్చువల్ 100-అంగుళాల స్క్రీన్‌లో వీక్షించవచ్చు. అంతేకాదు.. స్టేడియం 360-డిగ్రీ వ్యూతో మ్యాచ్‌లను ఆస్వాదించడానికి ఇదో కొత్త మార్గాన్ని అందిస్తుంది. జియో వినియోగదారులకు మరింత థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించే ఈ డివైజ్‌లో ఇతర వీడియోలను కూడా చూడవచ్చు.

JioDive అనేది స్మార్ట్‌ఫోన్ ఆధారిత VR హెడ్‌సెట్.. ఈ డివైజ్ (JioCinema) యాప్‌తో పనిచేస్తుంది. విభిన్న కెమెరా యాంగిల్స్, మల్టీ లాంగ్వేజ్ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఈ కొత్త VR హెడ్‌సెట్ ద్వారా జియో కస్టమర్‌లకు అద్భుతమైన రియల్ ఎక్స్‌పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతో జియో ఈ జియోడైవ్ తీసుకొచ్చింది. (JioGlass) ప్రకటన తర్వాత.. భవిష్యత్తులో మరిన్ని అడ్వాన్సడ్ ఫీచర్‌లను అందిస్తామని కంపెనీ తెలిపింది.

జియోడైవ్ VR హెడ్‌సెట్ ధర ఎంతంటే? :
Jio JioDive VR హెడ్‌సెట్ ధర రూ. 1,299 ఉంటుంది. ఈ డివైజ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. వినియోగదారులు Jio అధికారిక వెబ్‌సైట్ లేదా (JioMart) నుంచి హెడ్‌సెట్‌ను కొనుగోలు చేయవచ్చు. Paytm వ్యాలెట్‌ ఆర్డర్‌లపై జియో యూజర్లకు రూ. 500 క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. అదనంగా, ఈ ప్లాట్‌ఫారమ్‌లో కనీసం రూ. 500 కొనుగోళ్లపై కొనుగోలుదారులు రూ.100 తగ్గింపును పొందవచ్చు.

Read Also : Apple Safari : గూగుల్ క్రోమ్ డేంజర్.. ఆపిల్ సఫారీ బ్రౌజర్ సేఫ్.. భారత్‌లో ఒక శాతమే వాడుతున్నారట..!

జియోడైవ్ VR హెడ్‌సెట్ సపోర్టు :
JioDive VR హెడ్‌సెట్ వినియోగదారులకు Jio కనెక్షన్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ (Android 9 & ఆపై వెర్షన్ లేదా iOS 15 & ఆపై వెర్షన్) సపోర్టు చేస్తుంది. 4.7 అంగుళాలు, 6.7 అంగుళాల మధ్య డిస్‌ప్లే సైజు ఉండాలి. JioDiveని ఉపయోగించాలంటే.. గైరోస్కోప్, యాక్సిలెరోమీటర్ అవసరమని గమనించాలి. JioDiveతో IPL 2023 మ్యాచ్‌లు, ఇతర కంటెంట్‌లను చూడవచ్చు. జియో యూజర్లు తమస్మార్ట్‌ఫోన్‌లలో JioImmerse యాప్‌ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. JioDive VR హెడ్‌సెట్ డివైజ్ Samsung, Apple, OnePlus, Oppo, Realme, Vivo, Xiaomi, Poco, Nokia వంటి ఇతర స్మార్ట్‌ఫోన్‌లలో కూడా సపోర్టు చేస్తుంది.

Jio launches first VR headset_ check price, availability, features and more

Jio VR Headset : Jio launches first VR headset_ check price, availability, features and more

Jio VR హెడ్‌సెట్ ఫీచర్లు ఇవే :
JioDive VR హెడ్‌సెట్ Jio యూజర్ల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. 100-అంగుళాల వర్చువల్ స్క్రీన్‌లో (JioCinema)లో TATA IPLని చూసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ఈ హెడ్‌సెట్ 4.7, 6.7 అంగుళాల డిస్‌ప్లే సైజు, ఆండ్రాయిడ్ 9 ఆపై అంతకంటే ఎక్కువ లేదా iOS 15, అంతకంటే ఎక్కువ ఉన్న సపోర్టెడ్ OS వెర్షన్‌తో Android, iOS స్మార్ట్‌ఫోన్‌లకు సపోర్టు ఇస్తుంది. జియోడైవ్ హెడ్‌సెట్‌లో షార్పర్ ఇమేజ్, ఆప్టికల్ సౌలభ్యం కోసం సెంటర్, సైడ్ వీల్స్‌తో అడ్జస్టబుల్ లెన్స్‌లు ఉన్నాయి, VRలో యూజర్ల ఇంటరాక్షన్ కోసం క్లిక్ బటన్, పర్ఫెక్ట్ ఫిట్‌కు త్రీ-వే అడ్జస్టబుల్ స్ట్రాప్ ఉన్నాయి.

JioDive హెడ్‌సెట్‌ని ఎలా ఉపయోగించాలంటే? :
జియో వినియోగదారులు హెడ్‌సెట్ బాక్స్‌లోని QR కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. JioImmerse యాప్‌ను వారి ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేయాలి. తద్వారా JioDiveని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా, జియో యూజర్లు Jio 4G, 5G లేదా JioFiber నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయ్యాక యాప్‌కి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత వినియోగదారులు యాప్‌లోని JioDive కింద కనిపించే ‘Watch on JioDive’ ఆప్షన్ ఎంచుకోవచ్చు. సపోర్ట్ క్లిప్, లెన్స్‌ల మధ్య హెడ్‌సెట్‌లో యూజర్లు తమ ఫోన్‌ను ఉంచవచ్చు. చివరగా, వినియోగదారులు సౌకర్యవంతమైన స్పష్టమైన వ్యూ కోసం బాక్సులు, మూవీ క్వాలిటీని ఎడ్జెస్ట్ చేసుకోవచ్చు.

Read Also : Amazon Great Summer : ఈ రాత్రి నుంచే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ముందుగా వారికే.. ఈ 5G స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!