Metaverse: మెటావర్స్ అంటే ఏంటి.. ఈ సూపర్ టెక్నాలజీతో మనం ఏం చేయొచ్చు..?

రోబో సినిమాలో చిట్టి రోబోతో విలన్ మాట్లాడతాడు చూడండి.. అలా...............

Metaverse: మెటావర్స్ అంటే ఏంటి.. ఈ సూపర్ టెక్నాలజీతో మనం ఏం చేయొచ్చు..?

Metaverse

Metaverse Internet : Facebook INC కంపెనీ పేరు మారింది. తమ పేరెంట్ కంపెనీ పేరును “మెటా(Meta)” గా మార్చుతున్నట్టు ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ గురువారం అక్టోబర్ 28, 2021 నాడు ప్రకటించారు. ఫేస్‌బుక్ కంపెనీ పేరు మాత్రమే మారుతోందని… కార్పొరేట్ స్ట్రక్చర్ మాత్రం అలాగే ఉండబోతోంది. కంపెనీ ఆధీనంలోని ఇతర పార్ట్ నర్ సంస్థలు ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్‌స్టా పేర్లు అలాగే ఉంటాయి. Meta పేరుకు తగ్గట్టుగా… సంస్థలోని యాప్స్, టెక్నాలజీలు అన్నింటికీ మదర్ కంపెనీగా.. ఈ మెటా ఉండబోతోందని మార్క్ జుకర్ బర్గ్ చెప్పారు.

మాతృ సంస్థ పేరు మాత్రమే ఎందుకు మార్చారు..?

ఫేస్ బుక్ ఫర్మ్ లోని ప్లాట్ ఫామ్స్ .. ఇటీవల మునుపెన్నడూ లేనిరీతిలో ప్రభుత్వాలు, రెగ్యులేటర్స్ నుంచి  విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఫేస్ బుక్ ప్లాట్‌ఫామ్ అల్గారిథమ్, మార్కెట్ పవర్, Policy Abuses కారణంగా ఈ విమర్శలు వస్తున్నాయి. దీంతో.. బ్రాండ్ ను రీనేమ్ చేస్తూ… మెటా పేరుతో కొత్త బ్రాండ్ ను ప్రకటించారు మార్క్ జుకర్ బర్గ్.

మెటా(Meta) అనేది… తమ అప్ కమింగ్ టెక్నాలజీ మెటావర్స్(Metaverse)ను రిఫ్లెక్ట్ చేస్తుందని హింట్ ఇచ్చాడు మార్క్ జుకర్ బర్గ్. ఇంతకీ మెటావర్స్ అంటే ఏంటి… ఎలా ఉండబోతోంది అనేది చాలామందికి వస్తున్న సందేహం. తెల్సుకుందాం.

మెటావర్స్ అంటే..?

మెటావర్స్ – Metaverse అనేది నెక్స్ జెనరేషన్ టెక్నాలజీ. ఓ రకంగా ఫ్యూచరిస్టిక్ 3D Internet అని చెప్పొచ్చు. ఫిజికల్ రియాలిటీ, ఆగ్‌మెంటెడ్ రియాలిటీ(ఫోన్ సహాయంతో), వర్చువల్ రియాలిటీ(AR set సాయంతో)లను కలిపి ఈ మెటావర్స్-Metaverse టెక్నాలజీగా చెప్పుకోవచ్చు.

రోబో సినిమా చూశారా..?

రోబో సినిమాలో చిట్టి రోబోతో విలన్ మాట్లాడతాడు చూడండి.. అలా… ఉంటుందనుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.

మెటావర్స్ సాయంతో జనం వర్చువల్ విధానంలో ఒకరినొకరు కలుసుకోవచ్చు. వారితో కలిసి పనిచేయొచ్చు. ప్రొడక్టులను తయారుచేయొచ్చు కూడా. రానున్న పదేళ్లలో… వంద కోట్ల మందికి మెటావర్స్ వేదిక అవుతుందని మార్క్ చెబుతున్నారు.

ఉదాహరణకు…మీ ఫ్రెండ్స్ గ్రూప్… గోవా టూర్ కు వెళ్లారు. మీరు వెళ్లలేదనుకోండి.. ఈ టెక్నాలజీ సాయంతో.. మీ ఇంట్లో ఉండి మీ ఫ్రెండ్స్ తో కనెక్ట్ అయి… గోవా టూర్ లో పొందిన అనుభూతిని పొందగలుగుతారు.

వీడియో కాలింగ్ యాప్స్ తో ఫోన్ లో మాత్రమే ఫ్రేమ్ లో ఉండి చూసుకోగల్గుతాం  కానీ.. మెటావర్స్ లో నేరుగా మీటింగ్ లో మీ చైర్ లో మీరు కూర్చుని పాల్గొనొచ్చు.

మెటావర్స్ అనేది ఓ త్రీడీ వీడియో గేమ్ లాంటి ఫీల్ ఇవ్వబోతోంది. వర్చువల్ హ్యూమన్ చేసే ప్రయాణానికి అంతం ఉండదు. మీ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తుంది. అడ్డు ఉండదు. అక్కడ ఉండేది వర్చువల్ మనిషే కానీ…. రియల్ టైమ్ ఎక్స్ పీరియన్స్ ఉంటుందన్నమాట.

రియల్, వర్చువర్ వరల్డ్ ను కలిపే కొత్త సోషల్, ఎకానమీ సాంకేతిక ప్రపంచమే మెటావర్స్ అని టెక్ దిగ్గజం చెబుతోంది. స్నాప్ చాట్ లాంటి కొన్ని యాప్స్ లో చేసుకున్నట్టుగా… మెటావర్స్ లో మనం మన అవతార్స్ ను డిజైన్ చేసుకోవచ్చు. ఫేస్ మార్చుకోవచ్చు.. బట్టలు నచ్చినవి ఎంపికచేసుకోవచ్చు.. గూడ్స్, వస్తువులు ఇంకా ఎన్నెన్నో ఫీచర్స్ ను యూజ్ చేసి.. మన అప్పియరెన్స్ ను డిజైన్ చేసుకోవచ్చు.

దీనిపై వచ్చిన సై-ఫై(Sci-fi) నావెల్స్ అన్నీ సూపర్ పాపులర్ అయ్యాయి. ఫాంటసీని క్రియేట్ చేశాయి.  3 దశాబ్దాల కింద వచ్చిన డిస్టోపియన్ నావెల్ సోషల్ స్ట్రక్చర్ ను రీడిఫైన్ చేసింది. 1992లో నీల్ స్టీఫెన్‌సన్ రాసిన స్నో క్రాష్ లో ఈ ఎక్స్ పీరియన్స్ ఉంటుంది. ఈ జోనర్ లో పబ్లిష్ అయిన ఎర్నెస్ట్ క్లైన్ పుస్తకం ‘రెడీ ప్లేయర్ వన్’ బెస్ట్ సెల్లర్ అనిపించుకుంది. విలియం గిబ్సన్ రాసిన న్యూరో మాన్సర్ లోనూ ఇదే కీ థీమ్. పబ్ జీ సహా… చాలా వీడియో గేమ్స్ లో అవతార్స్ ను సెట్ చేసుకుని… ఎక్స్ ప్లోర్ అయిన ఎక్స్ పీరియన్స్ ఇప్పటికే చాలామందికి ఉంది.

యూరప్‌లో 10వేలమంది రిక్రూట్

మెటావర్స్ టెక్నాలజీని డెవలప్ చేసేందుకు ఇప్పటికే యూరప్ లో పదివేల మంది టెకీలను స్పెషల్ గా రిక్రూట్ చేసుకుంది ఫేస్ బుక్ INC. రాబోయే రోజుల్లో లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయని కంపెనీ తెలిపింది. సోషల్ మీడియా స్థాయి నుంచి.. తాము… జనాన్ని అనుసంధానించే(Connecting People Through Virtual,Augmented Reality) వ్యవస్థలోకి అప్ గ్రేడ్ కాబోతున్నామని కంపెనీ చెబుతోంది. ఈ కొత్త టెక్నికల్ వరల్డ్ క్రియేట్ చేసేందుకు లక్షల మంది సాంకేతిక నిపుణులు నిరంతరం పనిచేస్తున్నారని కంపెనీ స్టేట్ మెంట్ ఇచ్చింది.

మెటావర్స్ ను రియాలిటీ లోకి తెచ్చేందుకు మైక్రోసాఫ్ట్, Nvidia, ఫేస్ బుక్ INC, EPIC గేమ్స్ సంస్థలు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. ఫేస్ బుక్ INC(ఇపుడు మెటా) దీనికోసం భారీస్థాయిలో కసరత్తు చేస్తోంది. మెటావర్స్ టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి తెస్తామంటోంది. మెటావర్స్ లో ఏం చేసినా… ఎక్కడికి వెళ్లినా.. అన్నింటికీ కమ్యూనిటీ స్టాండర్స్ కు లోబడి మాత్రమే చేయాల్సి ఉంటుందని… పూర్తి పర్యవేక్షణ, నిఘా ఉంటాయని కంపెనీ సూచిస్తోంది.