Microsoft Windows 11 కొత్త OS వస్తోంది.. మీ PC సపోర్ట్ చేయాలంటే?

లేటెస్టు Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొస్తోంది మైక్రోసాఫ్ట్.. మీరు వాడే సిస్టమ్... కొత్త విండోస్ 11 OS రిక్వైర్ మెంట్స్ సపోర్టు చేస్తుందా లేదో ఇలా చెక్ చేసుకోండి.

Microsoft Windows 11 కొత్త OS వస్తోంది.. మీ PC సపోర్ట్ చేయాలంటే?

Microsoft Updates Windows 11 Minimum System Requirements To Include Older Intel Cpus

Microsoft Windows 11 OS : మీ పీసీలో ఏ ఓఎస్ వాడుతున్నారు.. సాధారణంగా ఎక్కువ మంది మైక్రోసాఫ్ట్ విండోస్ వెర్షన్లే వాడుతుంటారు. ఆపిల్ డివైజ్ అయితే మ్యాక్ సిస్టమ్ వాడుతారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ చాలా వెర్షన్లను రిలీజ్ చేసింది. కొన్నింటికి అప్ డేట్స్ కూడా నిలిపివేసింది. ప్రస్తుతం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతోంది. కొత్త సిస్టమ్స్, ల్యాప్ టాప్‌ల్లో డిఫాల్ట్ ఓఎస్‌ (Windows 10)తో వచ్చేస్తున్నాయి. అప్ డేట్స్ ఆగిపోయినప్పటికీ చాలామంది యూజర్లు విండోస్ 7 (Windows 7) వాడుతున్నారు. విండోస్ 10 అప్ డేట్స్ వచ్చాక మళ్లీ మరో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ రాలేదు.

లేటెస్టుగా విండోస్ 11 (Windows 11) ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొస్తోంది మైక్రోసాఫ్ట్.. ప్ర‌స్తుతం విండోస్ 11 బీటా వెర్షన్ (Beta Verison) టెస్టింగ్ చేస్తోంది. విండోస్ 10 OS వాడే ప్ర‌తి యూజ‌ర్.. విండోస్ 11 ఓఎస్‍‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. మీరు వాడే సిస్టమ్.. PC… కొత్త విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ రిక్వైర్ మెంట్స్ సపోర్టు చేస్తుందా లేదో ఓసారి చెక్ చేసుకోండి. అప్పుడే మాత్రమే ఈ సిస్టమ్ లో Windows 11 OS ఇన్ స్టాల్ చేసుకోవాలి. లేదంటే బూటింగ్ ఎర్రర్స్ వస్తాయి. ఓఎస్ సరిగా లోడ్ అవ్వొద్దు. OS సపోర్టు చేస్తేనే ఇన్ స్టాల్ ప్రాసెస్ రన్ అవుతుంది.

Microsoft Updates Windows 11 Minimum System Requirements To Include Older Intel Cpus (2)

Credit : From Google Images

లేదంటే.. ఈ సిస్టమ్ సపోర్ట్ చేయదంటూ మెసేజ్ డిస్ ప్లే అవుతుంది. ఒక్కో OS వెర్షన్ రిక్వైర్ మెంట్స్ ఒక్కో రకంగా ఉంటాయి. మీ సిస్టమ్ లో మినిమం సిస్టమ్ రిక్వైర్‌మెంట్స్ ఉండాలి. అప్పుడే విండోస్ 11 OS సులభంగా రన్ అవుతుంది. ప్రస్తుతం మీరు వాడే Windows OS వెర్షన్ ఏంటి? అలాగే మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఎంతో తెలిసి ఉండాలి. అంటే.. మీ సిస్టమ్ ర్యామ్ కెపాసిటీ ఎంత? అలాగే హార్డ్ డిస్క్ స్టోరేజీ ఎంతో తెలియాలి.
Windows and Apple : విండోస్, ఆపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక!

విండోస్ 11 OS.. మీ సిస్టమ్‌లో రన్ చేయాలంటే..
విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ మీ సిస్టమ్‌లో రన్ చేయాలంటే.. 64-bit ప్రాసెసర్ కంపాటిబుల్ అయి ఉండాలి. 4GB ర్యామ్ కెపాసిటీ, 64GB హార్డ్ డిస్క్ స్టోరేజీ తప్పనిసరిగా ఉండాలి. అలాగే UIFI సెక్యూర్ బూట్, గ్రాఫిక్ కార్డు, TPM 2.0 సిస్టమ్ రిక్వైర్‌మెంట్స్ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు మాత్రమే విండోస్ 11 OS బూట్ అవుతుంది. 2017 కంటే ముందు ప్రాసెసర్లతో పనిచేసే సిస్టమ్ లలో Windows 11 OS సపోర్టు చేయదని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఒకవేళ పాత ప్రాసెసర్లు ఉంటే.. వాటిని వెంటనే అప్ గ్రేడ్ చేసుకోవాలి. Inter Core X సిరీస్, జియోన్ W సిరీస్, ఇంటెల్ కోర్ 7820 HQ CPU ప్రాసెసర్లు మాత్రమే WindowS 11 ఆపరేటింగ్ సిస్టమ్ లో వర్క్ అవుతాయి.

Microsoft Updates Windows 11 Minimum System Requirements To Include Older Intel Cpus (1)

Credit : From Google Images

AMD ప్రాసెస‌ర్ల‌ు వాడుతుంటే అందులోనూ Windows 11 పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. MacBookలో విండోస్ 11 స‌పోర్ట్ చేస్తుందా లేదా అనేది స్పష్టత లేదు. TPM 2.0 రిక్వైర్‌మెంట్ కలిగిన మాక్‌బుక్ యూజ‌ర్లు.. విండోస్ 11 ఇన్‌స్టాల్ చేసుకోలేరు. యాపిల్ మాక్ సిస్ట‌మ్స్‌లో TPM 2.0 స‌పోర్ట్‌ అందించడం లేదని గుర్తించాలి. ఆపిల్ మ్యాక్ సిస్టమ్స్ మినహా విండోస్ అన్ని సిస్టమ్స్ లలో మినిమం సిస్టమ్ రిక్వైర్‌మెంట్స్ ఈజీగా ఇన్ స్టాల్ చేసి రన్ చేసుకోవచ్చు. సెక్యూరిటీపరంగా ఎప్పటికప్పుడూ అప్ డేట్స్ వస్తుంటాయి.. ఇంకెందుకు ఆలస్యం.. మీ సిస్టమ్ లో కూడా Windows 11 OS సపోర్టు చేస్తుందో లేదో చెక్ చేసుకోండి.

Windows 10 Free Upgrade : విండోస్ 7, 8.1 నుంచి విండోస్ 10కు ఫ్రీ అప్‌గ్రేడ్ కావొచ్చు.. ఎలానంటే?