OnePlus Phones : ఈ వన్‌ప్లస్ ఫోన్లలో 5G సపోర్టు కోసం కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వస్తోంది.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!

OnePlus Phones : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌‌ప్లస్ (OnePlus) కొన్ని స్మార్ట్‌ఫోన్ల కోసం కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందిస్తోంది. వన్‌ప్లస్ అందించే ఈ కొత్త అప్‌డేట్ Jio 5Gకి సపోర్టు అందిస్తుంది. కంపెనీ కమ్యూనిటీ ఫోరమ్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్ రిలీజ్ చేయనున్నట్టు ధృవీకరించింది.

OnePlus Phones : ఈ వన్‌ప్లస్ ఫోన్లలో 5G సపోర్టు కోసం కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వస్తోంది.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!

These OnePlus phones are getting software update for 5G support

OnePlus Phones : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌‌ప్లస్ (OnePlus) కొన్ని స్మార్ట్‌ఫోన్ల కోసం కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందిస్తోంది. వన్‌ప్లస్ అందించే ఈ కొత్త అప్‌డేట్ Jio 5Gకి సపోర్టు అందిస్తుంది. కంపెనీ కమ్యూనిటీ ఫోరమ్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్ రిలీజ్ చేయనున్నట్టు ధృవీకరించింది. OnePlus Nord 5G, Nord CE 5G కోసం అప్‌డేట్ అందించవచ్చు.

కొన్ని వారాల క్రితమే OnePlus 10R, OnePlus 10T, OnePlus 10 Pro అదే అప్‌డేట్ అందుకోవచ్చు. OnePlus Nord డివైజ్‌లు రెండూ ఇప్పటికే Airtel 5Gకి సపోర్ట్‌ను కలిగి ఉన్నాయి. ఇప్పుడు Jio 5G నెట్‌వర్క్‌కు సపోర్టును అందిస్తున్నాయి. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సిస్టమ్ స్టేబుల్ కూడా అందిస్తుంది. అక్టోబర్ నెలలో ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌ను కూడా అందిస్తుంది. రాబోయే ఈ కొత్త అప్‌డేట్ క్రమంగా అందరి యూజర్లకు అందుబాటులోకి రానుంది.

These OnePlus phones are getting software update for 5G support

These OnePlus phones are getting software update for 5G support

ఎప్పటిలాగే, ఈ OTA పెరుగుతూ వస్తోంది. OTA తక్కువ శాతం యూజర్లకు చేరుకోనుంది. కొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని కంపెనీ తెలిపింది. OnePlus యూజర్లు నోటిఫికేషన్‌ను అందుకోకుంటే మాన్యువల్‌గా కూడా అప్‌డేట్ కోసం చెక్ చేసుకోవచ్చు. యూజర్లు కేవలం ఫోన్ సెట్టింగ్ సెక్షన్ వెళ్లి, అప్‌డేట్ కోసం చెక్ చేయడానికి సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్ చేసుకోవాలి.

OnePlus Nord కంపెనీ నుంచి సరసమైన ధరలో లభించే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే.. జూలై 2020లో లాంచ్ అయింది. హ్యాండ్‌సెట్ ఆక్సిజన్ OS 13, Android 13 అప్‌డేట్‌ను అందుకునే అవకాశం లేదు. జూలై 2023 వరకు Android సెక్యూరిటీ ప్యాచ్‌లను పొందవచ్చు.

These OnePlus phones are getting software update for 5G support

These OnePlus phones are getting software update for 5G support

జూన్ 2021లో ఈ మిడ్-రేంజ్ డివైజ్ OnePlus Nord CE ద్వారా అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ డివైజ్ H1 2023లో మొదటి OxygenOS 13 ఓపెన్ బీటా అప్‌డేట్‌ను అందుకోనుంది. ఒకవేళ మీకు ఈ కొత్త అప్‌డేట్ గురించి తెలియకుంటే.. రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్‌టెల్ (Bharati Airtel) రెండూ గత నెలలో భారత మార్కెట్లో 5G సర్వీసులను ప్రారంభించాయి.

ఎంపిక చేసిన నగరాల్లో ప్రస్తుతం ఈ 5G సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 2023 చివరి నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలలో 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయని టెలికాం కంపెనీలు తెలిపాయి. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, చెన్నై, ఇతర నగరాల్లోని వన్ ప్లస్ యూజర్లు 5Gని యాక్సస్ చేసుకోవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel 5G on OnePlus : అన్ని 5G వన్‌ప్లస్, ఒప్పో ఫోన్లలో ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. ఫుల్ లిస్ట్ ఇదిగో.. 5G ఎనేబుల్ ఎలా చేయాలో తెలుసా?