Gmail Account : గూగుల్ కొత్త రూల్స్.. ఇకపై మీ జీమెయిల్ ఓపెన్ చేయాలంటే ఇది మస్ట్!

గూగుల్ సర్వీసుల్లో ఒకటైన జీమెయిల్ (Gmail) విషయంలో ఆల్ఫాబెట్ దిగ్గజం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై జీమెయిల్ ఓపెన్ చేయాలంటే తప్పనిసరిగా ఈ వెరిఫికేషన్ చేసుకోవాల్సిందే.

Gmail Account : గూగుల్ కొత్త రూల్స్.. ఇకపై మీ జీమెయిల్ ఓపెన్ చేయాలంటే ఇది మస్ట్!

Received A Notification From Google About Two Step Verification

Google two-step verification :  ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సర్వీసుల్లో ఒకటైన జీమెయిల్ (Gmail) విషయంలో ఆల్ఫాబెట్ దిగ్గజం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై జీమెయిల్ ఓపెన్ చేయాలంటే తప్పనిసరిగా ఈ (Two-Step Verification) వెరిఫికేషన్ చేసుకోవాల్సిందే. ఇప్పటికే గూగుల్ అకౌంట్ యూజర్లందరికి నోటిఫికేషన్లను పంపిస్తోంది. మీకు కూడా ఈ నోటిఫికేషన్ వస్తే వెంటనే అదనపు భద్రత కోసం Two Step Verification ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. ఇటీవల సైబర్ దాడులు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో గూగుల్ తమ యూజర్ల అకౌంట్లకు సెక్యూరిటీపరంగా అదనపు భద్రత కల్పిస్తోంది. సోషల్ మీడియా సైట్ల నుంచి బిజినెస్ మెయిల్స్ అకౌంట్లలోకి ప్రవేశించి విలువైన డేటాను సైబర్ నేరగాళ్లు తస్కరిస్తున్నారు. అందుకే యూజర్ల సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని గూగుల్ కంపెనీ Two Step Verification (2FA, Two Factor Authentication) రూల్ అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది.

ఈ రూల్ ప్రకారం.. యూజర్లు తమ జీమెయిల్ ఓపెన్ చేయాలంటే ఇకపై పాస్ వర్డ్ మాత్రమే ఎంటర్ చేస్తే సరిపోదు.. మరో అథెంటికేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే జీమెయిల్ అకౌంట్ యాక్సస్ చేసుకోవడం సాధ్యపడుతుంది. జీమెయిల్ అకౌంట్లకు తప్పనిసరిగా మొబైల్ నెంబర్ అటాచ్ చేసి ఉండాలి. యూజర్ Two Step Verification సెటప్ చేయాలంటే మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు గూగుల్.. పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత యూజర్ మొబైల్ ఫోన్ రెండో పాస్ వర్డ్ (OTP)గా పరిగణనలోకి తీసుకుంటుంది. ఇకనుంచి జీమెయిల్ ఓపెన్ చేయాలంటే పాస్ వర్డ్ ఎంటర్ చేయడమే కాదు.. దానికి తోడుగా ఫోన్ వెరిఫికేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. జీ మెయిల్‌ ఓపెన్‌ చేసేప్పుడు మీ రిజిస్ట్రర్డ్ ఫోన్‌ నెంబర్ పక్కనే ఉంచుకోవాలి. ఎందుకంటే మీకు సెక్యూరిటీ డిజిట్ కోడ్ వస్తుంది. అది ఎంటర్ చేస్తేనే గూగుల్‌ మీ జీమెయిల్ అకౌంట్ యాక్సస్ చేసుకునేందుకు అనుమతి ఇస్తుంది.
Read Also :  Google Chrome Warn : క్రోమ్‌ యూజర్లకు గూగుల్ వార్నింగ్.. వెంటనే పాస్‌వర్డ్ మార్చుకోండి!

ప్రపంచవ్యాప్తంగా గూగుల్ తమ జీమెయిల్ యూజర్లందరికి ఈ Two Step Verification సెటప్ అందుబాటులోకి తెచ్చింది. జీమెయిల్ యూజర్లకు అలర్ట్ మెసేజ్ లను కూడా పంపిస్తోంది. మొదటి దశలో భాగంగా 15 కోట్ల జీమెయిల్ అకౌంట్లకు Two Step Verification సెటప్ అమలు చేయనుంది. నవంబర్ 8 నుంచి ఈ ఆప్షన్ (Two Step Verification) ఎంచుకున్న యూజర్లకు Two factor authentication ఎనేబుల్ చేస్తుంది. 2022 చివరి నాటికి ఈ Two factor authentication ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది గూగుల్.

గతంలోనూ గూగుల్ ఈ Two Factor authentication అమలు చేసేందుకు విఫలయత్నం చేసింది. అప్పట్లో యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో గూగుల్ ఆ ఆలోచనను పక్కన పెట్టేసింది. ఈసారి మాత్రం యూజర్ల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా ఉండేలా ఈ సెక్యూరిటీ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో భాగంగా 10శాతం మంది జీమెయిల్ యూజర్లకే ఈ సెక్యూరిటీ అథెంటికేషన్ పరిమతం చేయనుంది. 2022నాటికి జీమెయిల్ యూజర్లందరికి ఈ ఆప్షన్ అందుబాటులోకి తీసుకురానుంది.
Read Also : Facebook: ఫేస్ బుక్ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ ఫెసిలిటీ లేదు..!