Petrol, Diesel Price : మండుతున్న పెట్రో మంటలు..అక్టోబర్ లో 22 సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలో చమురు ధరల పెరుగుదల కొనసాగుతోంది. వరుసగా మూడో రోజూ చమురు ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ పై 35 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెరిగింది.

Petrol, Diesel Price : మండుతున్న పెట్రో మంటలు..అక్టోబర్ లో 22 సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol (1)

petrol and diesel prices hike : దేశంలో చమురు ధరల పెరుగుదల కొనసాగుతోంది. వరుసగా మూడో రోజూ చమురు ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ పై 35 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 108.64, డీజిల్ రూ. 97.37కు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.114.47, డీజిల్ రూ.105.49 పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 105.43,డీజిల్ రూ.101.59 పెరిగింది.

కోల్ కతాలో లీటర్ పెట్రోల్ రూ.109.02, డీజిల్ రూ.100.49 పెరిగింది. అక్టోబర్ నెలలో 22 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పటివరకు అక్టోబర్ నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు 6 రూపాయలకు పైగా పెరిగాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 37 పైసలు, డీజిల్ 38 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.113, డీజిల్ రూ.106.22కు చేరింది.

PM Modi : నేటి నుంచి ప్రధాని మోడీ విదేశీ పర్యటన..జీ-20 సదస్సులో పాల్గోనున్న పీఎం

దేశంలో 14 రాష్ట్రాల్లో లీటర్ డీజిల్ ధర రూ.100 దాటింది. కేరళ, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, పశ్చిమ బెంగాల్, లేహ్‌లో డీజిల్ ధర రూ.100 దాటింది.

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటంతో భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 85 డాలర్ల కు చేరింది. సెప్టెంబర్ నెల నుంచి అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 9-10 డాలర్లు పెరిగింది.