Uber Ride Book : వాట్సాప్‌లో హిందీలో చెబితే చాలు.. ఉబర్ రైడ్ బుకింగ్ అవుతుంది..!

ఉబర్ యూజర్లకు గుడ్‌న్యూస్.. వాట్సాప్ ద్వారా ఉబర్ రైడ్ మరింత ఈజీగా మారింది. ఉబర్ కంపెనీ వాట్సాప్‌ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించింది.

Uber Ride Book : వాట్సాప్‌లో హిందీలో చెబితే చాలు.. ఉబర్ రైడ్ బుకింగ్ అవుతుంది..!

Now you can book Uber using Hindi on WhatsApp, here is how

Uber Ride Book : ఉబర్ యూజర్లకు గుడ్‌న్యూస్.. వాట్సాప్ ద్వారా ఉబర్ రైడ్ మరింత ఈజీగా మారింది. ఉబర్ కంపెనీ వాట్సాప్‌ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించింది. అందులో భాగంగా ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లోని యూజర్లు అధికారిక వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా ఉబర్‌ రైడ్‌ను ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకూ ఇంగ్లీష్ భాషలోనే ఉబర్ బుకింగ్ చేసుకోనే అవకాశం ఉంది. తాజాగా వాట్సాప్‌లో హిందీ భాషలోనూ ఉబర్ రైడ్ బుకింగ్ చేసుకోవచ్చు. వాట్సాప్ టూ రైడ్(WA2R) ప్రొడక్టు ఫీచర్‌ను విస్తరిస్తున్నట్టు ఉబర్ ప్రకటించింది. ఈ ఫీచర్‌ను డిసెంబర్ 2021లో లక్నోలో టెస్ట్ చేసింది.

‘వాట్సాప్ బిజినెస్‌ (Whatsapp) ప్లాట్‌ఫామ్‌పై డెవలప్ చేసిన ఈ ఫీచర్‌.. రెండు లాంగ్వేజీల ద్వారా సరికొత్త సెగ్మెంట్ కస్టమర్లను ఉబర్ మొబిలిటీ సర్వీసులు అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. లక్నోలో జరిపిన పైలట్‌ ప్రొగ్రామ్‌లో ఉబర్‌లో 33 శాతం మంది కొత్త యూజర్లేనని తేలింది. వాట్సాప్ సర్వీసు ద్వారా మరింత మంది కొత్త యూజర్లను పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లోనూ ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. లోకల్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వాట్సాప్ ద్వారా రైడ్ బుక్ చేసుకోవచ్చు. అందుకే హిందీ లాంగ్వేజ్ సపోర్టును కూడా టీమ్ అందిస్తుందని ఉబర్ మొబిలిటీ, ప్లాట్‌ఫామ్స్ సీనియర్ డైరెక్టర్ మనికందన్ తంగరత్నం పేర్కొన్నారు.

Now you can book Uber using Hindi on WhatsApp, here is how

Now you can book Uber using Hindi on WhatsApp, here is how

– ముందుగా వాట్సాప్ నుంచి ఉబర్ బిజినెస్ అకౌంట్ నెంబర్‌కి మెసేజ్ చేయాల్సి ఉంటుంది.
– ఆ తర్వాత క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి.
– ఉబర్ వాట్సాప్ చాట్ ఓపెన్ చేసేందుకు నేరుగా లింక్‌ను క్లిక్ చేయాలి.

పికప్, డ్రాప్ లొకేషన్లను ఉబర్ యూజర్లను అడుగుతుంది. అందుకు ఎంత ఛార్జ్ అవుతుంది, డ్రైవర్ ఏ సమయంలోగా పిక్ చేసుకుంటాడు అనేది వివరాలను వాట్సాప్ ద్వారా ఉబర్ తెలియజేస్తుంది. ఉబర్ యాప్ నుంచి నేరుగా బుక్ చేసుకుంటారో.. వారికి సేఫ్టీ ఫీచర్లు, ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అన్ని వాట్సాప్ యూజర్లకు కూడా వర్తిస్తుంది. బుకింగ్ సమయంలో డ్రైవర్ పేరు, లైసెన్స్ ప్లేట్ కనిపిస్తుంది. డ్రైవర్ పికప్ పాయింట్ నుంచి చేరుకునే వరకు లొకేషన్‌ ట్రాక్ చేసుకోవచ్చు. ఈ ట్రిపులో ఏదైనా సమస్య వస్తే.. ఎమర్జెన్సీ ఆప్షన్ సెలక్ట్ చేయాలి. లేదంటే హెల్ప్ ఆన్ ట్రిప్ అని టైప్ చేయవచ్చు. అనంతరం ఉబర్ కస్టమర్ సపోర్టు టీమ్ నుంచి కాల్ వస్తుంది. అలా మీ ఉబర్ రైడ్ బుకింగ్ పూర్తి అవుతుంది.

Read Also : Uber యూజర్లకు గుడ్ న్యూస్ : Pet Ride ఫీచర్ వస్తోంది