ChatGPT: చాట్‌జీపీటీ వాడుతున్నారా? అయితే.. ఈ విషయం తెలుసుకోండి! లేదంటే..
అవసరం ఉన్నా, లేకున్నా చాలా మంది చాట్‌జీపీటీ వాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకునేందుకే దీన్ని వాడుతున్నారు. అయితే, చాట్‌జీపీటీ వాడే వాళ్లు ఇకపై జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ పర్సనల్ డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉంది. లేదంటే మీ డివైజ్ హ్యాకర్ల బారిన పడే ఛాన్స్ కూడా ఉంది.

ChatGPT: ‘చాట్‌జీపీటీ’కి ఇటీవలి కాలంలో ఎలాంటి ఆదరణ దక్కుతుందో తెలిసిందే. అవసరం ఉన్నా, లేకున్నా చాలా మంది చాట్‌జీపీటీ వాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకునేందుకే దీన్ని వాడుతున్నారు. అయితే, చాట్‌జీపీటీ వాడే వాళ్లు ఇకపై జాగ్రత్తగా ఉండాలి.
Ram Charan : హాలీవుడ్ ప్రాజెక్ట్‌లు గురించి రామ్‌చరణ్ కామెంట్స్.. అమెరికన్ యాంకర్ ప్రశంసలు!
ఎందుకంటే మీ పర్సనల్ డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉంది. లేదంటే మీ డివైజ్ హ్యాకర్ల బారిన పడే ఛాన్స్ కూడా ఉంది. కారణం.. చాట్‌జీపీటీ ఫేక్ వెర్షన్స్. సైబర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్‌స్కై.. చాట్‌జీపీటీ అంశంపై ఒక నివేదిక రూపొందించింది. దీని ప్రకారం.. ఫొబో ట్రోజన్ మాల్వేర్ ఉన్న ఫేక్ చాట్‌జీపీటీ ప్లాట్‌ఫామ్‌ను సైబర్ నేరగాళ్లు డిజైన్ చేశారు. ఇది అచ్చం ఒరిజినల్ లాగే ఉంటుంది. ఎవరైనా చాట్‌జీపీటీ కోసం వెతికితే వాళ్లకు ఈ ఫేక్ వెబ్సైట్ లింక్ కనిపించవచ్చు. ఇది డెస్క్‌టాప్ (విండోస్)పై పని చేసేలా ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే, డౌన్లోడ్, ఇన్స్టాల్ వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి.
Marriage In Hospital: ఆస్పత్రిలోనే పెళ్లి చేసుకున్న జంట.. కారణమేంటంటే..
ఇవీ క్లిక్ చేస్తే, ఇన్స్టలేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే, అది కంప్లీట్ కాదు. ఇన్స్టలేషన్ అవ్వకుండానే ఎర్రర్ చూపిస్తూ, సెషన్ ఎండ్ అవుతుంది. అయితే, ఆలోపే మాల్వేర్ యూజర్ల కంప్యూటర్లలోకి చొరబడుతుంది. ఫేస్బుక్, టిక్‌టాక్, గూగుల్ వంటి యప్స్కు చెందిన సమాచారాన్ని దీని ద్వారా హ్యాకర్లు సేకరిస్తారు. మీ కంప్యూటర్లోని డాటా అంతా హ్యాకర్ల చేతికి వెళ్లిపోతుంది. క్రోమ్, ఎడ్జ్, ఫైర్ ఫాక్స్ నుంచి కూడా మీ డాటా సేకరిస్తారు. అందువల్ల చాట్‌జీపీటీ వాడే యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని కోసం సెర్చ్ చేయగానే కనిపించే ఫేక్ సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే మీ కంప్యూటర్ డేటా అంతా హ్యాకర్ల బారిన పడకతప్పదు.