Reliance Jio: జియోతో జాక్‌పాట్ కొట్టండిలా.. రీఛార్జ్ చేయండి.. క్యాష్‌బ్యాక్ పొందండి

రిలయన్స్ రిటైల్ జియో యూజర్లకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ప్రీపెయిడ్ వినియోగదారులు.. మూడు రీఛార్జ్ ప్లాన్లలో దేనికి రీఛార్జ్ చేసినా 20శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చని తెలిపింది

Reliance Jio: జియోతో జాక్‌పాట్ కొట్టండిలా.. రీఛార్జ్ చేయండి.. క్యాష్‌బ్యాక్ పొందండి

Jio Recharge

Reliance Jio: రిలయన్స్ రిటైల్ జియో యూజర్లకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ప్రీపెయిడ్ వినియోగదారులు.. మూడు రీఛార్జ్ ప్లాన్లలో దేనికి రీఛార్జ్ చేసినా 20శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చని తెలిపింది. అలా వచ్చిన క్యాష్‌బ్యాక్ ను అక్టోబర్ 2 తర్వాత రిలయన్స్ రిటైల్ స్టోర్స్ లో కానీ, రిలయన్స్ డిజిటల్ లేదా ఆన్‌లైన్ మార్కెట్ (AJIO) ప్లేసులు .. లాంటి చోట రెడీమ్ చేసుకోవచ్చని తెలిపింది.

ఇక ఈ ఆఫర్ కేవలం జియో వెబ్‌సైట్, మైజియో యాప్ లలో రీఛార్జ్ చేస్తేనే కుదురుతుందంటూ చెప్పింది. రూ.249, రూ.555, రూ.599 ప్లాన్లలో ఏది చేసుకున్న ఈ ఆఫర్ దక్కించుకోవచ్చు. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే లాంటి ప్లాట్ ఫాంల నుంచి రీఛార్జ్ చేసుకున్న వాళ్లకు క్యాష్ బ్యాక్ రాదు.

అందుకే jio.com > Prepaid > Popular Plans > లోకి వెళ్లి (రూ.249, రూ.555, రూ.599) మూడింటిలో ఒక ప్లాన్ ఎంచుకుని > Buy మీద క్లిక్ చేయాలి. అలా రీఛార్జ్ చేసిన తర్వాత జియో అకౌంట్ లోకి క్యాష్ బ్యాక్ క్రెడిట్ అవుతుంది.

ఇది కూడా చదవండి  : నా శివయ్య కరోనా వ్యాక్సిన్ వేయించుకోవద్దని చెప్పాడు..రోడ్డుపై మహిళ వీరంగం

క్యాష్‌బ్యాక్ వచ్చే ప్లాన్ల వివరాలిలా ఉన్నాయి.
* రూ.249 / 56 GB/ అపరిమిత వాయీస్ కాలింగ్/ 100 SMSలు/ 28 రోజుల వ్యాలిడిటీ
* రూ.555 / 126 GB/ అపరిమిత వాయీస్ కాలింగ్/ 100 SMSలు/ 84 రోజుల వ్యాలిడిటీ
* రూ.599 / 168 GB/ అపరిమిత వాయీస్ కాలింగ్/ 100 SMSలు/ 84 రోజుల వ్యాలిడిటీ