Reliance Jio 5G : భారత్‌లో జియో 5G Wi-Fi సర్వీసులు.. Jio True5G సర్వీసు ఏయే నగరాల్లో అందుబాటులోకి వచ్చిందంటే..!

Reliance Jio 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ఎట్టకేలకు భారత మార్కెట్లో JioTrue 5G-ఆధారిత Wifi సర్వీసులను (Jio True 5G Wifi Services) అందుబాటులోకి తీసుకొచ్చింది.

Reliance Jio 5G : భారత్‌లో జియో 5G Wi-Fi సర్వీసులు.. Jio True5G సర్వీసు ఏయే నగరాల్లో అందుబాటులోకి వచ్చిందంటే..!

Reliance Jio 5G powered wifi services now live in India Here is everything you need to know

Reliance Jio 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ఎట్టకేలకు భారత మార్కెట్లో JioTrue 5G-ఆధారిత Wifi సర్వీసులను (Jio True 5G Wifi Services) అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యాసంస్థలు, మతపరమైన ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, వాణిజ్య కేంద్రాలు, ఎక్కువ మంది నడిచే ప్రాంతాలలో ఈ Wifi సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్లు టెలికాం కంపెనీ ప్రకటించింది.

రిలయన్స్ గతంలో JioTrue5G సర్వీసులను Jio వెల్‌కమ్ ఆఫర్‌ను ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిలలో ప్రారంభించింది. JioTrue 5G సర్వీసులు రాజస్థాన్‌లోని ఆలయ నగరమైన నాథ్‌ద్వారాలో ప్రారంభమయ్యాయి. Jio వెల్‌కమ్ ఆఫర్ వ్యవధిలో ఎలాంటి ఛార్జీ లేకుండా జియో యూజర్లు ఈ సర్వీసును పొందవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. Jio యేతర యూజర్లు Jio True5G సర్వీసులను ఎంచుకునే ముందు ఈ సర్వీసును ప్రయత్నించవచ్చు.

ఈ సర్వీసులపై రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ ఎం అంబానీ మాట్లాడుతూ.. ‘ఈ రోజు పవిత్రమైన నాధ్‌ద్వారా, లార్డ్ శ్రీనాథ్ జీ ఆలయంలో ఫస్ట్ True5G ఆధారిత Wi-Fi సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో వైఫై సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

Reliance Jio 5G powered wifi services now live in India Here is everything you need to know

Reliance Jio 5G powered wifi services now live in India Here is everything you need to know

జియో వైఫై సర్వీసులను ట్రయల్ చేసేందుకు వారిని అనుమతిస్తామన్నారు. అదనంగా, Jio True5G వెల్‌కమ్ ఆఫర్‌కి చెన్నైని కూడా యాడ్ చేస్తున్నామని తెలిపారు. జియోకు 5G సర్వీసులు అందుబాటులో లేవని, కేవలం ప్రత్యేకాధికారులు లేదా పెద్ద నగరాల్లోని వారికి మాత్రమే పరిమితం చేయాలని అంబానీ పేర్కొన్నారు. భారత్‌లో ప్రతి పౌరుడికి, ప్రతి ఇంటికి, ప్రతి వ్యాపారానికి అందుబాటులో ఉండాలే చూస్తామని చెప్పారు. JioTrue5G మరిన్ని నగరాల్లో విస్తరిస్తుందని రిలయన్స్ జియో పేర్కొంది.

Jio వెల్‌కమ్ ఆఫర్‌కు తాజాగా చెన్నై నగరాన్ని కూడా చేర్చినట్టు కంపెనీ తెలిపింది. చెన్నైలోని Jio యూజర్లు 1 Gbps వరకు అన్‌లిమిటెడ్ 5G డేటాను యాక్సెస్ చేయవచ్చు. JioTrue5Gని పొందవచ్చు. ఢిల్లీ విమానాశ్రయం 5G రెడీగా ఉంది. ప్రయాణీకులకు 20 రెట్లు వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తామని హామీ ఇచ్చింది. ఎంపిక చేసిన నగరాల్లో ప్రధానమంత్రి ప్రారంభించనున్న 5G రాబోయే రెండేళ్లలో దేశం మొత్తాన్ని క్రమంగా అందించనుంది. భారత్‌పై 5G ఆర్థిక ప్రభావం 2035 నాటికి 450 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఇటీవలే కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone Users Alert : ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. iOS అప్‌డేట్‌లో కొత్త బగ్.. Face ID ఫీచర్ పనిచేయడం లేదట.. ఓసారి చెక్ చేసుకోండి!