Mozilla Firefox : మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. వెంటనే అప్‌డేట్ చేయండి

మొజిల్లా ఫైర్ ఫాక్స్.. వరల్డ్ వైడ్ గా ఇంటర్నెట్ యూజర్లు అత్యధికంగా వాడే బ్రౌజర్లలో ఇదీ ఒకటి. కాగా, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ యూజర్లను కేంద్రం అలర్ట్ చేసింది.

Mozilla Firefox : మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. వెంటనే అప్‌డేట్ చేయండి

Mozilla Firefox : మొజిల్లా ఫైర్ ఫాక్స్.. వరల్డ్ వైడ్ గా ఇంటర్నెట్ యూజర్లు అత్యధికంగా వాడే బ్రౌజర్లలో ఇదీ ఒకటి. కాగా, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ యూజర్లను కేంద్రం అలర్ట్ చేసింది. వెంటనే తమ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ను అప్ డేట్ చేసుకోవాలని చెప్పింది. లేదంటే ఇబ్బందుల్లో పడతారని, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో బగ్ ను గుర్తించినట్టు భారత కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఈఆర్టీ (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) వెల్లడించింది. దీంతో కేంద్రం ఫైర్ ఫాక్స్ యూజర్లు అలర్ట్ చేసింది.

ఈ బగ్ ద్వారా యూజర్ల డేటా హ్యాకర్ల పాలవుతుందని, డేటాను దొంగిలించడం ఎంతో సులువు అవుతుందని సీఈఆర్టీ హెచ్చరించింది. ఆర్బిటరీ కోడ్ ను సైబర్ నేరగాళ్లు కంప్యూటర్ లోకి ప్రవేశపెట్టేందుకు ఈ బగ్ వీలు కల్పిస్తుందని, తద్వారా యూజర్ల పాస్ వర్డ్ లు, వ్యక్తిగత సమాచారం, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక డేటా హ్యాకర్లకు చేరుతుందని వివరించింది.

ఈ నేపథ్యంలో, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ సృష్టికర్త మొజిల్లా కూడా స్పందించింది. వెంటనే తన యూజర్లను అప్రమత్తం చేసింది. ఫైర్ ఫాక్స్ 105, ఈఎస్సార్ వెర్షన్లు వాడుతున్న వారు 102.3 వెర్షన్ కు అప్ డేట్ చేసుకోవాలని మొజిల్లా సూచించింది. ఈ సరికొత్త వెర్షన్ ఫైర్ ఫాక్స్ సెక్యూరిటీ పేజిలోనూ, సీఈఆర్టీ-ఇన్ వెబ్ సైట్ నుంచి కానీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Firefox 1.0 2004లో విడుదలైంది. ఇది భారీ విజయాన్ని సాధించింది. ఒక సంవత్సరం కంటే తక్కువ సమయంలో 100 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను పొందింది. 2013లో ఫైర్ ఫాక్స్ ఓఎస్ ను లాంచ్ చేసింది.