Samsung Credit Card : ఇండియాలో శాంసంగ్ కస్టమర్ల కోసం కొత్త క్రెడిట్ కార్డు వచ్చేసింది.. కార్డుపై ఎన్నో బెనిఫిట్స్ తెలుసా?

Samsung Credit Card : శాంసంగ్ (Samsung) భారతీయ వినియోగదారుల కోసం క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. శాంసంగ్ క్రెడిట్ కార్డ్‌ (Samsung Credit Card)ను ప్రారంభించేందుకు టెక్ కంపెనీ యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) వీసా (Visa)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Samsung Credit Card : ఇండియాలో శాంసంగ్ కస్టమర్ల కోసం కొత్త క్రెడిట్ కార్డు వచ్చేసింది.. కార్డుపై ఎన్నో బెనిఫిట్స్ తెలుసా?

Samsung launches credit card in India in partnership with Axis Bank _ check out the benefits

Samsung Credit Card : శాంసంగ్ (Samsung) భారతీయ వినియోగదారుల కోసం క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. శాంసంగ్ క్రెడిట్ కార్డ్‌ (Samsung Credit Card)ను ప్రారంభించేందుకు టెక్ కంపెనీ యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) వీసా (Visa)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కార్డ్ అనేక ఇతర బెనిఫిట్స్‌తో పాటు ఏడాది పొడవునా Samsung ప్రొడక్టులు, సర్వీసులపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. EMI, EMI యేతర లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ ప్రస్తుతం ఉన్న ఆఫర్‌ల కన్నా ఎక్కువగా అందించనుంది.

Samsung ప్రొడక్టులు, సర్వీసులను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు తమ కార్డ్‌ని ఉపయోగించిన ప్రతిసారీ రివార్డ్ కోసం Samsung యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యాక్సస్ చేసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లు(Smartphones), టాబ్లెట్‌లు (Tablets), ల్యాప్‌టాప్‌లు (Laptops), టెలివిజన్‌లు (Televisions), రిఫ్రిజిరేటర్‌లు, ACలు, వాషింగ్ మెషీన్‌లు లేదా సర్వీస్ సెంటర్ పేమెంట్స్, Samsung Care+ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌లు, ఎక్సంటెడ్ వారంటీలు వంటి Samsung సర్వీసుల వంటి ప్రొడక్టులను కొనుగోలు చేస్తే10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Samsung launches credit card in India in partnership with Axis Bank _ check out the benefits

Samsung launches credit card in India in partnership with Axis Bank _ check out the benefits

పైన్ ల్యాబ్స్, బెనౌ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌ల ద్వారా Samsung ప్రొడక్టులను విక్రయించే ఆఫ్‌లైన్ ఛానెల్‌లకు, Samsung.com, Samsung షాప్ యాప్, Flipkartలో ఆన్‌లైన్‌లో అధీకారిక Samsung సర్వీస్ సెంటర్‌లలో 10 శాతం క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది. శాంసంగ్ ఇండియా (Samsung India), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) రెండూ బిగ్‌బాస్కెట్, మైంత్రా, టాటా 1MG, అర్బన్ కంపెనీ, జొమాటోతో సహా కొన్ని కీలక పార్టనర్లతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు, డైనింగ్ ఆఫర్‌లు, యాక్సిస్ బ్యాంక్, వీసా నుంచి ఆఫర్లను కూడా యాక్సస్ చేసుకోవచ్చు.

క్రెడిట్ కార్డ్ రెండు వేరియంట్‌లలో వస్తుంది. ఒకటి వీసా సిగ్నేచర్ (Visa Signature) వీసా ఇన్ఫినిట్ (Visa Infinite). సిగ్నేచర్ వేరియంట్‌లో.. కార్డ్ హోల్డర్‌లు నెలవారీ క్యాష్‌బ్యాక్ లిమిట్ రూ. 2500తో ఏడాదికి రూ. 10,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వేరియంట్ కార్డ్ హోల్డర్లు నెలవారీ క్యాష్‌బ్యాక్ లిమిట్ రూ. 5,000తో ఏడాదికి రూ. 20వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. కార్డ్ హోల్డర్‌లు Samsung కొనుగోళ్లలో అతి చిన్న వాటిపై 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అదనంగా, కార్డ్ హోల్డర్‌లు Samsung ఎకోసిస్టమ్ అవతలి ఖర్చుపై ఎడ్జ్ రివార్డ్ పాయింట్‌లను కూడా పొందవచ్చు.

Samsung launches credit card in India in partnership with Axis Bank _ check out the benefits

Samsung launches credit card in India in partnership with Axis Bank 

సిగ్నేచర్ వేరియంట్‌కు వార్షిక రుసుము రూ. 500, పన్నులు, ఇన్ఫినిట్ వేరియంట్‌కు రూ. 5వేలు, పన్నులు. రెండు వేరియంట్‌లు ఎడ్జ్ రివార్డ్ పాయింట్‌లతో వెలకబ్ బెనిఫిట్స్ వస్తాయి, కార్డ్ హోల్డర్‌లు తమ కార్డ్‌లో మొదటి 3 లావాదేవీలను పూర్తి చేసిన తర్వాత ఈ రివార్డులను సంపాదిస్తారు. సిగ్నేచర్ వేరియంట్ కార్డ్ హోల్డర్‌లు రూ. 500 విలువైన 2500 పాయింట్‌లను పొందవచ్చు. అయితే ఇన్ఫినిట్ వేరియంట్ కార్డ్ హోల్డర్‌లు రూ. 6వేల విలువైన 30వేల పాయింట్‌లను వన్-టైమ్ వెల్‌కమ్ బెనిఫిట్‌గా పొందవచ్చు.

Samsung, Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వెబ్‌సైట్ : www.samsung.com/in/samsung-card Samsung యాప్ (Samsung Shop, Samsung Pay, Samsung సభ్యులు), Axis బ్యాంక్ ఛానెల్‌ల ద్వారా కార్డ్ కోసం వినియోగదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. కస్టమర్‌లు Samsung యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై ప్రత్యేక మైక్రోసైట్‌లో నమోదు చేసుకోవచ్చు. samsung.com/in/samsung-card. త్వరలో దరఖాస్తులు తెరవనున్నట్లు కంపెనీ తెలిపింది. నిర్దిష్ట తేదీ ఇంకా ప్రకటించలేదు.

Read Also : Samsung Galaxy Phones : తగ్గేదేలే.. ఆపిల్‌కు పోటీగా శాంసంగ్.. ఐఫోన్ల తర్వాత గెలాక్సీ ఫోన్లలోనూ శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్..!