Gold : భారత్ లో బంగారానికి భారీ డిమాండ్‌

అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్‌ తగ్గుతున్నా, భారత్ లో భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో దేశంలో బంగారం డిమాండ్‌ 47 శాతం వృద్ధితో 139.1 టన్నులకు చేరింది.

Gold : భారత్ లో బంగారానికి భారీ డిమాండ్‌

Gold

Huge demand for gold : అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్‌ తగ్గుతున్నా, భారత్ లో మాత్రం భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో దేశంలో బంగారం డిమాండ్‌ 47 శాతం వృద్ధితో 139.1 టన్నులకు చేరినట్లు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. గత సంవత్సరం ఇదేకాలంలో బంగారానికి డిమాండ్‌ 94.6 కోట్ల టన్నులుగా ఉంది.

విలువ రీత్యా సెప్టెంబర్‌ త్రైమాసికంలో బంగారానికి డిమాండ్‌ 37 శాతం వృద్ధితో రూ. 43,160 కోట్ల నుంచి రూ. 59,330 కోట్లకు పెరిగినట్లు కౌన్సిల్‌ తెలిపింది. భారత్ లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పాటు బంగారం ధర తగ్గడం అధిక కొనుగోళ్లకు కలసివచ్చిందని డబ్ల్యూజీసీ ఇండియా సీఈవో సోమసుందరం పేర్కొన్నారు.

Petrol, Diesel Price : మండుతున్న పెట్రో మంటలు..అక్టోబర్ లో 22 సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

గత సంవత్సరం కంటే ఈ జూలై-సెప్టెంబర్‌లో జ్యువెల్లరీ డిమాండ్‌ 58 శాతం వృద్ధితో 60.8 టన్నుల నుంచి 96.2 టన్నులకు చేరింది. విలువ ప్రకారం 48 శాతం ఎగిసి రూ. 27,750 కోట్ల నుంచి రూ.41,030 కోట్లకు పెరిగింది. ఇన్వెస్ట్‌మెంట్‌ డిమాండ్‌ 33.8 టన్నుల నుంచి రూ. 42.9 టన్నులకు వృద్ధి చెందింది. విలువలో ఇది రూ.18,300 కోట్లుగా నిలిచింది.