Nothing Phone (1) : ఈ ఏడాదికి ఇంతే.. నథింగ్ ఫోన్ (1)లో ఆండ్రాయిడ్ 13OS రానట్టే.. ఎందుకంటే?

Nothing Phone (1) : నథింగ్ ఫోన్ యూజర్లకు అలర్ట్.. ఈ ఏడాదిలో (2022) ఆండ్రాయిడ్ 13 (OS) అందుబాటులోకి రానట్టే.. 2022లో సరికొత్త ఆండ్రాయిడ్ OSని రిలీజ్ చేసే ఆలోచన లేదని నథింగ్ కంపెనీ ధృవీకరించింది.

Nothing Phone (1) : ఈ ఏడాదికి ఇంతే.. నథింగ్ ఫోన్ (1)లో ఆండ్రాయిడ్ 13OS రానట్టే.. ఎందుకంటే?

Nothing Phone (1) won’t get Android 13 in 2022, here is why

Nothing Phone (1) : నథింగ్ ఫోన్ యూజర్లకు అలర్ట్.. ఈ ఏడాదిలో (2022) ఆండ్రాయిడ్ 13 (OS) అందుబాటులోకి రానట్టే.. 2022లో సరికొత్త ఆండ్రాయిడ్ OSని రిలీజ్ చేసే ఆలోచన లేదని నథింగ్ కంపెనీ ధృవీకరించింది. నథింగ్ ఫోన్ (1) వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నథింగ్ ఫోన్ (1) డివైజ్ Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ అందుకోవచ్చు.

కానీ, వచ్చే ఏడాదిలో అది సాధ్యమని అంటోంది. కొన్ని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు రాబోయే నెలల్లో ఎంపిక చేసిన ఫోన్‌లతో ఆండ్రాయిడ్ 13ని అందించాలని ప్లాన్ చేస్తున్నాయి. నథింగ్స్ హార్డ్‌వేర్‌తో సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ను అందించాలని కంపెనీ వివరించింది. అందుకే 2022లో ఆండ్రాయిడ్ 13 కోసం సరికొత్త అప్‌డేట్‌ను రిలీజ్ చేసేందుకు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయలేదని తెలిపింది.

నథింగ్ ఫోన్ (1) వినియోగదారు అనుభవాన్ని మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంటామని కంపెనీ తెలిపింది. సాధారణ డౌన్‌లోడ్ కోసం ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి. Android 13OSకి సంబంధించి 2023 ప్రారంభంలో Nothing Phone (1) వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ డివైజ్ రిలీజ్ కావడానికి ముందే నథింగ్ హార్డ్‌వేర్‌తో సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ను అందించనుంది. 2023 ప్రథమార్థంలో (Android 13 OS) అప్‌డేట్‌ను అందుకోవడం ప్రారంభిస్తాయని ఇప్పటికీ ఏ కంపెనీ నిర్ధారించలేదు.

వాస్తవానికి వచ్చే జనవరి, జూన్ మధ్య అప్‌డేట్ రావచ్చని సూచిస్తుంది. నథింగ్ ఫోన్ (1) ప్రస్తుతం ఆండ్రాయిడ్ 12లో రన్ అవుతోంది. రాబోయే సంవత్సరాల్లో మూడు ఏళ్ల మేజర్ ఆండ్రాయిడ్ OS, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుంది. నథింగ్ ఫోన్ (Android 14 OS)ని కూడా పొందాల్సి ఉంటుంది.

Nothing Phone (1) won’t get Android 13 in 2022, here is why

Nothing Phone (1) won’t get Android 13 in 2022, here is why

ఎలాంటి బగ్‌లు లేకుండా లేటెస్ట్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, ఇతర సెక్యూరిటీ అప్‌డేట్‌లను సకాలంలో అందించేందుకు ప్రయత్నిస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్‌లను అందించడంలో బ్లోట్‌వేర్-రహిత UIతో సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందించనుంది. Nothing Phone (1) భారత మార్కెట్లో రూ. 32,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అయితే ఇప్పుడు కాస్త ఎక్కువ ధరకే విక్రయిస్తున్నారు.

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ డివైజ్‌ను రూ. 33,999 ధర ట్యాగ్‌తో లిస్టు చేసింది. ఇక డివైజ్ 6.55-అంగుళాల 120Hz OLED స్క్రీన్, 4,500mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 778G+ చిప్‌సెట్, 50-MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తోంది. లాంచ్ ఈవెంట్ తర్వాత కొనుగోలు చేయని వినియోగదారులు ఈ డివైజ్ కోసం అదనంగా రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Read Also : Nothing Phone (1) : నథింగ్ ఫోన్‌లో ఫస్ట్ OTA అప్‌డేట్‌తో బగ్స్ అన్ని ఫిక్స్.. కెమెరా పర్ఫార్మెన్స్ అదుర్స్..!