Jio vs Vi Diwali Offers : Jio vs Vi యూజర్లకు దీపావళి ఆఫర్లు.. కొన్ని బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు మీకోసం..!

Vi vs Jio Diwali offers 2022 : దీపావళి పండుగ సందర్భంగా టెలికాం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), వోడాఫోన్ ఐడియా (Vi) రీఛార్జ్‌పై ప్రత్యేక దీపావళి ఆఫర్‌లను ప్రవేశపెట్టాయి.

Jio vs Vi Diwali Offers : Jio vs Vi యూజర్లకు దీపావళి ఆఫర్లు.. కొన్ని బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు మీకోసం..!

Vi vs Jio Diwali offers 2022 _ Details on some best recharge plans

Vi vs Jio Diwali offers 2022 : దీపావళి పండుగ సందర్భంగా టెలికాం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), వోడాఫోన్ ఐడియా (Vi) రీఛార్జ్‌పై ప్రత్యేక దీపావళి ఆఫర్‌లను ప్రవేశపెట్టాయి. రిలయన్స్ జియో, Vi దీపావళి 2022 సందర్భంగా బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. భారత్‌లో రిలయన్స్ జియో, Vi యూజర్ల కోసం ఉత్తమమైన డీల్‌లు, ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.

Jio దీపావళి ఆఫర్లు ఇవే :
ఇంటర్నెట్ డేటా, వాయిస్ కాలింగ్, SMS కాకుండా మల్టీ బెనిఫిట్స్ అందించే జియో 4G ప్రీపెయిడ్ యూజర్ల అందరికి రిలయన్స్ జియో ప్రత్యేక దీపావళి సెలబ్రేషన్ ఆఫర్‌ను వెల్లడించింది. జియో దీపావళి సెలబ్రేషన్ ఆఫర్ ధర రూ. 2,999గా ఉండనుంది. అలాగే 365 రోజుల వరకు వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ఆఫర్‌లో యూజర్లు రోజుకు 2.5GB డేటాను మొత్తం 912GB (వార్షిక), అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలను పొందవచ్చు. అదనంగా, Jio స్పెషల్ దీపావళి రీఛార్జ్ ప్లాన్‌తో 75GB అదనపు డేటాను అందిస్తోంది.

యూజర్లు JioTV, JioCinema, JioSecurity, JioCloud వంటి Jio యాప్‌లకు కూడా మెంబర్‌షిప్ పొందవచ్చు. దీపావళి సెలబ్రేషన్లలో భాగంగా Zoomin నుంచి మాగ్నెట్‌లు, Ferns & Petals నుంచి రూ.150 తగ్గింపు, Ixigo నుంచి విమాన బుకింగ్‌పై రూ. 750 తగ్గింపు, Ajioపై రూ.1000 తగ్గింపు, అర్బన్ లాడర్‌పై రూ.1,500 తగ్గింపు, Reliance Digitalపై రూ. 1,000 తగ్గింపు కూడా ఉన్నాయి.

Vi vs Jio Diwali offers 2022 _ Details on some best recharge plans

Vi vs Jio Diwali offers 2022 _ Details on some best recharge plans

Vi దీపావళి ఆఫర్లు ఇవే :
Vi ( వోడాఫోన్-ఐడియా) దీపావళి ఆఫర్‌లో భాగంగా 3 రీఛార్జ్ ప్లాన్‌లను రిలీజ్ చేసింది. మీరు Vi యూజర్.. అక్టోబర్ 31 వరకు Vi దీపావళి ఆఫర్‌ను పొందవచ్చు. అదనపు డేటాను ఫ్రీగా పొందవచ్చు. రూ. 1,449 Vi దీపావళి ఆఫర్ అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 SMS/రోజును అందిస్తుంది. 180 రోజుల వరకు వ్యాలిడిటీ అందిస్తుంది. రూ.1,449 రీఛార్జ్ ప్లాన్‌తో, మీరు రోజుకు 1.5GB డేటాను 180 రోజుల పాటు అదనంగా 50GB తగ్గింపుతో పొందుతారు. ఈ దీపావళి ఆఫర్ ప్రతిరోజూ అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల మధ్య ఉచితంగా ఇంటర్నెట్‌ వినియోగించుకోవచ్చు.

వీకెండ్ డేటా రోల్‌ఓవర్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. అదేవిధంగా, రూ. 2,899 రీఛార్జ్ ప్లాన్ మీరు రూ.1,449 ఆఫర్‌ అందిస్తుంది. 50GB అదనపు డేటాకు బదులుగా, ఈ టారిఫ్ ప్లాన్ మీకు 75 GB డేటాను అందిస్తుంది. మీరు రూ. 2,899 రీఛార్జ్ ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. Vi దీపావళి రీఛార్జ్ ప్లాన్ రూ. 3,099 365 రోజుల పాటు రోజుకు 2GB డేటా, అదనంగా 75GB డేటాను అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో యూజర్లు ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel Diwali 2022 : ఎయిర్‌టెల్ యూజర్లకు దీపావళి ఆఫర్లు.. మీకు నచ్చిన రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవచ్చు..!