Facebook: ఫేస్‌బుక్ పేరు మార్పుపై ట్విట్టర్ లో పేలుతున్న జోకులు

ఫేస్‌బుక్ పేరు మార్చిందనే విషయం బయటకు తెలిసే లోపే ట్రోలింగ్స్ మొదలైపోయాయి. ఎఫ్బీ పేరు మారుస్తున్నామంటూ సీఈఓ జూకర్ బర్గ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Facebook: ఫేస్‌బుక్ పేరు మార్పుపై ట్విట్టర్ లో పేలుతున్న జోకులు

Facebook Twitter

Facebook: ఫేస్‌బుక్ పేరు మార్చిందనే విషయం బయటకు తెలిసే లోపే ట్రోలింగ్స్ మొదలైపోయాయి. ఎఫ్బీ పేరు మారుస్తున్నామంటూ సీఈఓ జూకర్ బర్గ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కొత్త పేరు Metaను సూచిస్తూ.. చేసిన బహిరంగా ప్రకటన ఇంటర్నెట్ లో పెద్ద జోక్ గా మారింది. దీనిపై ట్విట్టర్ లో ఇంకా ఈ జోక్ నడుస్తూనే ఉందంటూ కొద్ది గంటల తర్వాత పోస్టు చేసింది.

Facebook పేరును Meta చేశారా.. Meatగా మార్చారా..
ఇది మెటానా.. మీట్ఆ.. పేరు ఏంటండి అలా ఉంది.

ఇదేదో డ్రగ్ పేరులా అనిపిస్తుంది.
మెటా అనేది పేరెంట్ కంపెనీ పేరు అయితే.. ఇంకా ఫేస్ బుక్ అనే పేరు మీదనే యాప్ ఎందుకు ఉంది. మీరు మెటాలో ఉన్నారా అని ఎలా అడుగుతాం. అదేదో డ్రగ్ పేరులా వినిపిస్తుంది.

………………………………… : భారత్ లో బంగారానికి భారీ డిమాండ్‌

ప్రపంచ శాంతి కోసం మెటాగా పేరు మార్చారా..
ప్రో బాస్కెట్ బాల్ మాజీ ప్లేయర్ అయిన మెట్టా వరల్డ్ పీస్ పేరుకు బదులుగా మార్చారా.. అంటూ మరో యూజర్ ట్వీట్ చేశాడు.

ఇదేం పెద్ద సమస్య కాదు
ఫేస్‌బుక్ క్రిటిక్స్ చేస్తున్న కామెంట్లపై ఒక యాక్టివిస్ట్ ఇలా అంటున్నారు. పేరు మార్చడం అనేది పెద్ద సమస్య కాదని.. ఫేస్ బుక్ పేరు మారింది కానీ, పని మారలేదని అంటున్నారు.