Twitter Edit Button: ట్విట్టర్‌ యూజర్స్‌కు గుడ్ న్యూస్.. నేటి నుంచి అందుబాటులోకి ఎడిట్ బటన్.. టెస్టింగ్ కోసమే!

ట్విట్టర్ యూజర్స్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న ఎడిట్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ నెల 21 నుంచి ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులో ఉంటుందని అమెరికాకు చెందిన ఒక మీడియా సంస్థ తెలిపింది. అయితే, ఇది పూర్తి స్థాయి ఫీచర్ కాదు.

Twitter Edit Button: ట్విట్టర్‌ యూజర్స్‌కు గుడ్ న్యూస్.. నేటి నుంచి అందుబాటులోకి ఎడిట్ బటన్.. టెస్టింగ్ కోసమే!

Twitter Edit Button: ట్విట్టర్‌ యూజర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎడిట్ బటన్ ఈ రోజు నుంచే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 21 నుంచి యూజర్స్ కోసం టెస్టింగ్ మోడ్‌లో ఎడిట్ బటన్ అందుబాటులో ఉంటుందని ఒక మీడియా సంస్థ వెల్లడించింది.

Pregnancy Cheating: ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం.. ప్రెగ్నెన్సీ లేకుండానే తొమ్మిది నెలలు చికిత్స.. తీరా డెలివరీ టైమ్‌లో బయటపడ్డ నిజం

అంటే ఇది పూర్తి స్థాయి ఫీచర్ కాదు. టెస్టింగ్ ఫీచర్ మాత్రమే. కొత్తగా రానున్న ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ట్వీట్ చేసిన తర్వాత కూడా దాన్ని ఎడిట్ చేసే వీలుంటుంది. ఇప్పటివరకు ఈ ఆప్షన్ లేదు. ఒకవేళ ట్వీట్ మార్చాలి అనుకుంటే అది డిలీట్ చేసి, కొత్త ట్వీట్ చేయడం ఒక్కటే మార్గంగా ఉండేది. కానీ, ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే అదే ట్వీట్‌లో మార్పులు చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌కు సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి. ట్వీట్ చేసిన అరగంటలోపే ఎడిట్ చేయొచ్చు. అలాగే ఎడిటెడ్ ట్వీట్స్ ప్రత్యేక ఐకాన్, టైమ్ స్టాంప్, లేబుల్‌తో కనిపిస్తాయి. అంటే అవి ఎడిటెడ్ లేదా మోడిఫైడ్ ట్వీట్స్ అని ఫాలోవర్లు తెలుసుకోవచ్చు.

Bullettu Bandi Couple: లంచం తీసుకుంటూ దొరికిన ‘బుల్లెట్టు బండి’ పెళ్లి కొడుకు

లేబుల్‌పై ట్యాప్ చేయడం ద్వారా యూజర్లు ఎడిట్ హిస్టరీతోపాటు, అంతకుముందు వెర్షన్ కూడా చూసే వీలుంటుంది. అయితే, ఈ ఫీచర్ అందరు యూజర్లకు అందుబాటులోకి వస్తుందా.. లేక సెలెక్టెడ్ యూజర్లకు మాత్రమే ఉంటుందా అనేది తెలియాలి. కాగా, అంతకుముందు ఈ ఫీచర్ ట్విట్టర్ బ్లూ యూజర్లకు మాత్రమే.. అంటే నెలకు రూ.397 చెల్లించిన వారికి మాత్రమే అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఫీచర్ పూర్తిగా అందుబాటులోకి వస్తే కానీ, ఈ విషయంలో స్పష్టత రాదు.