Meta Smartwatch : ఆపిల్‌కు పోటీగా.. ఫేస్‌బుక్ ఫ్రంట్ కెమెరా స్మార్ట్‌వాచ్.. ఫొటో లీక్!

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఆపిల్ స్మార్ట్ వాచ్ కు దీటుగా మెటా ఫ్రంట్ కెమెరాతో సరికొత్త స్మార్ట్ వాచ్ తీసుకొస్తోంది. ఈ స్మార్ట్ వాచ్‌ను త్వరలో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

Meta Smartwatch : ఆపిల్‌కు పోటీగా.. ఫేస్‌బుక్ ఫ్రంట్ కెమెరా స్మార్ట్‌వాచ్.. ఫొటో లీక్!

Meta Plans To Launch Smartwatch With Camera As Competitor To Apple Watch

Meta Smartwatch : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్‌కు పోటీగా ఫేస్‌బుక్ (మెటా) సరికొత్త స్మార్ట్ వాచ్ తీసుకొస్తోంది. ఇటీవలే ఫేస్‌బుక్ కంపెనీ పేరును Metaగా మార్చేసింది. అయితే ఇప్పుడు సోషల్ దిగ్గజం ఫేస్‌బుక్ ఆపిల్ స్మార్ట్ వాచ్ కు దీటుగా మెటా ఫ్రంట్ కెమెరాతో స్మార్ట్ వాచ్ తీసుకొస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ త్వరలో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇంతలోనే మెటా స్మార్ట్ వాచ్ ఫొటో లీక్ అయింది.

ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో పాటు రౌండెడ్ డిజైన్ ప్రత్యేకంగా యూజర్లను ఆకట్టుకోనుంది. స్మార్ట్‌ఫోన్ల‌కు ఫ్రంట్‌లో కెమెరా మాదిరిగానే స్మార్ట్ వాచ్‌కు కూడా ఫ్రంట్ కెమెరా అమర్చింది. కర్వ్ షేప్ తో ఎడ్జ్ ఉండగా.. కుడివైపు కంట్రోల్ బటన్ అమర్చారు. ఫీచర్లలో పోటీదారు ఆపిల్ కంటే మెటా స్మార్ట్ వాచ్ ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.
Facebook: ఫేస్‌బుక్ పేరు మార్పుపై ట్విట్టర్ లో పేలుతున్న జోకులు

మెటా స్మార్ట్ వాచ్‌ను ఆపిల్ వాచ్ కంటే దీటుగా డిజైన్ చేస్తోంది. 2022లో ఈ స్మార్ట్ వాచ్ లాంఛ్ చేసేందుకు మెటా ప్లాన్ చేస్తోంది. ఫేస్‌బుక్ ఇటీవలే రిలీజ్ చేసిన స్మార్ట్ గ్లాసెస్‌ ద్వారా కూడా రేబాన్ (Ray-Ban) స్మార్ట్‌వాచ్‌తో కంట్రోల్ చేయొచ్చు. మెటా ప్ర‌స్తుతం వ‌ర్చువ‌ల్ రియాల్టీ హెడ్‌సెట్స్‌, పోర్ట‌ల్ వీడియో చాట్ డివైజ్‌ల‌ను కూడా విక్రయించనుంది.

హైఎండ్ హెడ్‌సెట్‌.. ప్రాజెక్ట్ కాంబ్రియాను కూడా లాంచ్ చేస్తామని మెటా ప్రకటన చేసింది. ప్రాజెక్ట్ కాంబ్రియా అంటే.. వ‌ర్చువ‌ల్ రియాల్టీ, ఆగ్‌మెంటెడ్ రియాల్టీ మిక్సింగ్ అనమాట.. మెటా నుంచి లాంచ్ కాబోయే ఈ స్మార్ట్‌వాచ్‌తో హెడ్‌సెట్స్‌ను కూడా కంట్రోల్ చేయొచ్చు. మెటా నుంచి లాంచ్ అయ్యే అన్ని డివైజ్‌ల‌కు ఈ స్మార్ట్‌వాచ్ ఒక ఇన్‌పుట్ డివైజ్‌లా పనిచేయనుంది.
Read Also : WhatsApp Stop : న‌వంబ‌ర్ 1 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ ప‌నిచేయ‌దు.. మీ ఫోన్ ఉందో చెక్ చేసుకోండి!