Twitter Blue Tick : ట్విట్టర్ ఆండ్రాయిడ్ యూజర్లు రూ.900లకే బ్లూ టిక్ మార్క్ కొనుగోలు చేయొచ్చు!

Twitter Blue Tick : ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter) బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఇప్పుడు Androidలో నెలకు 11 డాలర్లు (దాదాపు రూ. 900)కి అందుబాటులో ఉంది. ఎలోన్ మస్క్ కంపెనీని స్వాధీనం చేసుకున్న తర్వాత మొదటిసారి ట్విట్టర్ బ్లూ టిక్ మార్క్ రీస్టోర్ అయింది.

Twitter Blue Tick : ట్విట్టర్ ఆండ్రాయిడ్ యూజర్లు రూ.900లకే బ్లూ టిక్ మార్క్ కొనుగోలు చేయొచ్చు!

Twitter Android users can now buy blue tick mark for Rs 900 with Blue subscription

Twitter Blue Tick : ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter) బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఇప్పుడు Androidలో నెలకు 11 డాలర్లు (దాదాపు రూ. 900)కి అందుబాటులో ఉంది. ఎలోన్ మస్క్ కంపెనీని స్వాధీనం చేసుకున్న తర్వాత మొదటిసారి ట్విట్టర్ బ్లూ టిక్ మార్క్ రీస్టోర్ అయింది. ఇప్పుడు Twitter బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రొఫైల్ పేరు పక్కన కనిపించే బ్లూ టిక్ (Blue Tick) ట్విట్టర్ యూజర్లు ఫీచర్ కోసం చెల్లించాల్సి ఉంటుందని మస్క్ ప్రకటించారు. కొత్త సబ్‌స్క్రైబర్‌లు తమ ప్రొఫైల్ పేరు పక్కన టిక్ మార్క్ కూడా పొందుతారు. Twitter బ్లూ సబ్‌స్క్రిప్షన్ మొదట iOS, వెబ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ఇంకా భారత ట్విట్టర్ యూజర్లకు అందుబాటులో లేదు.

iOS, Android యూజర్ల కోసం అమెరికాలో Twitter బ్లూ నెల ధర నెలకు 11 డాలర్లు అని అధికారిక Twitter బ్లాగ్ పేర్కొంది. అయితే వెబ్ యూజర్లు 8 డాలర్లు (దాదాపు రూ. 700) మాత్రమే చెల్లించాలి. ఎందుకంటే Google, Apple కంపెనీ ప్రొఫైల్ షేర్‌ని పరిమితం చేసే యాప్‌లో కొనుగోళ్లపై భారీ కమీషన్ అందిస్తోంది. బ్లాగ్ ప్రకారం.. ట్విట్టర్ బ్లూ యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్‌లో కూడా అందుబాటులో ఉంది. ట్విట్టర్ బ్లూ టిక్ కోసం ప్రొఫైల్‌లను రివ్యూ చేస్తుందని చెబుతోంది. అయినప్పటికీ కఠినమైన ప్రక్రియ కాదు. ప్రొఫైల్ అథెంటికేషన్ కలిగి ఉందా? లేదా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తుందా? అని కంపెనీ వెరిఫై చేసే వీలుంది.

Twitter Android users can now buy blue tick mark for Rs 900 with Blue subscription

Twitter Android users can now buy blue tick mark for Rs 900

Read Also : Twitter Down : ట్విటర్ సేవలకు అంతరాయం.. మీమ్స్‌తో మస్క్‌ను ఆడుకున్న నెటిజన్లు.. నవ్వకుండా ఉండలేరు ..

బ్లూ చెక్‌మార్క్ మినహా అన్ని Twitter బ్లూ ఫీచర్‌లు అందుబాటులోకి వచ్చాయి. సబ్‌స్క్రయిబ్ చేసిన అకౌంట్లు అన్ని అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని రివ్యూ చేసిన తర్వాత అర్హత ఉన్న ప్రొఫైల్‌లలో కనిపిస్తుంది. ఆసక్తికరంగా, ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను కొంతమంది తాలిబాన్ సభ్యులు కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కనీసం ఇద్దరు తాలిబాన్ అధికారులు గ్రూప్‌లోని నలుగురు ప్రముఖ మద్దతుదారులు తమ ప్రొఫైల్‌లో బ్లూ టిక్ అందుకున్నారని నివేదిక పేర్కొంది.

Twitter బ్లూ ఫీచర్లతో బెనిఫిట్స్ ఏంటి? :
ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ ప్రొఫైల్ పేరు పక్కన బ్లూ టిక్ మార్క్‌ను యాడ్ చేస్తుంది. ముందుగా, ‘Undo’ ట్వీట్‌లను కలిగి ఉంటుంది. పేరు సూచించినట్లుగా, యూజర్లు పంపిన ట్వీట్‌లను రద్దు చేయవచ్చు. ఎడిట్ బటన్ కాదని యూజర్లు గుర్తుంచుకోవాలి. ట్వీట్‌ను పంపిన తర్వాత దాన్ని సవరించడానికి యూజర్లను అనుమతిస్తుంది. బ్లూ సభ్యత్వం 2GB ఫైల్ పరిమాణం (1080p) వరకు 60 నిమిషాల కన్నా ఎక్కువ నిడివి గల వీడియోలను అప్‌లోడ్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.

Twitter Android users can now buy blue tick mark for Rs 900 with Blue subscription

Twitter Android users can now buy blue tick mark for Rs 900

బ్లూ మెంబర్‌షిప్ ఇతర ముఖ్య ఫీచర్లలో బుక్‌మార్క్ ఫోల్డర్‌లు, కస్టమ్ యాప్ ఐకాన్స్, థీమ్‌లు, టాప్ స్టోరీలు, రీడర్ ఉన్నాయి. అయితే, అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో అన్ని ఫీచర్లు అందుబాటులో ఉండవని ట్విట్టర్ తెలిపింది. అదనంగా, కొత్తగా క్రియేట్ చేసిన ట్విట్టర్ అకౌంట్లు 90 రోజుల పాటు Twitter బ్లూకు సభ్యత్వాన్ని పొందలేవు. నోటీసు లేకుండా కొత్త అకౌంట్ల కోసం వెయిటింగ్ పీరియడ్‌లను కూడా విధించవచ్చునని పోస్ట్‌లో ఉంది. ట్విట్టర్ యూజర్లు సేవా నిబంధనలను ఉల్లంఘిస్తే.. వాపసు ఇవ్వకుండా బ్లూ టిక్‌ను తొలగించే హక్కును Twitter కలిగి ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Twitter Personal Data : ట్విట్టర్‌ యూజర్లకు హెచ్చరిక.. మీ మొబైల్ నెంబర్ సేవ్ చేశారా? వెంటనే ఇలా డిలీట్ చేయండి.. లేదంటే అమ్మేస్తారు జాగ్రత్త..!