OnePlus Nord 2 : మళ్లీ పేలిన వ‌న్‌ప్ల‌స్ నోర్డ్ 2 ఫోన్.. యూజర్‌కు తీవ్రగాయాలు.. ఫొటోలు వైరల్!

OnePlus Nord 2 5G : ఇండియాలో వన్ ప్లస్ నోర్డ్ 2 (One Plus Nord 2 5G) స్మార్ట్ ఫోన్ మరోసారి పేలింది. మహారాష్ట్రలో మరో వన్ ప్లస్ నోర్డ్ 2 ఫోన్ పేలిన ఘటన మహారాష్ట్రలో జరిగింది.

OnePlus Nord 2 : మళ్లీ పేలిన వ‌న్‌ప్ల‌స్ నోర్డ్ 2 ఫోన్.. యూజర్‌కు తీవ్రగాయాలు.. ఫొటోలు వైరల్!

Oneplus Nord 2 5g

Updated On : November 9, 2021 / 7:04 PM IST

OnePlus Nord 2 5G : ఇండియాలో వన్ ప్లస్ నోర్డ్ 2 (One Plus Nord 2 5G) స్మార్ట్ ఫోన్ మరోసారి పేలింది. మహారాష్ట్రలో మరో వన్ ప్లస్ నోర్డ్ 2 ఫోన్ పేలిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ ఘటనలో ఫోన్ యూజర్ కు తీవ్రగాయాలయ్యాయి. జీన్స్ ప్యాంట్ జేబులో పెట్టుకున్న సమయంలో వన్ ప్లస్ నోర్డ్ 2 ఫోన్ ఒక్కసారిగా పెద్దశబ్దంతో పేలిపోయింది. దాంతో అతడి తోడభాగానికి తీవ్రగాయమైంది. జీన్స్ జేబు కాలిపోయింది. ఫోన్ పేలిన ఫొటోలను యూజర్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశాడు. యూజర్ ట్వీట్ చేయగానే.. వ‌న్‌ప్ల‌స్ క‌స్ట‌మ‌ర్ సపోర్ట్ వెంటనే స్పందించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను నేరుగా మెసేజ్ చేసి చెప్పాలని సూచించింది.

వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ పేలడం ఇదేమి మొదటిసారి కాదు.. గతంలోనూ వన్ ప్లస్ నోర్డ్ 2 5G స్మార్ట్ ఫోన్లు పేలిన సంఘటనలు చాలానే ఉన్నాయి. కంపెనీ సూచించినట్టుగా డైరెక్ట్ గా వివరాలను మెసేజ్ చేసినప్పటికీ కంపెనీ నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ, ఈమెయిల్ ద్వారా కంపెనీ ఒక ప్రకటన చేసింది.. ఇలాంటి ఘటనలను చాలా సీరియస్ గా తీసుకుంటాం.. ఇప్పటికే సంబంధిత టీం బాధితుని వద్దకు చేరుకుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించే పనిలోనే ఉన్నామని వివరణ ఇచ్చింది. OnePlus Nord 2 5G స్మార్ట్ ఫోన్… గత జూలై నెలలో లాంచ్ అయింది.


కంపెనీ పాపులర్ మిడ్ రేంజ్ మోడల్ OnePlus Nord సక్సెస్ తర్వాత ఈ కొత్త సిరీస్ మోడల్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ మోడల్ లాంచ్ అయిన కొద్ది నెలల్లోనే ఫోన్లు చాలా పేలాయి. దీనిపై వన్ ప్లస్ కంపెనీ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు స్మార్ట్ ఫోన్లు జేబులో పెట్టుకున్న సమయంలో ఇలా పేలిపోవడం చూసి యూజర్లలో భయాందోళన నెలకొంది. అందులోనూ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు వాడే యూజర్లు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కువ సమయం చేతిలో లేదా జేబుల్లో స్మార్ట్ ఫోన్లను క్యారీ చేయడం మంచిది కాదని, సాధ్యమైనంతవరకు ఫోన్ దూరంగా ఉంచుకోవడమే ఉత్తమమని అభిప్రాయపడుతున్నారు.
Read Also : WhatsApp Web : స్మార్ట్​ఫోన్​+ఇంటర్నెట్ లేకుండా ‘వాట్సాప్​ వెబ్​’ ఉపయోగించడం ఎలా?