PM Modi : నేటి నుంచి ప్రధాని మోడీ విదేశీ పర్యటన..జీ-20 సదస్సులో పాల్గోనున్న పీఎం

ప్రధాని మోడీ నేటి నుంచి నవంబర్ 2 వరకు విదేశీ పర్యటనలు చేయనున్నారు. ఇటలీ, యుకేలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఇటలీలో 16వ జీ 20 సదస్సులో పాల్గోనున్నారు.

PM Modi : నేటి నుంచి ప్రధాని మోడీ విదేశీ పర్యటన..జీ-20 సదస్సులో పాల్గోనున్న పీఎం

Pm Modi

Updated On : October 29, 2021 / 7:40 AM IST

PM modi Italy and UK tour : ప్రధాని మోడీ నేటి నుంచి నవంబర్ 2 వరకు విదేశాల పర్యటన చేయనున్నారు. ఇటలీ, యుకేలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఇటలీలో 16వ జీ 20 సదస్సులో పాల్గోనున్నారు. విదేశీ పర్యటనలో భాగంగా మోడీ ఇటలీ బయలుదేరివెళ్లారు. ఇటలీ, బ్రిటన్ లో ఐదు రోజులపాటు పర్యటించనున్నారు.

ఇటలీలో నేటి నుంచి అక్టోబర్ 31 వరకు పర్యటించున్నారు. అక్టోబర్ 31న రోమ్ వేదికగా జీ-20 సదస్సు జరుగనుంది. జీ-20 సదస్సులో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. కరోనా సహా భవిష్యత్ లో వచ్చే వ్యాధులను ఎదుర్కోవడంపై చర్చ జరగనుంది. కరోనా అనంతర పరిస్థితులపైనా జీ-20 సదస్సులో చర్చించనున్నారు.

Facebook: ఫేస్‌బుక్ పేరు మార్చిన జుకర్ బర్గ్

రోమ్ లో పలు అంతర్జాతీయ నేతలతో మోడీ భేటీ కానున్నారు. వాటికన్ లో పోప్ ఫ్రాన్సిస్ తో మోడీ సమావేశం కానున్నారు. నవంబర్ 1, 2 తేదీల్లో బ్రిటన్ లో మోడీ పర్యటించనున్నారు. గ్లాస్ గో వేదికగా జరిగే కాప్ – 26 సదస్సుకు హాజరుకానున్నారు. వాతావరణ, పర్యావరణ మార్పులపై కాప్ – 26 సదస్సులో చర్చ జరుగనుంది.