Apple iPhone 15 Series : రాబోయే ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో 5 అతిపెద్ద డిజైన్ మార్పులివే..?

Apple iPhone 15 Series : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) సొంత బ్రాండ్ ఐఫోన్ నుంచి కొత్త ఐఫోన్ 15 సిరీస్ రాబోతోంది. ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ ఇప్పట్లో లేదు. కానీ, ఐఫోన్ లాంచ్ కావడానికి ముందే ఫోన్ డిజైన్, ఫీచర్లకు సంబంధించి అనేక లీకులు బయటకు వస్తున్నాయి.

Apple iPhone 15 Series : రాబోయే ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో 5 అతిపెద్ద డిజైన్ మార్పులివే..?

Apple iPhone 15 Series _ Apple said to make 5 biggest design changes ever

Apple iPhone 15 Series : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) సొంత బ్రాండ్ ఐఫోన్ నుంచి కొత్త ఐఫోన్ 15 సిరీస్ రాబోతోంది. ఐఫోన్ 15 సిరీస్ (iPhone 15 Series) లాంచ్ ఇప్పట్లో లేదు. కానీ, ఐఫోన్ లాంచ్ కావడానికి ముందే ఫోన్ డిజైన్, ఫీచర్లకు సంబంధించి అనేక లీకులు బయటకు వస్తున్నాయి. ఆపిల్ కంపెనీ తమ ఐఫోన్‌ల భవిష్యత్తును మార్చే కనీసం 5 అతిపెద్ద డిజైన్ మార్పులతో రానున్నట్టు లీక్‌లు సూచించాయి. ఐఫోన్ 15 మోడల్‌లు డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌తో పాటు USB టైప్-సి పోర్ట్‌తో రానున్నాయి. ఐఫోన్ 15 ప్రో మోడళ్లలో సాలిడ్-స్టేట్ బటన్‌లను అందించే అవకాశం ఉంది. అంటే.. ఫిజికల్ బటన్‌లు ఉండకపోవచ్చు. రాబోయే ఐఫోన్‌ల గురించి అనేక వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ మోడల్ అతిపెద్ద డిజైన్ మార్పులతో వచ్చే అవకాశం ఉంది. ఆపిల్ ఐఫోన్‌లను USB టైప్-C పోర్ట్‌తో అందించనుంది. USB-C పోర్ట్‌తో ఫోన్‌లను విక్రయించేందుకు యూరప్ కొత్త చట్టానికి కట్టుబడి ఉంటామని కంపెనీ ధృవీకరించింది. యూరోపియన్ యూనియన్ జారీ చేసిన యూనివర్సల్ ఛార్జింగ్ ప్రమాణాల ఆదేశాన్ని ఆపిల్ అనుసరించనుంది. అయితే, ఇదే ప్రమాణాలతో 2023 ఐఫోన్‌లలో అందిస్తుందనేది కంపెనీ ధృవీకరించలేదు. ఆపిల్ లైటనింగ్ పోర్ట్‌ను తొలగించి ప్రామాణిక USB C పోర్ట్‌ను అందించే ఫస్ట్ ఐఫోన్ iPhone 15 సిరీస్ కానుంది.

Apple iPhone 15 Series _ Apple said to make 5 biggest design changes ever

Apple iPhone 15 Series _ Apple said to make 5 biggest design changes ever

Read Also : Redmi Note 12 Launch : మార్చి 30న రెడ్‌మి నోట్ 12 ఫోన్ వచ్చేస్తోంది.. అద్భుతమైన ఫీచర్లు, భారత్‌లో ధర ఎంత ఉండొచ్చుంటే?

USB టైప్ -C పోర్టు పూర్తి సామర్థ్యాన్ని ఆపిల్ ద్వారా టెస్టింగ్ చేసిన MFi సర్టిఫైడ్ కేబుల్‌‌కు పరిమితం చేయవచ్చునని నివేదికలు సూచిస్తున్నాయి. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15Pro Max) లేదా ఐఫోన్ 15 అల్ట్రా (iPhone 15 Ultra) ఫిజికల్ బటన్‌లు, స్పోర్ట్స్ సాలిడ్ స్టేట్ హాప్టిక్ బటన్‌లు లేకుండా రావొచ్చు. అన్ని ఐఫోన్ 15 మోడళ్లలో ఆపిల్ డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ఉంటుందని భావిస్తున్నారు. ఆపిల్ (Apple) తమ ఐఫోన్లలో పెద్ద డిజైన్ మార్పులు చేయనుందని ఇప్పటికే రెండర్‌లను షేర్ చేసింది. ఫ్లాగ్‌షిప్ ఫోన్ సాలిడ్-స్టేట్ హాప్టిక్ బటన్‌లను కలిగి ఉంటుందని సూచిస్తుంది.

ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌లో ఫిజికల్ బటన్‌లు ఉండవని విశ్లేషకుడు మింగ్-చి-కువో కూడా గతంలో పేర్కొన్నారు. కొత్త సాలిడ్-స్టేట్ బటన్‌లు ఒక యూజర్ ఫిజికల్‌గా బటన్‌ను నొక్కాల్సిన అవసరం ఉండదని గమనించాలి. iPhone 7, iPhone 8 సహా కొన్ని ఇతర మోడళ్లలో కనిపించే హోమ్ బటన్ డిజైన్‌ను పోలి ఉండనుంది.

ఐఫోన్ 15 సిరీస్ ముందు భాగంలో పంచ్ హోల్ డిస్‌ప్లే డిజైన్ ఉండే అవకాశం ఉంది. ఐఫోన్ 15 సిరీస్ సన్నగా ఉండే బెజిల్స్‌తో రానుందని అంచనా. తద్వారా యూజర్లకు ఎక్కువ స్ర్కీన్ స్పేస్ అందిస్తుంది. ఐఫోన్ 15 ప్రో మోడల్స్ టైటానియం ఫ్రేమ్‌లతో రావొచ్చు. ఐఫోన్ 14 ప్రో మోడల్‌తో పోలిస్తే.. ఎక్కువ కర్వడ్ ఎడ్జ్‌లను కలిగి ఉంటాయి.

Apple iPhone 15 Series _ Apple said to make 5 biggest design changes ever

Apple iPhone 15 Series _ Apple said to make 5 biggest design changes ever

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ జూమ్ సామర్థ్యాల కోసం పెరిస్కోప్ లెన్స్‌తో వస్తుందని భావిస్తున్నారు. అన్ని ఐఫోన్ 15 మోడల్‌లు ఆపిల్ డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌తో రానున్నాయి. గత ఏడాదిలో ఐఫోన్ 14 ప్రో మోడళ్లతో మాత్రమే అందించింది. చివరిగా, లేటెస్టు లీక్‌ల ప్రకారం.. ఐఫోన్ 15 వేరియంట్‌లు సన్నని బెజెల్‌తో గత వెర్షన్‌ల కన్నా చిన్నవిగా ఉంటాయి.

చిన్న-నాచ్ డిజైన్, ట్రిమ్-డౌన్ బెజెల్స్‌తో రావొచ్చు. గత లాంచ్‌ల ప్రకారం.. ఐఫోన్ 15న ఈ ఏడాది చివరిలో సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే ఈవెంట్లో ఆపిల్ తన నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ 15 సిరీస్, ఆపిల్ వాచ్‌లను ఆవిష్కరించే అవకాశం ఉంది. 2023 ఐఫోన్లు, డిజైన్, ఇతర కేటగిరీలోనూ అతిపెద్ద అప్‌గ్రేడ్‌లను అందించవచ్చునని నివేదకలు సూచిస్తున్నాయి.

Read Also : OnePlus Nord CE 3 Lite India : ఏప్రిల్ 4న వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?