UPI ATM Launched : డెబిట్ కార్డుతో పనిలేదు భయ్యా.. యూపీఐ ఏటీఎం ద్వారా ఈజీగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు!

UPI ATM Launched : కార్డ్‌లెస్ క్యాష్ అనేది ఇప్పుడు భారత్‌లో హిటాచీ ద్వారా UPI ATM అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు డెబిట్ కార్డ్‌కు బదులుగా UPI IDని ఉపయోగించి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

UPI ATM Launched : డెబిట్ కార్డుతో పనిలేదు భయ్యా.. యూపీఐ ఏటీఎం ద్వారా ఈజీగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు!

UPI ATM Launched _ Now you can withdraw money without using debit card

UPI ATM Launched : మీరు ఎప్పుడైనా మీ వ్యాలెట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఇంట్లోనే మరిచిపోయారా? మీకు అత్యవసరంగా డబ్బులు అవసరమయ్యా? ఇలాంటి పరిస్థితులు అందరికీ తెలిసినవే. అయితే, చింతించకండి. (UPI ATM) ఇటీవల భారత మార్కెట్లో లాంచ్ అయింది. వినియోగదారులు UPI IDని ఉపయోగించి ATM మెషీన్ల నుంచి డబ్బును సులభంగా విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతిస్తుంది.

నివేదిక ప్రకారం.. హిటాచీ UPI-ATMను ప్రవేశపెట్టింది. ATM మెషీన్ లాగా ఉంటుంది. కానీ, కొంచెం భిన్నంగా ఉంటుంది. మీ బ్యాంక్ నుంచి డబ్బు తీసుకోవాలనుకుంటే.. మీరు ఏటీఏంలో డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తారు. అయితే, ఈ కొత్త UPI-ATMతో డెబిట్ కార్డ్ అవసరం లేదు.

Read Also : Tech Tips in Telugu : మీ ఆధార్ కార్డు పోయిందా? ఆన్‌లైన్‌లో కొత్త PVC కార్డు ఎలా పొందాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

‘హిటాచీ మనీ స్పాట్ UPI ATM’ అని పిలుస్తారు. ముంబైలో సెప్టెంబర్ 5, 2023న జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ఈ UPI ATM సర్వీసును ప్రవేశపెట్టారు. మీ బ్యాంక్ కార్డ్‌కు బదులుగా యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అనే ప్రత్యేక ఫోన్ యాప్‌ని ఉపయోగించవచ్చు.

UPI ATMని ఎలా ఉపయోగించాలంటే? :
* మీరు చేయాల్సిందిల్లా.. ATM నుంచి ఎంత డబ్బు తీసుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి.
* మీరు మొత్తాన్ని ఎంచుకున్న తర్వాత ATM స్క్రీన్‌పై ప్రత్యేక కోడ్‌ను చూపిస్తుంది. ఈ కోడ్‌ను QR కోడ్ అని పిలుస్తారు. మీరు ఎంచుకున్న మొత్తాన్ని సూచిస్తుంది.
* UPI (యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)కి సపోర్టు ఇచ్చే మొబైల్ ఫోన్ యాప్‌ని ఉపయోగించాలి. ఈ యాప్ మీ ఫోన్‌లో ఇప్పటికే ఉన్న వాటిలో ఏదైనా ఒకటి కావచ్చు.
* మీరు UPI యాప్‌ని ఓపెన్ చేసిన తర్వాత ATM స్క్రీన్‌పై కనిపించే QR కోడ్‌ను స్కాన్ చేయడానికి మీరు దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. మీరు ఎంత డబ్బు ATM నుంచి విత్‌డ్రా చేయాలనుకుంటున్నారో ఎంచుకోవచ్చు.
* మీ UPI యాప్‌లో ప్రత్యేక PINని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పిన్ సీక్రెట్ కోడ్ లాంటిది. అది మీరు మాత్రమే తెలుసుకోవాలి. ఈ పిన్ ఎంటర్ చేయడం ద్వారా మీరు ATM నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
* మీరు సరైన పిన్‌ను ఎంటర్ చేసిన తర్వాత ATM మీరు అడిగిన నగదును మీకు అందిస్తుంది. మీరు ఇప్పుడు మీ డబ్బును సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.

UPI ATM Launched _ Now you can withdraw money without using debit card

UPI ATM Launched _ Now you can withdraw money without using debit card

ప్రస్తుతం, అనేక బ్యాంకులు, ఫిజికల్ కార్డ్‌ని ఉపయోగించకుండానే డబ్బు తీసుకోవడానికి అనుమతిస్తాయి. UPI-ATM కూడా అలాగే పనిచేస్తుంది. కానీ, ఇందులో కొంచెం తేడా ఉంది. కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాతో మీ మొబైల్, ప్రత్యేక కోడ్ (OTP)ని ఉపయోగిస్తారు. అయితే, UPI ATM క్యాష్ విత్‌డ్రా కోసం QR కోడ్‌లను ఉపయోగిస్తుంది.

UPI-ATM అనేది బ్యాంకింగ్‌లో సాధారణ ATMలతో UPI సౌలభ్యం, భద్రతను అందిస్తుంది. మీరు ఫిజికల్ కార్డ్ అవసరం లేకుండా భారత్‌లో సుదూర ప్రాంతాలలో కూడా మీ డబ్బును వేగంగా పొందవచ్చునని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

Read Also : Tech Tips in Telugu : విదేశీ ప్రయాణాల్లో UPI పేమెంట్లు ఎలా చేయాలో తెలుసా? ఏయే దేశాల్లో భారతీయ యూపీఐ సర్వీసు అందుబాటులో ఉందంటే?