అదిరిపోయే ఫీచర్లు : Oneplus TV స్మార్ట్ రిమోట్ చూశారా? 

వన్ ప్లస్ కంపెనీ సెప్టెంబర్ 26న కొత్త స్మార్ట్ టీవీని రిలీజ్ చేయబోతోంది. వన్ ప్లస్ స్మార్ట్ టీవీతో పాటు వన్ ప్లస్ 7టీ, వన్ ప్లస్ 7టీ ప్రో మొబైల్స్ కూడా లాంచ్ చేయనుంది.

  • Published By: sreehari ,Published On : September 7, 2019 / 02:32 PM IST
అదిరిపోయే ఫీచర్లు : Oneplus TV స్మార్ట్ రిమోట్ చూశారా? 

వన్ ప్లస్ కంపెనీ సెప్టెంబర్ 26న కొత్త స్మార్ట్ టీవీని రిలీజ్ చేయబోతోంది. వన్ ప్లస్ స్మార్ట్ టీవీతో పాటు వన్ ప్లస్ 7టీ, వన్ ప్లస్ 7టీ ప్రో మొబైల్స్ కూడా లాంచ్ చేయనుంది.

వన్ ప్లస్ కంపెనీ సెప్టెంబర్ 26న కొత్త స్మార్ట్ టీవీని రిలీజ్ చేయబోతోంది. వన్ ప్లస్ స్మార్ట్ టీవీతో పాటు వన్ ప్లస్ 7టీ, వన్ ప్లస్ 7టీ ప్రో మొబైల్స్ కూడా లాంచ్ చేయనుంది. అంతకంటే ముందే వన్ ప్లస్ స్మార్ట్ టీవీ రిమోట్‌ కంట్రోలర్ ను కంపెనీ సీఈఓ పెటె లౌ రివీల్ చేశారు. తన ట్విట్టర్ వేదికగా టీవీ రిమోట్ కంట్రోల్ ఫొటోను ట్వీట్ చేశారు. వన్ ప్లస్ టీవీ రిమోట్ లో USB-C పోర్ట్, రెగ్యులర్ ఆండ్రాయిడ్ నేవిగేషన్ బటన్స్, గూగుల్ అసిస్టెంట్ బటన్, వన్ ప్లస్ హోం బటన్, బ్లాంక్ బటన్ వంటి ఫీచర్లు ఎట్రాక్టీవ్ గా ఉన్నాయి.

ఇందులో టచ్ ప్యాడ్ లేదా డైరెక్షనల్ ప్యాడ్ టాప్ సైడ్ ఉంది. వన్ ప్లస్ స్మార్ట్ టీవీ రిమోట్ డిజైన్.. ఆపిల్ టీవీ సిరి రిమోట్ మాదిరిగా ఉంది. ఇప్పటివరకూ వచ్చిన టీవీ రిమోట్లలో ఇదే ఆకర్షణీయమైన డిజైన్. మీ బొటనవేలితో టచ్ చేస్తే చాలు.. ఈజీగా నేవిగేట్ చేసుకోవచ్చు. వన్ ప్లస్ స్మార్ట్ టీవీ 55 అంగుళాల స్ర్కీన్ తో రాబోతోంది. ఇమేజ్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ ఆకట్టుకునేలా ఉండనున్నాయి.

డాల్ బై అట్మోస్ QLED ప్యానెల్, కస్టమ్ ట్యూనింగ్ ఆప్షన్లు ఉన్నాయి. 100శాతానికి పైగా కలర్ గ్యామట్ ఉంది. ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం కస్టమ్ చిప్ కూడా ఉంది. సాధారణంగా చాలా స్మార్ట్ టీవీలకు ఒకటి లేదా రెండు స్పీకర్లు కామన్. కానీ, వన్ ప్లస్ స్మార్ట్ టీవీకి మొత్తం 8 స్పీకర్లు 50W ఆడియో ఔట్ ఫుట్ తో ఇంప్రసీవ్ గా ఉండనున్నాయి.