Maruti Petrol Vehicles : మారుతి కీలక నిర్ణయం.. వచ్చే పదేళ్లలో పెట్రోల్ కార్లు ఆపేస్తాం!
దేశవ్యాప్తంగా ఇందన ధరలు పెరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకీ పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.

Maruti Petrol Vehicles : దేశవ్యాప్తంగా ఇందన ధరలు పెరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకీ పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్రోల్ వాహనాలను కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. అందులోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టిసారించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈవీ వాహనాలపై ప్రత్యేక రాయితీలు ఇస్తామని ఆఫర్ చేయడంతో కార్ల కంపెనీలు ఈవీ కార్లను తయారుచేసేందుకు ముందుకు వస్తున్నాయి. ప్యూర్ పెట్రోల్ వాహనాల కారణంగా కర్బన ఉద్గారాలతో పర్యావరణం దెబ్బతింటోంది.
కరోనా మహమ్మారి తర్వాత పర్సనల్ మొబిలిటీపై ఆసక్తి పెరిగింది. విదేశీయులే కాదు.. మన భారతీయులు కూడా ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లు, స్కూటర్లపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దేశీయంగా విద్యుత్ వాహనాల మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నారు. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే 7 ఏళ్ల నుంచి 10ఏళ్లలో పూర్తిగా పెట్రోల్ ‘pure petrol’ వినియోగ కార్ల తయారీని ఆపేస్తామని ప్రకటించింది. ప్రస్తుత ప్లాన్ ప్రకారం.. వచ్చే పదేళ్లలో హైబ్రీడ్, ఫ్లెక్స్ ఫ్యూయల్, బయో ఫ్యూయల్, ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారుచేయాలని నిర్ణయిచింది. BS-6 కర్బన ఉద్గారాల ప్రమాణాలు అమల్లోకి తేవడంతో 2020 ఏప్రిల్ నుంచే డీజిల్ కార్ల తయారీని నిలిపేసింది.

Maruti All Set To Discontinue ‘pure Petrol’ Model Cars In 10 Years, Working On Eco Friendly Technologies
వచ్చే మూడేళ్లలోపు.. 2025 నాటికి పూర్తి స్థాయిలో అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను లాంచ్ చేయలేమని మారుతి సుజుకి స్పష్టం చేసింది. పూర్తి స్థాయిలో ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ పైన మాత్రమే వర్క్ మొదలుపెట్టామని మారుతి సుజుకి ఇండియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సీవీ రామన్ చెప్పారు. వచ్చే దశాబ్దకాలంలో అన్ని వాహనాలను ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ వాహనాలుగా కన్వర్ట్ చేస్తామన్నారు. ఆపై పూర్తి పెట్రోల్ వినియోగ వాహనాలు ఉండవని తెలిపారు. అంటే.. అవి విద్యుత్ వాహనాలైనా లేదా సీఎన్జీ లేదా బయో ఫ్యూయల్ వాహనాలైనా ఉండొచ్చునని సీవీ రామన్ పేర్కొన్నారు.
Read Also : OnePlus Y1S Pro : వన్‌ప్లస్ నుంచి 50 అంగుళాల కొత్త స్మార్ట్‌టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?