Redmi K60 Ultra Launch : రెడ్‌మి K60 అల్ట్రా ఫోన్ వచ్చేసిందోచ్.. భలే ఉంది భయ్యా ఫోన్.. ఫీచర్ల కోసమైన ఫోన్ కొనాల్సిందే..!
Redmi K60 Ultra Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రెడ్‌మి నుంచి K60 Ultra ఫోన్ వచ్చేసింది. అద్భుతమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ధర ఎంతంటే?

Redmi K60 Ultra With Mediatek Dimensity 9200 Plus SoC Launched_ Details
Redmi K60 Ultra Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? చైనాలో (Xiaomi) సబ్ బ్రాండ్ రెడ్‌మి (K60 Ultra) ఫోన్ అధికారికంగా లాంచ్ అయింది. ఈ ఫోన్ Xiaomi Fold 3, Xiaomi Pad 6 Max, Xiaomi బ్యాండ్ 8 ప్రోతో పాటుగా ఆఫ్‌లైన్ ఈవెంట్‌లో స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే స్క్రీన్‌తో, Redmi K60 అల్ట్రా Mediatek 690 APUతో కలిసి Mediatek డైమెన్సిటీ 9200+ SoC ద్వారా పవర్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.
రెడ్‌మి K60 అల్ట్రా.. ధర ఎంతంటే? :
చైనాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,599 (దాదాపు రూ. 30వేల) నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో, 16GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర CNY 2,799 (దాదాపు రూ. 32వేలు) ఉంటుంది. CNY 2,999 (దాదాపు రూ. 34,350), రెడ్‌మి K60 అల్ట్రా ఫోన్ 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉంది.
16GB RAM + 1TB స్టోరేజ్ CNY 3,299 (దాదాపు రూ. 38వేల) ధరలో ఉంది. అయితే, 24GB RAM హైఎండ్ మోడల్ + 1TB స్టోరేజ్ మోడల్ ధర CNY 3,599 (దాదాపు రూ. 41,200)కు అందిస్తుంది. ప్రస్తుతానికి, ఈ డివైజ్ చైనాలో మాత్రమే విక్రయించింది. స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ సేల్ ఇంకా ధృవీకరించలేదు. ఈ ఫోన్ బ్లాక్, వైట్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందిస్తుంది.

Redmi K60 Ultra Launch With Mediatek Dimensity 9200 Plus SoC Launched_ Details
రెడ్‌మి K60 అల్ట్రా : స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
రెడ్‌మి నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల (2272 x 1220 పిక్సెల్‌లు) AMOLED స్క్రీన్‌ను 144Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. రెడ్‌మి K60 Ultra, Mediatek డైమెన్సిటీ 9200+ SoCతో పాటు 24GB వరకు LPDDR5X RAMతో అందిస్తుంది. ఈ డివైజ్ Wildboost 2.0 టెక్నాలజీతో వస్తుందని షావోమీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 3 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని పేర్కొంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. రెడ్‌మి K60 అల్ట్రా ఫోన్ 50MP IMX800 సోనీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP పోర్ట్రెయిట్ కెమెరా నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు ఫోన్ డిస్‌ప్లే పైన పంచ్-హోల్ డిజైన్‌లో 16MP కలిగి ఉంటుంది. రెడ్‌మి K60 Ultra ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. 5G, WiFi, బ్లూటూత్ 5.3, USB టైప్-C పోర్ట్ కనెక్టివిటీ సపోర్టును అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో హెడ్‌ఫోన్ జాక్ లేదు. అయితే, వాటర్, డెస్ట్ నిరోధకతకు IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.
Read Also : Airtel Plan Offer : ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్.. కేవలం రూ.99 మాత్రమే.. అన్‌లిమిటెడ్ 5G డేటా బెనిఫిట్స్..!