Nokia T20 Tablet : నోకియా నుంచి సరికొత్త ట్యాబ్లెట్ వస్తోంది.. ఫీచర్లు లీక్!

ప్రముఖ HMD గ్లోబల్ సంస్థ నోకియా నుంచి కొత్త ట్యాబ్లెట్ (Nokia T20 Tablet) రాబోతోంది. ఈ ట్యాబ్లెట్ లాంచ్ చేయడానికి ముందే దాని ఫీచర్లు లీక్ అయ్యాయి. యూకే రిటైలర్ వెబ్ సైట్లో ఈ నోకియా T20 ట్యాబ్లెట్ లిస్టు అయింది. ఇందులో ఫీచర్లు ఆకర్షణీయంగా ఉంటాయట..

Nokia T20 Tablet : నోకియా నుంచి సరికొత్త ట్యాబ్లెట్ వస్తోంది.. ఫీచర్లు లీక్!

Nokia T20 Tablet Price, Specifications Tipped Ahead Of Launch

Nokia T20 Tablet : ప్రముఖ HMD గ్లోబల్ సంస్థ నోకియా నుంచి కొత్త ట్యాబ్లెట్ (Nokia T20 Tablet) రాబోతోంది. ఈ ట్యాబ్లెట్ లాంచ్ చేయడానికి ముందే దాని ఫీచర్లు లీక్ అయ్యాయి. 2014 నుంచి నోకియా బ్రాండ్ నుంచి ఇదే మొదటి ట్యాబ్లెట్ కూడా. HMD Global నుంచి కూడా మొదటసారిగా లైసెన్స్ పొందిన ట్యాబ్లెట్ కూడా ఇదే.. యూకే రిటైలర్ వెబ్ సైట్లో ఈ నోకియా T20 ట్యాబ్లెట్ లిస్టు అయింది. ఇందులో ఫీచర్లు ఆకర్షణీయంగా ఉంటాయట..

Wi-Fi, Wi-Fi + 4G వేరియంట్లలో వస్తోంది. నోకియా ట్యాబ్లెట్స్ (Nokia Tablets) మోడల్ నెంబర్లలో TA-1392, TA-1397 రెండు మోడళ్లలో రానున్నాయి. రష్యన్ (Russian certification) వెబ్ సైట్లలో కనిపించాయి. ఈ మోడల్స్ రాబోయే Nokia T20 ట్యాబ్లెట్లకు సంబంధించివి అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Nokia T20 ధర ఎంతంటే? (అంచనా) :
ఈ నోకియా T20 ట్యాబ్లెట్ యూకే రిటైలర్ వెబ్ సైట్ (More Computers)లో ఉంది. ఈ ట్యాబ్లెట్ Wi-Fi only Wi-Fi + 4G connectivity వేరియంట్లలో వస్తోంది. Nokiamobలో ముందుగా ఈ లిస్టింగ్ కనిపించింది. యూకే మార్కెట్లో ఈ Wi-Fi ఓన్లీ వేరియంట్.. ధర GBP 185 (రూ.19,100)గా ఉండనుంది. Wi-Fi+ 4G వేరియంట్ ధర GBP 202 (రూ.20,900)గా ఉండనుంది.

Nokia T20 స్పెషిఫికేషన్లు (అంచనా) :
-10.36 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే
– 4GB RAM, 64GB ఆన్ బోర్డ్ స్టోరేజీ
– బ్లూ కలర్ ఆప్షన్

HMD Global సంస్థ నోకియా ఇప్పటివరకూ ఈ Nokia T20 Tablet వివరాలపై రివీల్ చేయలేదు. నోకియా నుంచి వచ్చే మూడో లైనప్ ట్యాబ్లెట్లు కానున్నాయి. మొదట్లో 2013, 2014లో Nokia N1, Nokia Lumia 2520 Tablets లాంచ్ అయ్యాయి.