Oukitel WP22 Budget Phone : అతిపెద్ద బ్యాటరీతో సరికొత్త స్మార్ట్‌ఫోన్.. సింగిల్ ఛార్జ్‌తో 52 రోజులు వస్తుంది.. ధర కేవలం రూ.14వేలు మాత్రమే!

Oukitel WP22 Budget Phone : అతిపెద్ద బ్యాటరీతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. Oukitel స్మార్ట్‌ఫోన్ Oukitel WP22 అనే పేరుతో ప్రపంచ మార్కెట్లో లాంచ్ అయింది. (AliExpress) అనే కంపెనీ ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది.

Oukitel WP22 Budget Phone : అతిపెద్ద బ్యాటరీతో సరికొత్త స్మార్ట్‌ఫోన్.. సింగిల్ ఛార్జ్‌తో 52 రోజులు వస్తుంది.. ధర కేవలం రూ.14వేలు మాత్రమే!

Oukitel WP22 Budget Phone : Oukitel launches latest phone the Oukitel WP22 with a 10000mAh battery 48MP Camera

Oukitel WP22 Budget Phone : అతిపెద్ద బ్యాటరీతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. Oukitel స్మార్ట్‌ఫోన్ Oukitel WP22 అనే పేరుతో ప్రపంచ మార్కెట్లో లాంచ్ అయింది. (AliExpress) అనే కంపెనీ ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది.
గ్లోబ్ ట్రాటర్స్, అడ్వెంచర్ ప్రియుల కోసం ఈ కొత్త ఫోన్ రూపొందించారు. ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ స్పీకర్లలో ఒకటైన MTK Helio P90 ప్రాసెసర్, 48MP ప్రైమరీ కెమెరాతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అత్యుత్తమ బడ్జెట్ ఫోన్‌లలో ఇదొకటిగా చెప్పవచ్చు.

వరల్డ్ ప్రీమియర్ డీల్‌లో భాగంగా Oukitel WP22 ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. సాధారణంగా ఈ ఫోన్ 200 డాలర్లు ఉండగా, కూపన్ కోడ్‌ని ఉపయోగించి 170.99 డాలర్లకు డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు. అంటే.. రూ. 13,999లకు కొనుగోలు చేయొచ్చు. ఈ కోడ్ (OUKTELWP22NE) ద్వారా 20 డాలర్ల తగ్గింపుతో మొదటి రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2వ రోజు నుంచి మీరు కూపన్ కోడ్‌ని ఉపయోగించవచ్చు. (OUKTELWP22WE) తద్వారా మీరు 10 డాలర్ల తగ్గింపును పొందవచ్చు. ఈ డీల్ మార్చి 26న రాత్రి 11:59లకు ముగుస్తుంది.

Oukitel WP22 Budget Phone : Oukitel launches latest phone the Oukitel WP22 with a 10000mAh battery 48MP Camera

Oukitel WP22 Budget Phone : Oukitel launches latest phone the Oukitel WP22

Read Also : Samsung Budget Phones : శాంసంగ్ నుంచి డ్యుయల్ కెమెరాలు, లాంగ్ బ్యాటరీతో రెండు కొత్త బడ్జెట్ ఫోన్లు.. ఏ మోడల్ ధర ఎంతంటే?

ఈ సరికొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్ (Oukitel WP22) 1080 x 2408p రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 FHD+ IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డివైజ్ MediaTek Helio P90 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అత్యంత వేగవంతమైనది. ఈ గేమింగ్‌ డివైజ్ 8GB LPDDR4 RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. Oukitel WP22 హైలైట్ ఫీచర్ 125dB లౌడ్ అండ్ క్లియర్ స్పీకర్‌తో వస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ స్పీకర్లలో ఇదొకటి. హెడ్‌ఫోన్స్ అవసరం లేకుండా మ్యూజిక్ వినవచ్చు. గేమ్‌లు ఆడవచ్చు. పాడ్‌క్యాస్ట్‌లు వినొచ్చు లేదా వీడియోలు చూడొచ్చు. ఈ ఫోన్ స్పీకర్ 36mm ఫుల్-రేంజ్ నియోడైమియమ్ మాగ్నెట్ డ్రైవర్‌ను కలిగి ఉంది.

WP22లోని అల్ట్రా లౌడ్‌స్పీకర్‌లు, క్లియర్ మిడ్‌లు, డీప్ బాస్‌ను అందిస్తాయి. Oukitel కెమెరా ఫీచర్లలో WP22 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఈ ఫోన్ 48MP Sony IMX582 ప్రధాన కెమెరా, 2MP మాక్రో సెన్సార్, 20MP సోనీ IMX350 ఆటోఫోకస్ నైట్ విజన్ లెన్స్‌తో గరిష్టంగా 20 మీటర్ల వ్యూతో వస్తుంది. సెల్ఫీల కోసం.. ఫోన్ ముందు భాగంలో 16MP సెన్సార్ ఉంది. హై క్వాలిటీ, సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలను షేర్ చేయొచ్చు.

ఈ ఫోన్ 10000mAh బ్యాటరీతో వస్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 52 రోజుల వరకు వస్తుంది. 1250 గంటల స్టాండ్‌బై, 16 గంటల వీడియో, 41 గంటల మ్యూజిక్, 12 గంటల గేమింగ్, 75 గంటల కాలింగ్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. అవసరమైనప్పుడు మినీ పవర్ బ్యాంక్‌గా కూడా పనిచేస్తుంది.

Oukitel WP22 Budget Phone : Oukitel launches latest phone the Oukitel WP22 with a 10000mAh battery 48MP Camera

Oukitel WP22 Budget Phone : Oukitel launches latest phone the Oukitel WP22

IP68/69K, MIL-STD-810H సర్టిఫికేషన్‌తో వస్తుంది. వాటర్, డెస్ట్ షాక్‌ప్రూఫ్‌గా చేస్తుంది. ఈ ఫోన్ 1.5 మీటర్ల మంచినీటిలో 30 నిమిషాలు పనిచేస్తుంది. 1.5 మీటర్ల వాటర్ డ్రాప్స్ పడినా చెక్కుచెదరదు. తీవ్రమైన ఉష్ణోగ్రత హెచ్చుతగ్గుల నుంచి ప్రొటెక్ట్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కంపాస్, ప్రొట్రాక్టర్, హైట్ మీటర్, సౌండ్ మీటర్, మిర్రర్ వంటి యాప్‌లను కలిగి ఉంది.

ఇవన్నీ ప్రీ ఇన్‌స్టాల్ చేసిన టూల్‌కిట్‌తో వస్తుంది. ఆసక్తికరమైన ఫీచర్లలో 4-in-1 GPS సిస్టమ్, ప్రోగ్రామబుల్ షార్ట్‌కట్ Key, NFC, బ్లూటూత్ 5.0 వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. Oukitel WP22 ఇప్పుడు AliExpressలో 170.99 డాలర్ల కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ డీల్ మార్చి 26న ముగియనుంది.

Read Also : Apple iPhone 15 Series : రాబోయే ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో 5 అతిపెద్ద డిజైన్ మార్పులివే..?