బీ కేర్‌ఫుల్ : ఫేస్‌బుక్ 10ఇయర్ ఛాలెంజ్ వెనుక అసలు కథ

సోషల్ మీడియాలో రోజుకో కొత్త చాలెంజ్ వైరల్‌గా మారటం యూత్ దాన్ని ఫాలో కావడం ట్రెండ్‌గా మారింది. అయితే ఐస్ బకెట్, రైస్ బకెట్ చాలెంజ్, కికీ చాలెంజ్ వంటి వాటి తర్వాత లేటెస్ట్‌గా వచ్చింది టెన్ ఇయర్ చాలెంజ్. ప్రపంచమంతా ఇప్పుడీ చాలెంజ్ గురించే చర్చించుకుంటోంది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

  • Published By: veegamteam ,Published On : January 21, 2019 / 11:27 AM IST
బీ కేర్‌ఫుల్ : ఫేస్‌బుక్ 10ఇయర్ ఛాలెంజ్ వెనుక అసలు కథ

సోషల్ మీడియాలో రోజుకో కొత్త చాలెంజ్ వైరల్‌గా మారటం యూత్ దాన్ని ఫాలో కావడం ట్రెండ్‌గా మారింది. అయితే ఐస్ బకెట్, రైస్ బకెట్ చాలెంజ్, కికీ చాలెంజ్ వంటి వాటి తర్వాత లేటెస్ట్‌గా వచ్చింది టెన్ ఇయర్ చాలెంజ్. ప్రపంచమంతా ఇప్పుడీ చాలెంజ్ గురించే చర్చించుకుంటోంది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

సోషల్ మీడియాలో రోజుకో కొత్త చాలెంజ్ వైరల్‌గా మారటం యూత్ దాన్ని ఫాలో కావడం ట్రెండ్‌గా మారింది. అయితే ఐస్ బకెట్, రైస్ బకెట్ చాలెంజ్, కికీ చాలెంజ్ వంటి వాటి తర్వాత లేటెస్ట్‌గా వచ్చింది టెన్ ఇయర్ చాలెంజ్. ప్రపంచమంతా ఇప్పుడీ చాలెంజ్ గురించే చర్చించుకుంటోంది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్ వాడేవాళ్లంతా ఇప్పుడు వేలం వెర్రిగా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. పదేళ్ల క్రితం నాటి ఫోటోనూ లేటేస్ట్ ఫోటోను కలిపి ఫేస్ బుక్‌లో పోస్టు చేయడమే ఈ చాలెంజ్. చూడ్డానికి చాలా సింపుల్‌గా అనిపిస్తున్నా దీని వెనుక పెద్ద తతంగమే ఉందంటున్నారు టెక్ నిపుణులు. ఈ చాలెంజ్ వెనుక అనేక కోణాలు ఉన్నాయని, ఇదో బిజినెస్ ఐడియా కూడా కావొచ్చని, కాబట్టి దీంతో జాగ్రత్తగా ఉండాలని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇంతకీ ఈ ట్రెండ్ ఎలా మొదలైంది.. ఈ చాలెంజ్‌ వల్ల ఎదురయ్యే సమస్యలేంటి..

* 10 ఇయర్ చాలెంజ్‌లో భాగంగా పదేళ్ల క్రితంనాటి ఫొటోను, ప్రస్తుత ఫొటోను పక్కపక్కన పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేయాలి.
* గతంలో ఎలా ఉన్నారో, ఇప్పుడు ఎలా మారిపోయారో ఆ ఫోటోలను చూస్తే అర్థమైపోతుంది. అదే 10 Year Challenge.
* చాలెంజ్ మొదలైన 3 రోజుల్లోనే 52 లక్షల మందికిపైగా తమ ఫొటోలను షేర్ చేశారు.
* సామాన్యులతో పాటు సెలెబ్రిటీలు కూడా చాలెంజ్‌లో భాగం
* 10 ఇయర్స్ చాలెంజ్‌ దుర్వినియోగం అయ్యే అవకాశాలు
* ఫేస్‌బుక్ తన కృత్రిమ మేధా వ్యవస్థకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ఈ ఫొటోలను ఉపయోగించే అవకాశాలు
* ఫేస్‌బుక్‌లో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ
* పదేళ్ల నాటి ఫొటోలు, ఇప్పటి ఫొటోలు ఒకే దగ్గర చేరితే ఆ ముఖాల్లో వచ్చిన మార్పులను స్టడీ చేయడం ద్వారా మనుషుల మొహాలను గుర్తించే టెక్నాలజీని మరింత అభివృద్ధి చేయడానికి చాన్స్
* ఈ టెక్నాలజీ నేర పరిశోధనలో ఉపయోగ పడే ఛాన్స్
* చాలెంజ్‌ దుర్వినియోగం అయ్యే అవకాశాలు
* ముఖాల్లో వచ్చిన మార్పులను స్టడీ చేయొచ్చు
* బ్యూటీ ప్రాడెక్ట్స్ ప్రకటనలు గుప్పిస్తాయి
* ముఖకవలికల్లో ఎక్కువగా తేడా ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీలకు మనం టార్గెట్ కావచ్చు
* ఫోటోలు మార్ఫింగ్ బారినపడే ప్రమాదం

కానీ, ఫేస్ బుక్‌ మాత్రం దాన్ని ఒప్పుకోవట్లేదు. యూజర్లకు తమ వెబ్‌సైట్‌లో ఫేషియల్ రికగ్నిషన్ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకునే అవకాశం కూడా ఉందని అది సూచిస్తోంది. అయితే ఓ మంచి పని కోసం మనం పోస్ట్ చేసిన ఫోటోలు వాడితే తప్పులేదు కానీ వాటిని దుర్వినియోగం చేసే అవకాశాలు ఉండటమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. పదేళ్ల క్రితం ఫొటోలను, ఇప్పటి ఫొటోలను విశ్లేషించడం ద్వారా బ్యూటీ ప్రాడెక్ట్స్, ఇతర వైద్య సేవల ప్రకటనలను యూజర్లకు ఎక్కువ సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. అలాగే పదేళ్లలో మరీ ఎక్కువ మార్పులు వచ్చినట్టు కనిపిస్తే, అలాంటి వారిని ఇన్సూరెన్స్ సంస్థలు కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే, మొత్తంగా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉంది. ఫొటోల మార్ఫింగ్‌కు కూడా చాన్స్ ఉండటంతో కాస్త ఆచితూచి ఫొటోలను షేర్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.