Safer Internet Day 2022: ఆన్‌లైన్‌లో మీ పిల్లలు జాగ్రత్త.. సేఫ్‌గా ఉంచేందుకు 5మార్గాలు ఇవే!

సేఫ్ అండ్ క్వాలిటీ ఇంటర్నెట్‌ను అందించాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండవ వారంలో రెండవ రోజును 'Safer Internet Day'ని జరుపుకుంటారు.

Safer Internet Day 2022: ఆన్‌లైన్‌లో మీ పిల్లలు జాగ్రత్త.. సేఫ్‌గా ఉంచేందుకు 5మార్గాలు ఇవే!

Safe Internet

Internet safety: సేఫ్ అండ్ క్వాలిటీ ఇంటర్నెట్‌ను అందించాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండవ వారంలో రెండవ రోజును ‘Safer Internet Day’ని జరుపుకుంటారు. ప్రతి వ్యక్తి తమ డేటాని లీక్‌ కాకుండా బాధ్యతాయుతంగా ఇంటర్నెట్‌ని ఉపయోగించేలా ఉద్దేశించినదే ఈ ‘సురక్షిత ఇంటర్నెట్ ఇంటర్నెట్ దినోత్సవం’. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా 15 దేశాల్లో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

ఆరోగ్యకరమైన మరియు మరింత సురక్షితమైన ఆన్‌లైన్ అనుభవాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో.. భారతదేశంలో కూడా సైబర్ క్రైమ్ కేసుల సంఖ్య ప్రతి సంవత్సరం వేల రెట్లు పెరుగుతుండగా.. నేటి డిజిటల్ ప్రపంచం ముఖ్యంగా పిల్లలకు ప్రమాదకరంగా మారుతోంది.

మీ పిల్లలు ఆన్‌లైన్‌లో వీడియోలు చూస్తున్నా లేదా వీడియో గేమ్‌లు ఆడుతున్నా, వారు చిన్న వయస్సులోనే నెటిజన్లుగా మారుతున్నారు. ఈ ఆన్‌లైన్ ప్రపంచం ప్రతి తల్లిదండ్రులకు కొత్త సవాళ్లను విసురుతోంది. మీ పిల్లలను ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంచడానికి ఇక్కడ 5 మార్గాలు ఉన్నాయి.

1. ఆన్‌లైన్ రిస్క్‌లు, సైబర్‌సెక్యూరిటీ:
రాబోయేకాలం డిజిటల్ ప్రపంచం ఇంకా వేగంగా ప్రతీఒక్కరూ వినియోగించే పరిస్ధితి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో సైబర్ సెక్యూరిటీ గురించి మీరు మీ పిల్లలతో ఓపెన్‌గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. సైబర్‌క్రూక్స్ పిల్లలపై గట్టి ప్రభావం చూపుతుంది. వారి వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేసేలా మోసం చేయవచ్చు. పుట్టిన తేదీ లేదా చిరునామా వంటి వ్యక్తిగత సమాచారాన్ని ముఖ్యంగా అపరిచితులకు బహిర్గతం చేయవద్దని పిల్లలకు సూచించండి. ఇంటర్నెట్‌లో ఏది అనుమానంగా ఉన్నా వెంటనే చెప్పాలని వారిని కోరండి.

2. యాంటీ-వైరస్ ప్రోగ్రామ్‌..
పిల్లలు వినియోగించే డివైజ్‌లలో కానీ, మీ డివైజ్ వారికి ఇచ్చేప్పుడు కానీ, వారికి కచ్చితంగా లేటెస్ట్ యాంటీ-వైరస్ ప్రోగ్రామ్‌లు రన్ అవుతున్నాయో లేదో చూడండి. గోప్యతా సెట్టింగ్‌లు ఆన్‌లో ఉన్నాయో లేదో చెక్ చెయ్యండి. ఉపయోగంలో లేనప్పుడు కచ్చితంగా వెబ్‌క్యామ్‌లను ఆన్‌లో లేకుండా చూసుకోండి.

3. బలమైన పాస్‌వర్డ్‌లు:
బలమైన పాస్‌వర్డ్‌లు సైబర్ మోసగాళ్ల నుంచి మీ పిల్లలను సేవ్ చేయగలవు. మల్టిపుల్ అకౌంట్‌ల కోసం ఒకే పాస్‌వర్డ్‌ని ఉపయోగించవద్దు. మీ పిల్లలకు బలమైన పాస్‌వర్డ్‌ని సృష్టించడంలో సాయం చెయ్యండి. కుటుంబ సభ్యుల పేర్లు లేదా మొబైల్ నంబర్లు వంటి సమాచారాన్ని ఉపయోగించి పాస్‌వర్డ్‌లను క్రియేట్ చెయ్యొద్దు.

4. ఆన్‌లైన్‌లో ఎవరితో కనెక్ట్ అవుతున్నారో గమనించండి
మీ పిల్లలు స్నేహితులు, కుటుంబం ఆన్‌లైన్‌లో ఎవరితో కనెక్ట్ అవుతున్నారో ఓ కంటకనిపెట్టి ఉండండి. సురక్షితంగా, పాజిటివ్‌గా ఉన్నారో లేదో గమనించండి. గతంలో కంటే ఇతరులతో కనెక్ట్ అవ్వడం ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వయస్సుకి సరిపడ కంటెంట్‌ను గుర్తించడంలో మీ చిన్నారికి సహాయపడండి. వయస్సుకు తగిన యాప్‌లు, గేమ్‌లు, ఆన్‌లైన్ వినోదాన్ని గుర్తించడానికి మీ పిల్లలతో సమయాన్ని గడపండి.

5. ఆరోగ్యకరమైన ఆన్‌లైన్..
మీ పిల్లలు సహవిద్యార్థులతో ఆన్‌లైన్‌లో కూడా గౌరవంగా ఉండేలా ప్రోత్సహించండి, వారు ధరించే దుస్తులను కనిపెట్టి ఉండండి. పిల్లలు ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడుపుతుంటే ఎందుకోసం గడుపుతున్నారో కూడా గమనించండి. పిల్లలు, యువకుల కోసం క్వాలిటీ కంటెంట్‌‌పై దృష్టిపెట్టండి. పిల్లల లైంగిక వేధింపులుకి ఆన్‌లైన్ కూడా ఓ మార్గం అవుతుంది అని ఇటీవల నిపుణులు చెబుతున్నారు.