Redmi Note 11 Series: గంటలో 5లక్షల రెడ్‌మి ఫోన్ల అమ్మకాలు.. సరికొత్త రికార్డు!

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ రెడ్ మి నోట్ సిరీస్ ఫోన్లు లక్షల్లో అమ్మడయ్యాయి. కేవలం గంట వ్యవధిలోనే 5 లక్షల యూనిట్ల హ్యాండ్ సెట్లు సేల్ అయ్యాయి.

Redmi Note 11 Series: గంటలో 5లక్షల రెడ్‌మి ఫోన్ల అమ్మకాలు.. సరికొత్త రికార్డు!

Redmi Note 11 Series Sells Over 5 Lakh Units In India

Redmi Note 11 Series: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ రెడ్ మి నోట్ (Redmi Note 11) సిరీస్ ఫోన్లు లక్షల్లో అమ్మడయ్యాయి. కేవలం గంట వ్యవధిలోనే 5 లక్షల యూనిట్ల హ్యాండ్ సెట్లు సేల్ అయ్యాయి. ఒక చైనాలోనే కాదు.. భారత్ సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో సేల్స్ సునామీ సృష్టించింది షావోమీ. ఇండియాలో స్మార్ట్‌ఫోన్‌ 3వ త్రైమాసిక ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో షావోమీ సంస్థకు చెందిన Redmi 9 సిరీస్‌ ఫోన్లు ఈ ఏడాదిలో అత్యధికంగా అమ్ముడయ్యాయి. షావోమీకి చెందిన మరో మోడల్ ఫోన్లు కూడా సేల్స్ సునామీ సృష్టించాయి. Redmi Note 11 series సేల్ ప్రారంభమైన గంటలోపు 5 లక్షల కంటే ఎక్కువ యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు షావోమీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

గత వారమే రెడ్‌మీ నోట్‌ సిరీస్‌లో Redmi Note 11, Redmi Note 11pro, Redmi Note Pro Plus వేరియంట్లను షావోమీ విడుదల చేసింది. చైనా మార్కెట్లలో సేల్స్‌ ప్రారంభమైన గంటలోపు 5 లక్షల ఫోన్‌లు అమ్ముడైనట్లు షావోమీ పేర్కొంది. అమ్మకాలు ప్రారంభమైన మొదటి 52 నిమిషాల 11 సెకన్లలో సుమారు 4 బిలియన్ యువాన్‌ల బిజినెస్‌ జరిగిందని తెలిపింది.
Meta Smartwatch : ఆపిల్‌కు పోటీగా.. ఫేస్‌బుక్ ఫ్రంట్ కెమెరా స్మార్ట్‌వాచ్.. ఫొటో లీక్!

ఒక నిమిషం 45 సెకన్లలో 2 బిలియన్ యువాన్లు బిజినెస్‌ జరిగినట్లు కంపెనీ పేర్కొంది. నివేదిక ప్రకారం..భారత్‌లోనూ షావోమీ ఫోన్‌లు సేల్స్‌ భారీగా పెరిగాయి. 2021 ఏడాదిలో షావోమీకి చెందిన రెడ్‌ మీ నోట్‌ 10 రిలీజ్ అయిన 3నెలల్లో ఒక్క భారత్‌లోనే 20లక్షల ఫోన్‌లు అమ్ముడైనట్లు నివేదికలో పేర్కొంది.

చైనాలో రెడ్ మి నోట్ 11 సేల్స్ సమయంలో 4GB ర్యామ్‌ 128GB స్టోరేజ్‌ రెడ్‌ మీ నోట్‌ 11 ధర రూ.14వేలు ఉంటే.. 6GB ర్యామ్‌ 128GB స్టోరేజ్‌ రెడ్‌ మీ నోట్‌ 11pro సుమారు రూ.18,700గా నమోదైంది. రెడ్‌ మీ నోట్‌ 11ప్రో ప్లస్‌ ఫోన్‌ ధర రూ.22,200 ధర పలుకుతోంది. 8GBRAM, 256GB స్టోరేజ్‌ రెడ్‌ మీ నోట్‌ 11 ఎడిషన్‌ ఫోన్‌ ధర రూ.31,500గా నిర్ణయించింది.
Read Also : WhatsApp Stop Nov 1 : మీ వాట్సాప్ పనిచేస్తుందా? ఈ రోజు నుంచి ఈ ఫోన్లలో పనిచేయదు!