Uber Users Data Breach : ఉబర్ డేటా హ్యాక్ చేసిన 18ఏళ్ల యువకుడు.. యూజర్ డేటా ఉల్లంఘన జరగలేదన్న కంపెనీ!

Uber Users Personal Data : ప్రముఖ ఉబర్ కంపెనీకి సంబంధించిన యూజర్ డేటా గురి కాలేదని వెల్లడించింది.18 ఏళ్ల హ్యాకర్ కంపెనీ వర్క్‌ప్లేస్ మెసేజింగ్ యాప్ స్లాక్‌కి యాక్సెస్‌ను చేయడంతో Uber డేటా ఉల్లంఘనకు గురైంది.

Uber Users Data Breach : ఉబర్ డేటా హ్యాక్ చేసిన 18ఏళ్ల యువకుడు.. యూజర్ డేటా ఉల్లంఘన జరగలేదన్న కంపెనీ!

Uber says users' personal data like phone numbers, trip history were not compromised in breach

Uber Users Personal Data : ప్రముఖ ఉబర్ కంపెనీకి సంబంధించిన యూజర్ డేటా గురి కాలేదని వెల్లడించింది.18 ఏళ్ల హ్యాకర్ కంపెనీ వర్క్‌ప్లేస్ మెసేజింగ్ యాప్ స్లాక్‌కి యాక్సెస్‌ను చేయడంతో Uber డేటా ఉల్లంఘనకు గురైంది. దీనిపై దర్యాప్తు జరిపిన తర్వాత.. డేటా ఉల్లంఘనలో యూజర్ల వ్యక్తిగత డేటా (Uber Users Personal Data), ట్రిప్ హిస్టరీ (Trip History), ఫోన్ నంబర్‌ (Users Phone Numbers)లు వంటివి బహిర్గతమైనవని ఎలాంటి ఆధారాలు లేవని Uber ధృవీకరించింది. ఉబెర్ ఉల్లంఘన తెలిసిన వెంటనే కంపెనీ స్లాక్‌ను తొలగించింది. ఇంటర్నల్ సిస్టమ్‌లలో కొన్నింటిని తాత్కాలికంగా నిలిపివేసింది. కంపెనీకి చెందిన వర్క్‌ప్లేస్ మెసేజింగ్ యాప్‌ను హ్యాక్ చేసినట్లు హ్యాకర్ గురువారం ఉబర్‌కు సమాచారం అందించాడు.

Uber says users' personal data like phone numbers, trip history were not compromised in breach

Uber says users’ personal data like phone numbers, trip history

హ్యాకర్ మొదట ఒక ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని, అతని పాస్‌వర్డ్‌ను షేర్ చేశాడు. ఆపై Uber సిస్టమ్‌లు డేటా ఉల్లంఘనకు గురయ్యాయని రివీల్ చేసేందుకు ఇతర ఉద్యోగులకు మెసేజ్ పంపడానికి అతని అకౌంట్ ఉపయోగించాడు. ఉద్యోగుల కోసం ఇంటర్నల్ డేటా పేజీ ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. ‘నేను హ్యాకర్‌.. ఉబెర్ డేటా ఉల్లంఘనకు గురైంది. స్లాక్ దొంగిలించాను’ అని హ్యాకర్ స్లాక్‌లో రాశాడు. Uber త్వరలో స్లాక్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ Google క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌తో సహా అనేక ఆఫ్‌లైన్‌లోకి తీసుకుంది. కంపెనీ ఇప్పుడు దాని సర్వీసులన్నీ ఇప్పుడు పనిచేస్తున్నాయని ధృవీకరించింది.

వినియోగదారు డేటా (ట్రిప్ హిస్టరీ లాంటిది) యాక్సెస్ ఉందని ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది. Uber, Uber Eats, Uber Freight, Uber Driver యాప్‌తో సహా అన్ని సర్వీసులు పని చేస్తున్నాయని తెలిపింది. ముందుజాగ్రత్త చర్యగా తీసివేసిన ఇంటర్నల్ సాఫ్ట్‌వేర్ టూల్స్ ఈ ఉదయం తిరిగి ఆన్‌లైన్‌కి వస్తున్నాయని Uber బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. అయినప్పటికీ, 18 ఏళ్ల యువకుడు తన సిస్టమ్‌లకు ఎలా యాక్సెస్‌ చేయగలిగాడనే దానిపై ఉబెర్ ఇంకా దర్యాప్తు చేస్తోంది.

Uber says users' personal data like phone numbers, trip history were not compromised in breach

Uber says users’ personal data like phone numbers, trip history

హ్యాక్ గురించి Uberకి తెలియగానే.. ఉద్యోగులు మెసేజింగ్ యాప్‌ను వినియోగించకుండా బ్లాక్ చేసింది. దాంతో స్లాక్‌తో పాటు, కొన్ని ఇతర ఇంటర్నెట్ సిస్టమ్‌లు కూడా యూజర్లకు అందుబాటులో లేవు. ఉబెర్ ఇంటర్నల్ సిస్టమ్‌లకు ఎలా యాక్సెస్ లభించిందో వెల్లడిస్తూ హ్యాకర్  వెల్లడించాడు. కార్పొరేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ అని చెప్పుకునే ఉబెర్ ఉద్యోగికి మెసేజ్ పంపినట్లు చెప్పాడు. హ్యాకర్ తన పాస్‌వర్డ్‌ను షేర్ చేయమని ఉద్యోగిని కోరాడు. అతడు తెలియకుండానే హ్యాకర్ ట్రాప్‌లో పడ్డాడు. హ్యాకర్ వయస్సు 18 ఏళ్లు మాత్రమేనని సైబర్ సెక్యూరిటీ స్కిల్స్‌పై ఏళ్ల తరబడి పనిచేస్తున్నానని వెల్లడించాడు.

Read Also : Uber Ride Book : వాట్సాప్‌లో హిందీలో చెబితే చాలు.. ఉబర్ రైడ్ బుకింగ్ అవుతుంది..!