OxygenOS 13 Unveiled : ఈ OnePlus ఫోన్లకు కొత్త OxygenOS 13 అప్‌డేట్.. ఇందులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

OxygenOS 13 Unveiled : వన్‌ప్లస్ యూజర్లకు కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ (OnePlus 10 Pro) త్వరలో అందుబాటులోకి రానుంది. Open Beta అప్‌డేట్‌ కూడా రానుంది. ఈ కొత్త OxygenOS 13 వన్ ప్లస్ అందించే ఏయే స్మార్ట్ ఫోన్లలో రానుందో ఓసారి ఈ జాబితాను చెక్ చేసుకోండి. ఇందులో మీ OnePlus ఫోన్ మోడల్ ఉందేమో చూసుకోండి. 

OxygenOS 13 Unveiled : ఈ OnePlus ఫోన్లకు కొత్త OxygenOS 13 అప్‌డేట్.. ఇందులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

OxygenOS 13 unveiled_ Features, release timeline, and list of supported phones

OxygenOS 13 Unveiled : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ (OnePlus) కంపెనీ చివరకు OxygenOS 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఆవిష్కరించింది. ఈ OS వాటర్ ఇన్స్‌పైరడ్ లుక్‌తో వచ్చింది. అందుకే వన్‌ప్లస్ ”Aquamorphic Design” అని పిలుస్తోంది. వన్‌ప్లస్ యూజర్లకు కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ (OnePlus 10 Pro) త్వరలో అందుబాటులోకి రానుంది. అలాగే Open Beta అప్‌డేట్‌గా అందుబాటులోకి రానుంది. OxygenOS 13తో OnePlus స్మార్ట్ ఫోన్లలో మినిమలిస్ట్ ఐకాన్‌లు, యానిమేషన్‌లు, వివిధ రకాల ఫారమ్‌లతో పాటు అద్భుతమైన ఫీచర్లను అందించనుంది.

కొత్త సాఫ్ట్‌వేర్ వెర్షన్‌లో ప్రైవేట్ సేఫ్ 2.0 ఉంటుంది. ప్రాథమికంగా ఫైల్‌లు, డాక్యుమెంట్లను ప్రైవేట్ స్థలంలో స్టోర్ చేసేందుకు అనుమతిస్తుంది. అప్పుడు ఏ ఇతర యాప్‌ను యాక్సెస్ చేయలేము. స్పేషియల్ ఆడియో, డాల్బీ అట్మోస్ సపోర్ట్, నీయర్ షేర్ ఫీచర్‌కి మరిన్ని అప్‌డేట్స్ అందించనుంది. యాప్ స్ట్రీమింగ్‌ను కూడా అందిస్తుంది. కొత్త ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే (AoD) స్క్రీన్‌లు కూడా ఉంటాయి.

AoD స్క్రీన్ ద్వారా మ్యూజిక్ యాప్‌లను కూడా కంట్రోల్ చేయవచ్చు. సైడ్‌బార్ టూల్‌బాక్స్‌ను కూడా యాక్సస్ చేసుకోవచ్చు. ColorOS నుంచి ఈ కొత్త ఫీచర్ రూపొందించారు. ప్రాథమికంగా స్క్రీన్ కుడి అంచున కనిపించే యాప్‌ల ఫోల్డర్ మాదిరిగా ఉంటుంది. ఈ ఫోల్డర్ యాప్‌లను త్వరగా యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తుంది. వన్‌ప్లస్ OxygenOS 13తో డిఫాల్ట్ హోమ్ లాంచర్‌ను కూడా అందిస్తోంది. ఫోల్డర్‌ల ఐకాన్ సైజును పెంచింది. ఫోల్డర్‌ను ఓపెన్ చేయకుండానే కొన్ని అప్లికేషన్‌లను వేగంగా యాక్సెస్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.

OxygenOS 13 unveiled_ Features, release timeline, and list of supported phones

OxygenOS 13 unveiled_ Features, release timeline, and list of supported phones

OxygenOS 13 ఎప్పుడు వస్తుందంటే?
లేటెస్ట్ OxygenOS 13 అప్‌డేట్ మొదట OnePlus 10 Proకి వస్తుందని కంపెనీ ధృవీకరించింది. కొత్త సాఫ్ట్‌వేర్ వెర్షన్ కొత్తగా లాంచ్ అయిన OnePlus 10T స్మార్ట్‌ఫోన్‌కు కూడా రానుంది. అయితే ఈ ఏడాది తరువాత.. లేటెస్ట్ OxygenOS అప్‌డేట్ రిలీజ్ చేసేందుకు OnePlus సరైన లాంచ్ టైమ్ లైన్ వెల్లడించలేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో లాంచ్ అయ్యే ఆండ్రాయిడ్ 13పై ఆధారపడి ఉంటుంది. ఈ కొత్త OxygenOS 13 వన్ ప్లస్ అందించే ఏయే స్మార్ట్ ఫోన్లలో రానుందో ఓసారి ఈ జాబితాను చెక్ చేసుకోండి. ఇందులో మీ వన్ ప్లస్ మోడల్ ఉందేమో చూసుకోండి.

OxygenOS 13 – OnePlus phones List :

–  OnePlus 8

– OnePlus 8 Pro

– OnePlus 8T

– OnePlus 9

– OnePlus 9 Pro

– OnePlus 9R

– OnePlus 9RT

– OnePlus 10 Pro

– OnePlus 10R

– OnePlus 10T

– OnePlus Nord 2

– OnePlus Nord 2T

– OnePlus Nord CE

– OnePlus Nord CE 2

– OnePlus Nord CE 2 Lite

Read Also : OnePlus 10T : వన్‌ప్లస్ నుంచి 10T సిరీస్ వస్తోంది.. ఈరోజే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?