Apple Safari : గూగుల్ క్రోమ్ డేంజర్.. ఆపిల్ సఫారీ బ్రౌజర్ సేఫ్.. భారత్‌లో ఒక శాతమే వాడుతున్నారట..!

Apple Safari : ప్రపంచవ్యాప్తంగా క్రోమ్ బ్రౌజర్ వాడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ, క్రోమ్ కన్నా ఆపిల్ సఫారీ బ్రౌజర్ చాలా సేఫ్ అని రిపోర్టు తేల్చసింది. కానీ, ఈ బ్రౌజర్ భారతీయుల్లో ఒక శాతం మంది మాత్రమే వాడుతున్నారట..

Apple Safari : గూగుల్ క్రోమ్ డేంజర్.. ఆపిల్ సఫారీ బ్రౌజర్ సేఫ్.. భారత్‌లో ఒక శాతమే వాడుతున్నారట..!

Apple Safari is safest web browser yet only 1 per cent Indians use it, report reveals

Apple Safari : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) సర్వీసుల్లో ఒకటైన సఫారి వెబ్ బ్రౌజర్ (Safari Web Browser) అత్యంత సురక్షితమైనదిగా కొత్త పరిశీధనలో తేలింది. ఈ సఫారీ బ్రౌజర్ వినియోగం ద్వారా యూజర్లకు తక్కువ రిస్క్ ఉంటుందని తెలిపింది. ప్రాథమికంగా ఈ బ్రౌజర్‌తో అతి తక్కువ రిస్క్ ఉంటుంది. అయితే, ఈ సఫారీ బ్రౌజర్ ఎంత మంది వినియోగదారులు వాడుతున్నారు? ఆపిల్ డివైజ్‌ల్లో ఈ బ్రౌజర్ అందుబాటులో ఉన్నప్పటికీ.. చాలా మంది వినియోగదారులు (Google Chrome) బ్రౌజర్ వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే.. క్రోమ్ బ్రౌజర్ యూజర్ ఫ్రెండ్లీగా మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే, చాలా మంది యూజర్లు తమ డివైజ్‌లో క్రోమ్ ఇన్‌స్టాల్ చేసుకుని విస్తృతంగా వినియోగిస్తున్నారు.

అత్యంత పాపులారిటీ పొందిన ఈ క్రోమ్‌నే తమ పీసీలు, ల్యాప్‌టాప్స్, మొబైల్ ఫోన్లలో యూజర్లు వినియోగిస్తున్నారు. దాంతో, క్రోమ్ వెబ్ బ్రౌజర్‌ల మార్కెట్ కొంచెం కూడా చెక్కుచెదరకుండా కొనసాగుతోంది. స్టాట్‌కౌంటర్ ప్రకారం.. వివిధ వెబ్‌సైట్‌లలో వెబ్ బ్రౌజర్‌ల వినియోగాన్ని ట్రాక్ చేసే ప్లాట్‌ఫారమ్.. (Google Chrome) ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా ఉపయోగించే డెస్క్‌టాప్ బ్రౌజర్ అని తేల్చేసింది.

Read Also : Apple iPhone 14 Sale : అమెజాన్‌లో ఐఫోన్ 14 ధర రూ.40వేల లోపే.. అబ్బా భలే డీల్ కదా.. టెంప్ట్ అయ్యారా? ట్రాప్‌లో పడినట్టే..!

అంతేకాదు.. మార్కెట్ వాటాలో 66 శాతానికి పైగా క్రోమ్ కలిగి ఉంది. సఫారి బ్రౌజర్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ (Microsoft Edge) బ్రౌజర్ వరుసగా 11.87 శాతం, 11 శాతం మంది వినియోగదారులతో తర్వాతి రెండు స్థానాల్లో అత్యంత పాపులారిటీ పొందిన బ్రౌజర్‌లుగా నిలిచాయి. ఇందులో సఫారీ బ్రౌజర్ వాడే వినియోగదారుల్లో కేవలం 1.01 శాతం మంది భారతీయులు మాత్రమే ఉన్నారని కొత్త పరిశోధనలో నిరూపితమైంది. అంటే.. బ్రౌజర్ వినియోగంలో సురక్షితమైనది అయినప్పటికీ తక్కువ పాపులారిటీని కలిగి ఉంది.

అట్లాస్ (VPN) రిపోర్టు ప్రకారం.. గూగుల్ క్రోమ్‌కు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్నప్పటికీ 2022లో అత్యంత హాని కలిగించే వెబ్ బ్రౌజర్‌గా రుజువైంది. క్రోమ్‌లో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 303 సెక్యూరిటీ లోపాలుఉన్నాయని నివేదిక వెల్లడించింది. మొత్తంగా 3,000కు పైగా సాంకేతిక లోపాలను గుర్తించామని, అత్యధికంగా యాక్టివ్ లోపాలు క్రోమ్ బ్రౌజర్‌లోనే ఉన్నాయని రిపోర్టు తెలిపింది.

Apple Safari is safest web browser yet only 1 per cent Indians use it, report reveals

Apple Safari is safest web browser yet only 1 per cent Indians use it, report reveals

ఆపిల్ Safari బ్రౌజర్ సంవత్సరాలుగా తక్కువ సాంకేతిక లోపాలను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ యూజర్లను కలిగి ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా రెండో అత్యంత పాపులారిటీ పొందిన బ్రౌజర్‌గా అవతరించింది. 2022 మొదటి మూడు త్రైమాసికాలలో సఫారీ బ్రౌజర్ కేవలం 26 డాక్యుమెంట్‌లతో కూడిన లోపాలను మాత్రమే కలిగి ఉంది.

గూగుల్ క్రోమ్ ప్రపంచంలో అత్యంత సాధారణంగా ఉపయోగించే బ్రౌజర్, కానీ, అనేక సాంకేతిక లోపాలను కలిగి ఉంది. ఎలాంటి సమస్యలు లేని బ్రౌజర్ సఫారికి మాత్రం అదే స్థాయిలో పాపులారిటీని పొందలేదు. ఈ బ్రౌజర్ వినియోగంలో తక్కువ రిస్క్ ఉన్నందున సఫారీ యూజర్లకు సేఫ్ అని నివేదిక తెలిపింది. మీరు బ్రౌజర్‌ను ఎంచుకునే సమయంలో మీ అవసరాలకు ఏది బెస్ట్ బ్రౌజర్ అనేది నిర్ణయించుకోవాలంటే.. ప్రతి బ్రౌజర్ బెనిఫిట్స్ ఎలాంటి బెనిఫిట్స్ అందిస్తుందనేది తెలుసుకోవాలి.

ఆపిల్ సఫారీ అనేది ఆపిల్ డెవలప్ చేసిన వెబ్ బ్రౌజర్ అని అందిరి తెలిసిందే. MacOS, iOS, iPadOS డివైజ్‌ల కోసం ఇప్పటికే ఈ బ్రౌజర్ అందుబాటులో ఉంది. మొదట 2003లో సఫారీ బ్రౌజర్ లాంచ్ అయింది అప్పటి నుంచి ప్రపంచంలోని అత్యంత పాపులర్ అయిన వెబ్ బ్రౌజర్‌లలో ఒకటిగా నిలిచింది. సఫారీ వేగవంతమైన, సురక్షితమైన బ్రౌజింగ్ అనుభవాన్ని అందిస్తుంది. టాబ్డ్ బ్రౌజింగ్ (Tab Browsing), ప్రైవేట్ బ్రౌజింగ్ (Private Browsing), అంతర్నిర్మిత పాప్-అప్ బ్లాకర్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. HTML5, CSS, JavaScript వంటి వెబ్ టెక్నాలజీల శ్రేణికి కూడా సపోర్టు ఇస్తుంది. సఫారీ ఆపిల్ హార్డ్‌వేర్చ సాఫ్ట్‌వేర్ కోసం ఆప్టిమైజ్ చేసుకోవచ్చు.

Read Also : Apple iPhone 14 Discount : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. విజయ్ సేల్స్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఆఫర్లు ఇవే.. ఏ డీల్ బెటర్ అంటే?