Vivo T1X : రూ. 15వేల లోపు ధరలో వివో T1X స్మార్ట్‌ఫోన్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

భారత మార్కెట్లోకి వివో ఇండియా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. వివో T సిరీస్‌లో T1X మోడల్ వివో ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. అంతేకాదు.. రూ. 15వేల ధరకే అందుబాటులో ఉంది.

Vivo T1X : రూ. 15వేల లోపు ధరలో వివో T1X స్మార్ట్‌ఫోన్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

Vivo T1x Launched In India With 90hz Display, And 5,000mah Battery

Vivo T1X : భారత మార్కెట్లోకి వివో ఇండియా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. వివో T సిరీస్‌లో T1X మోడల్ వివో ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. అంతేకాదు.. రూ. 15వేల ధరకే అందుబాటులో ఉంది. 5,000mAh భారీ బ్యాటరీతో పాటు 90Hz డిస్‌ప్లేతో మార్కెట్లో లాంచ్ అయింది. ఈ డివైజ్ లో ఫీచర్లు చైనీస్ మోడల్‌కు కొద్దిగా భిన్నంగా ఉన్నాయి. ఈ బడ్జెట్ డివైజ్ 90Hz డిస్‌ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 5,000mAh బ్యాటరీతో మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ కొత్త Vivo ఫోన్ గురించి 4G స్మార్ట్‌ఫోన్ మాత్రమే.. 5G ఫోన్ కాదని గమనించాలి.

ధర, సేల్ డేట్, ఆఫర్‌ ఇవే :
Vivo T1X స్మార్ట్ ఫోన్ 4GB RAM+64GB స్టోరేజ్ మోడల్‌తో రూ.11,999 ప్రారంభ ధరతో వస్తుంది. 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999గా ఉండగా.. 6GB RAM+128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 14,999గా ఉంది. ఈ డివైజ్ గ్రావిటీ బ్లాక్ స్పేస్ బ్లూతో సహా రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ జూలై 27న ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ అవుతోంది. లాంచ్ ఆఫర్ల విషయానికొస్తే.. HDFC బ్యాంక్ కార్డ్‌లపై రూ.1,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

Vivo T1x Launched In India With 90hz Display, And 5,000mah Battery (1)

Vivo T1x Launched In India With 90hz Display, And 5,000mah Battery

స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు ఇవే :
Vivo T1X Full HD+ రిజల్యూషన్‌తో 6.58-అంగుళాల డిస్‌ప్లేతో వచ్చింది. 90Hz రిఫ్రెష్ రేట్, 90.6 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో సపోర్టుతో LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. Qualcomm Snapdragon 680 చిప్‌సెట్ ఆధారితమైనది. దీనికి Adreno 610 GPU సపోర్టు ఉంది. హీటింగ్ సమస్యను పరిష్కరించేందుకు కంపెనీ 4 లేయర్ కూలింగ్ సిస్టమ్‌ను అందించింది. ఫోటోగ్రఫీ పరంగా.. f/1.8 ఎపర్చర్‌తో 50-MP ప్రైమరీ సెన్సార్ f/2.4 ఎపర్చర్‌తో 2-MP సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలను తీసేందుకు 8-MP కెమెరా ఉంది. కెమెరా యాప్ సూపర్ HDR, మల్టీ-లేయర్ పోర్ట్రెయిట్, స్లో మోషన్, పనోరమా, లైవ్ ఫోటో, సూపర్ నైట్ మోడ్ వంటి మరిన్ని ఫీచర్లను అందిస్తుంది.

ఈ డివైజ్ ఇంటర్నల్ స్టోరేజీతో ర్యామ్‌ను విస్తరించే అవకాశాన్ని కూడా Vivo అందించింది. హుడ్ కింద.. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఉన్న 5,000mAh బ్యాటరీ ఉంది. రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు కూడా అందిస్తోంది. Vivo T1X సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా.. యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్ ప్రాక్సిమిటీ సెన్సార్‌లకు సపోర్టు అందిస్తుంది. హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 12తో రన్ అవుతుంది. మైక్రో SD కార్డ్ స్లాట్‌ని ఉపయోగించి ఇంటర్నల్ స్టోరేజీని కంపెనీ అందిస్తోంది.

Read Also : Reliance Digital : రిలయన్స్ నుంచి 100GB ఫ్రీ డేటాతో HP Smart SIM ల్యాప్‌టాప్.. వారికి మాత్రమే!