Uber యూజర్లకు గుడ్ న్యూస్ : Pet Ride ఫీచర్ వస్తోంది

ప్రముఖ రైడ్ షేరింగ్ యాప్ ఉబెర్ లో కొత్త రైడ్ ఆప్షన్ రాబోతోంది. Uber Pet పేరుతో రైడ్ ఫీచర్ త్వరలో రిలీజ్ కానుంది.

  • Published By: sreehari ,Published On : October 14, 2019 / 09:39 AM IST
Uber యూజర్లకు గుడ్ న్యూస్ : Pet Ride ఫీచర్ వస్తోంది

ప్రముఖ రైడ్ షేరింగ్ యాప్ ఉబెర్ లో కొత్త రైడ్ ఆప్షన్ రాబోతోంది. Uber Pet పేరుతో రైడ్ ఫీచర్ త్వరలో రిలీజ్ కానుంది.

ప్రముఖ రైడ్ షేరింగ్ యాప్ ఉబెర్ లో కొత్త రైడ్ ఆప్షన్ రాబోతోంది. Uber Pet పేరుతో రైడ్ ఫీచర్ త్వరలో రిలీజ్ కానుంది. ఇక నుంచి ట్రావెల్ చేసే సమయంలో పెంపుడు జంతువులును కూడా ఉబెర్ అనుమతించనుంది. ప్యాసింజర్లు తమ వెంట పెంపుడు జంతువులను కూడా తీసుకెళ్లవచ్చు. ప్రస్తుతం.. ఉబెర్.. పెట్ రైడ్ ఫీచర్ పై టెస్టింగ్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ముందుగానే ఉబెర్ డ్రైవర్లకు ప్యాసింజర్ల వెంట పెట్స్ ఉన్నట్టు సూచిస్తుంది. 

అక్టోబర్ 16 నుంచి ఈ ఫీచర్ పై ఉబెర్ టెస్టింగ్ ప్రారంభించనుంది. ఆస్టిన్, డెన్వర్, నాష్ విల్లే, మిన్నెపోలిస్ సేయింట్, ఫిల్లాడెల్పియా, ఫోనెక్స్, యూనైటేడ్ స్టేట్స్ లోని టంపా బేలో పెట్ రైడింగ్ ఫీచర్ టెస్టింగ్ చేయనుంది. ఈ రీజియన్లలోని ఉబెర్ యూజర్లకు Uber Pet ఆప్షన్ అందుబాటులోకి రానుంది. అయితే.. కొత్త రైడ్ ఆప్షన్ మాత్రం ఉచితం కాదు. కొద్ది మొత్తంలో ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

పెట్ రైడ్ ధర 3 డాలర్ల నుంచి (రూ.210) లేదా 5 డాలర్లు (రూ.350)వరకు ఛార్జ్ చేయనుంది. యూజర్ రైడ్ కంప్లీట్ కాగానే పెట్ రైడ్ తో కలిపి మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాలో ఎక్కువ మంది ఉబెర్ యూజర్లు.. రైడింగ్ సమయంలో తమ వెంట పెట్ డాగ్స్ తీసుకొస్తున్నారు. దీంతో ఉబెర్ డ్రైవర్లు వెంటనే రైడ్ క్యాన్సిల్ చేస్తున్నారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన యూజర్లు ఫిర్యాదు చేయడంతో ఈ కొత్త కూల్ ఫీచర్ ను కంపెనీ అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పుడు తమ వాహనాల్లో పెంపుడు జంతువులను తీసుకెళ్లడాన్ని పట్టించుకోని డ్రైవర్లు ఈ పెట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. 

ఉబెర్ కూడా డ్రైవర్లకు గణనీయంగా సర్ ఛార్జ్ చెల్లించనుంది. మరో విషయం ఏమిటంటే.. సర్వీసు పెట్స్.. ఉబెర్ పెట్స్ వర్గంలోకి రావు. వీటికి ఎలాంటి సర్ చార్జ్ లేదా అదనపు ఫీజు ఉండదు. ప్రామాణిక ఉబెర్ గో ద్వారా ప్రయాణించవచ్చు. యూఎస్ లోని రాష్ట్ర, సమాఖ్య చట్టానికి అనుగుణంగా ఉంటుంది. ఈ యాప్.. కొన్ని పూర్వోక్త రాష్ట్రాల్లో మాత్రమే టెస్టింగ్ జరుగనుంది. త్వరలో ఇండియాలో ఈ ఆప్షన్ ఎప్పుడు వస్తుందనేది క్లారిటీ లేదు. కానీ, ఉబెర్ మార్కెట్ విషయానికి వస్తే.. ఇండియాలోని పలు మెట్రో సిటీల్లో ఉబెర్ సర్వీసులు బాగా విస్తరించాయనే చెప్పాలి.