Windows 10 Free Upgrade : విండోస్ 7, 8.1 నుంచి విండోస్ 10కు ఫ్రీ అప్‌గ్రేడ్ కావొచ్చు.. ఎలానంటే?
ప్రముఖ మైక్రోసాఫ్ట్ సంస్థ బ్రాండ్ విండోస్‌లో ఏ వెర్షన్ వాడుతున్నారు.. విండోస్ 7 (Windows 7), విండోస్ 8.1 (Windows 8.1) ఈ రెండింటిలో ఏ వెర్షన్ అయిన సరే.. విండోస్ 10 వెర్షన్ కు ఉచితంగా అప్ గ్రేడ్ కావొచ్చు..

How To Upgrade From Windows 7 And Windows 8.1 To Windows 10 For Free
Windows 10 Free Upgrade : ప్రముఖ మైక్రోసాఫ్ట్ సంస్థ బ్రాండ్ విండోస్‌లో ఏ వెర్షన్ వాడుతున్నారు.. విండోస్ 7 (Windows 7), విండోస్ 8.1 (Windows 8.1) ఈ రెండింటిలో ఏ వెర్షన్ అయిన సరే.. విండోస్ 10 వెర్షన్ కు ఉచితంగా అప్ గ్రేడ్ కావొచ్చు.. ఎవరైతే Windows 10 అప్ గ్రేడ్ అవుతారో వారికి Windows 11 Update కూడా పొందవచ్చు. ఈ కొత్త అప్ డేట్ ఇంకా రిలీజ్ కాలేదు. Windows 11 అప్ డేట్ అధికారికంగా రిలీజ్ అయ్యాక.. విండోస్ 10 యూజర్లు కొత్తదానికి అప్ గ్రేడ్ కావొచ్చు. కొన్ని ఏళ్ల క్రితమే విండోస్ 7, విండోస్ 8.1 యూజర్లకు అప్ డేట్స్ నిలిచిపోయాయి. అయినప్పటికీ ఈ విండోస్ యూజర్ల కోసం Free Upgrade ఆఫర్ అందిస్తోంది.
మీ PC నుంచి Windows 7, Windows 8 నుంచి Windows 10 అప్ డేట్ కావొచ్చు. ఇదిలా ఉండగా.. మైక్రోసాఫ్ట్ కూడా స్పెషల్ అప్ గ్రేడ్ ఆఫర్ అందించే సైట్లను అధికారికంగా తొలగించింది. అయినా Windows 10 లైసెన్స్ యాక్టివేషన్ కోసం యూజర్లకు అందిస్తోంది. ఈ Upgrade ప్రాసెస్ చాలా ఈజీ కూడా. ఒకసారి ట్రై చేయండి.. మీ సిస్టమ్ Windows 10 సిస్టమ్ కనీస రిక్వైర్ మెంట్స్ సపోర్ట్ చేస్తే సరిపోతుంది.
విండోస్ 7 నుంచి విండోస్ 10కు అప్ గ్రేడ్ అయితే పాత సిస్టమ్ లోని Settings, Apps రిమూవ్ అయిపోతాయి. పాత డేటాను బ్యాకప్ తీసుకోవడం సాధ్యం కాదు.. అందుకే ఈ యాప్స్ అన్నింటిని మళ్లీ రీ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే.. Windows 8.1 నుంచి Windows 10కు ఎటువంటి డేటా లాస్ లేకుండా ఈజీగా అప్ గ్రేడ్ కావొచ్చు. అదేలానో ఓసారి చూద్దాం..
How to upgrade from Windows 7/ Windows 8.1 to Windows 10
– మీ విండోస్ సిస్టమ్ లోని ముఖ్యమైన డాక్యమెంట్లు, యాప్స్, డేటాను బ్యాకప్ తీసుకోండి.
– మైక్రోసాఫ్ట్ Windows 10 download site ఓపెన్ చేయండి.
– Download Tool Now అనే ఆప్షన్ సెలక్ట్ చేయండి.
– Windows 10 ఇన్ స్టాలేషన్ మీడియా సెక్షన్ క్రియేట్ చేయండి.
– ఇప్పుడు యాప్ RUN చేయండి.
– Upgrade this PC now ఆప్షన్ వద్ద Click చేయండి.
– మీ పర్సనల్ ఫైల్స్ కావాలా? కొత్తగా స్టార్ట్ చేస్తారా? అని Prompt వస్తుంది.
– Windows 10 Upgrade అయ్యేటప్పుడు అన్ని యాప్స్, సెట్టింగ్స్ డిలీట్ అయిపోతాయి.
– మీకు ఏ ఆప్షన్ కావాలో అది ఎంచుకోండి.
– Windows 10 కు అప్ గ్రేడ్ అవగానే.. డిజిటల్ లైసెన్స్ (Digital License) వస్తుంది.
– Settings > Update & Security > Activation.
– అంతే.. విండోస్ 10లోకి అప్ గ్రేడ్ అయినట్టే…