OnePlus Nord Buds CE : వన్‌ప్లస్‌ నుంచి కొత్త వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌.. 20 గంటల బ్యాటరీ లైఫ్.. ధర ఎంతంటే?

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం OnePlus భారత మార్కెట్లో OnePlus Nord Buds CE అనే కొత్త పెయిర్ TWS ఇయర్‌బడ్‌లను లాంచ్ చేసింది.

OnePlus Nord Buds CE : వన్‌ప్లస్‌ నుంచి కొత్త వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌.. 20 గంటల బ్యాటరీ లైఫ్.. ధర ఎంతంటే?

OnePlus Nord Buds CE with 20-hours battery life launched in India, priced at Rs 2,299

OnePlus Nord Buds CE : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం OnePlus భారత మార్కెట్లో OnePlus Nord Buds CE అనే కొత్త పెయిర్ TWS ఇయర్‌బడ్‌లను లాంచ్ చేసింది. ఈ కొత్త ఇయర్‌బడ్‌లు కంపెనీ నార్డ్ పోర్ట్‌ఫోలియోలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే నార్డ్ బడ్స్‌కి టోన్డ్-డౌన్ వెర్షన్ గా కంపెనీ ప్రవేశపెట్టింది. Nord Buds CE బడ్జెట్-ఆధారిత కస్టమర్‌లను లక్ష్యంగా తీసుకొచ్చింది. అయితే స్పెసిఫికేషన్‌లు 13.4mm ఆడియో డ్రైవర్లు, AI నాయిస్ క్యాన్సిలేషన్ 20 గంటల లిజనింగ్ టైం వంటి ముఖ్య ఫీచర్లు ఉన్నాయి.

OnePlus Nord బడ్స్ CE ధర ఎంతంటే? :
OnePlus Nord Buds CE ధర రూ. 2,299కు అందుబాటులో ఉంది. OnePlus ఇండియా ఈ-స్టోర్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో కస్టమర్‌లు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. OnePlus Nord Buds CE మూన్‌లైట్ వైట్, మిస్టీ గ్రే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. OnePlus Nord Buds ప్రస్తుతం భారత మార్కెట్లో రూ. 2,799లకు అందుబాటులో ఉంది. OnePlus సరసమైన OnePlus Bullets Wireless Z2 వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను రూ. 1,999కి విక్రయిస్తోంది.

OnePlus Nord Buds CE with 20-hours battery life launched in India, priced at Rs 2,299

OnePlus Nord Buds CE with 20-hours battery life launched in India, priced at Rs 2,299

Nord బడ్స్ CE ఫీచర్లు, డిజైన్ :
డిజైన్ పరంగా చూస్తే.. OnePlus Nord Buds CE హార్డ్-కేస్ డిజైన్‌తో ఆపిల్ ఎయిర్‌పాడ్‌లను పోలి ఉంటుంది. ఇందులో సిలికాన్ టిప్స్ లేవు. ఒరిజినల్ OnePlus బడ్స్ Z మాదిరిగానే లాంగ్-స్టెమ్ ఇయర్‌బడ్‌లకు తీసుకొచ్చింది. ఛార్జింగ్ కేస్ ఎగ్ షేప్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇయర్‌బడ్‌ల మాదిరిగానే కలర్ ఉంది. ఆధునిక-మినిమలిస్టిక్ డిజైన్ కేసు కలిగి ఉంది. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. ఇయర్‌బడ్‌లు 20Hz నుంచి 20,000Hz ఫ్రీక్వెన్సీలతో 13.4mm డైనమిక్ డ్రైవర్‌లను కలిగి ఉంటాయి.

OnePlus Nord Buds CE బ్లూటూత్ 5.2కి సపోర్టు ఇస్తుంది. యూజర్లు iPhone, Android, టాబ్లెట్.. ఏదైనా బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేయవచ్చు. AAC, SBC ఆడియో ఫార్మాట్‌లతో పాటుగా 10 మీటర్ల ఆడియో పరిధిని కంపెనీ అందిస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లు హే మెలోడీ యాప్‌తో సెట్టింగ్‌లను ట్వీక్ బెనిఫిట్స్ పొందవచ్చు. iOS యూజర్లకు సపోర్టు లేదు. ప్రతి ఇయర్‌బడ్‌లో 27mAh బ్యాటరీ ఉంటుంది. ఛార్జింగ్ కేస్ 300mAh బ్యాటరీని అందిస్తుంది. OnePlus Nord Buds CE పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు 50 శాతం వాల్యూమ్‌తో గరిష్టంగా 4.5 గంటల లిజనింగ్ టైం అందిస్తుంది. మ్యూజిక్ ప్లేబ్యాక్ 20 గంటల వరకు అందిస్తుంది.

Read Also : OnePlus 10T 5G: ఆగస్ట్ 3న ఇండియాలో లాంచ్ కానున్న OnePlus 10T.. ప్రత్యేకతలు ఇవే..