Reliance Jio Data Plans : రిలయన్స్ జియో అదిరే ప్రీపెయిడ్ ప్లాన్లు.. ఫ్రీగా ఓటీటీ స్ట్రీమింగ్, మరెన్నో డేటా బెనిఫిట్స్..!

Reliance Jio Data Plans : రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లను ఆకర్షించేందుకు అదిరే ప్రీపెయిడ్ ప్లాన్లతో వచ్చింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ల ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్‌తో పాటు రోజుకు 3GB డేటాను పొందవచ్చు. అంతేకాదు.. అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను పొందవచ్చు.

Reliance Jio Data Plans : రిలయన్స్ జియో అదిరే ప్రీపెయిడ్ ప్లాన్లు.. ఫ్రీగా ఓటీటీ స్ట్రీమింగ్, మరెన్నో డేటా బెనిఫిట్స్..!

Jio plans with 3GB data per day, free Disney+ Hotstar subscription and unlimited calls

Reliance Jio Data Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లను ఆకర్షించేందుకు అదిరే ప్రీపెయిడ్ ప్లాన్లతో వచ్చింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ల ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్‌తో పాటు రోజుకు 3GB డేటాను పొందవచ్చు. అంతేకాదు.. అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను పొందవచ్చు.

టెలికాం ఆపరేటర్ 1GB రోజువారీ డేటా, 2GB రోజువారీ డేటా, రోజుకు 3GB డేటాతో ప్లాన్‌లను అందిస్తుంది. ప్రతిరోజూ 2GB డేటాను అందించే ప్లాన్‌లను కూడా పొందవచ్చు. రోజుకు 3GB డేటాను అందించే ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్‌లపై అన్ లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ మాత్రమే కాదు.. ఫ్రీగా OTT స్ట్రీమింగ్ యాక్సస్ కూడా పొందవచ్చు. ప్రతిరోజూ 3GB డేటా అందించే Jio ప్లాన్‌ల లిస్టును ఓసారి పరిశీలిద్దాం.

Jio రోజువారీ 3GB డేటా బెనిఫిట్స్ :
* రూ. 419 ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో 84GB మొత్తం డేటాను అందిస్తుంది. 3GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, Jio యాప్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్ పొందవచ్చు. Disney+ Hotstar మొబైల్‌కి 3 నెలల ఫ్రీగా సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

Jio plans with 3GB data per day, free Disney+ Hotstar subscription and unlimited calls

Jio plans with 3GB data per day, free Disney+ Hotstar subscription and unlimited calls

* రూ. 601 ప్లాన్ : ప్రీపెయిడ్ ప్లాన్‌లో 28 రోజుల పాటు 3GB రోజువారీ లిమిట్‌తో 90GB మొత్తం డేటా పొందవచ్చు. జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, అదనంగా 6GB డేటాను కూడా అందిస్తుంది. జియో యూజర్లు ఈ ప్లాన్‌తో రూ. 499 విలువైన ఒక ఏడాది Disney+ HotStar మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు.

* రూ. 1,199 ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీపై 3GB రోజువారీ డేటా 252GB లిమిట్‌తో మొత్తం డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS, Jio యాప్ సబ్‌స్క్రిప్షన్, Rs149 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా 3 నెలల (90 రోజులు) అందిస్తుంది.

* రూ. 4,199 ప్లాన్ : వార్షిక ప్లాన్ 3GB రోజువారీ డేటా లిమిట్‌తో 1095GB డేటాను అందిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS, Jio యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉన్నాయి. అంతేకాదు. ఈ ప్లాన్ ఒక ఏడాది వరకు డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను రూ. 1499తో అందిస్తుంది. OTTలో అందుబాటులో ఉన్న మొత్తం కంటెంట్‌ను ఫ్రీగా యాక్సెస్‌ పొందవచ్చు.

Read Also : Reliance Jio : జియో యూజర్లకు అలర్ట్.. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఇదిగో.. చెక్ చేశారా? ఓటీటీతో పాటు రోజుకు డేటా ఎంతంటే?