Oppo K10 5G : ఒప్పో K సిరీస్ 5G ఫోన్ ఫస్ట్ సేల్.. ప్లాట్ డిస్కౌంట్ ఆఫర్లు..!

భారత మార్కెట్లో లాంచ్ అయిన ఒప్పో K10 5G ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. జూన్ 15 నుంచి ఆన్ లైన్ సేల్ ప్రారంభమవుతోంది. Oppo K10 5G స్మార్ట్‌ఫోన్ ఒకే స్టోరేజ్ మోడల్‌తో వచ్చింది.

Oppo K10 5G : ఒప్పో K సిరీస్ 5G ఫోన్ ఫస్ట్ సేల్.. ప్లాట్ డిస్కౌంట్ ఆఫర్లు..!

Oppo K10 5g To Go On Sale In India Today Price, Specs And Sale Offers

Oppo K10 5G : భారత మార్కెట్లో లాంచ్ అయిన ఒప్పో K10 5G ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. జూన్ 15 నుంచి ఆన్ లైన్ సేల్ ప్రారంభమవుతోంది. Oppo K10 5జీ స్మార్ట్‌ఫోన్ ఒకే స్టోరేజ్ మోడల్‌తో వచ్చింది. అయితే యూజర్లు రెండు కలర్ల ఆప్షన్లలో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ గతవారమే ఇండియాలో లాంచ్ అయింది. ప్రస్తుతం Oppo K10 4G వేరియంట్‌తో వచ్చింది. రెండోది మార్చి 2022లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. Oppo కొన్ని ఏళ్ల క్రితం వరకు భారత్‌లో సరసమైన ధరకే K-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. Oppo K10 దాదాపు రెండు ఏళ్లలో భారత ఫోన్ మార్కెట్లో లాంచ్ చేసిన సిరీస్‌లో ఫోన్లలో ఇదే మొదటిదిగా చెప్పవచ్చు.

ధర, ఆఫర్లు ఎంతంటే? :
Oppo K10 5జీ ఫ్లిప్‌కార్ట్, మెయిన్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్‌, Oppo ఆన్‌లైన్ స్టోర్‌లో రూ. 17,499కి అందుబాటులో ఉంటుంది. Flipkart లేదా Oppo E-స్టోర్‌లో Oppo K10 5జీని కొనుగోలు చేసుకోవచ్చు. కస్టమర్‌లు 3 నెలల వరకు నో-కాస్ట్ EMI లేదా SBI డెబిట్ క్రెడిట్ కార్డ్‌లు, EMI లావాదేవీలపై రూ. 1,500 ఫ్లాట్ తగ్గింపుతో సేల్ ఆఫర్‌లను పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో కస్టమర్‌లు కూడా ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌ను ఆస్వాదించవచ్చు. ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్ ఓషన్ బ్లూ కలర్స్‌లో వస్తుంది. ఈ సేల్ జూన్ 15, 12PM నుంచి ప్రారంభమవుతుంది. మరోవైపు.. Oppo K10 4G భారత మార్కెట్లో 6GB RAM, 8GB RAM ఆప్షన్లపై వరుసగా రూ. 14,990, రూ. 16,990కి అందుబాటులో ఉంది. రెండు వేరియంట్‌లు 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తాయి.

Oppo K10 5g To Go On Sale In India Today Price, Specs And Sale Offers (1)

Oppo K10 5g To Go On Sale In India Today Price, Specs And Sale Offers

Oppo K10 5జీ స్పెసిఫికేషన్స్ :
Oppo K10 5జీ, Oppo K10 4G వేరియంట్‌ అప్‌గ్రేడ్‌తో వచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్లలో 90Hz 6.56-అంగుళాల HD+ డిస్‌ప్లే, ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్‌సెట్ ఉన్నాయి. ప్రాసెసర్ 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చాయి. Oppo యూజర్లు మైక్రో SD కార్డ్ స్లాట్‌తో ఆన్‌బోర్డ్ మెమరీని 512GB వరకు పెంచుకోవచ్చు. Oppo K10 5జీ RAM సామర్థ్యాన్ని పెంచేందుకు ROMని ఉపయోగించే డైనమిక్ RAM ఎక్స్ ఫ్యాండ్ ఫీచర్‌కు సపోర్టు ఇస్తుంది. Oppo K10 5జీలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ 48-MP ప్రైమరీ కెమెరా, 2-MP డెప్త్-సెన్సింగ్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీల కోసం యూజర్లు ముందు ప్యానెల్‌లోని వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్, 8-MP కెమెరాను ఉపయోగించవచ్చు. ఫోన్ Android 12-ఆధారిత ColorOS 12.1 రన్ అవుతుంది. బయోమెట్రిక్ సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. Oppo K10 5జీ కూడా 33W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అమర్చారు.

Read Also : Oppo K10 Series : ఫస్ట్ టైం ఇండియాకు 50MP కెమెరాలతో ఒప్పో K10 సిరీస్.. ధర ఎంతంటే?