WhatsApp New Interface : వాట్సాప్ కొత్త ఇంటర్‌ఫేస్ అదిరిందిగా.. టాప్ బార్ డిజైన్ ఇదేనట.. అందరికి కనిపిస్తుందా?

WhatsApp New Interface : వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ వస్తోంది. ఆకర్షణీయమైన మార్పులతో కొత్త ఇంటర్‌ఫేస్ యూజర్లను ఆకట్టుకోనుంది. ఈ కొత్త ఫీచర్ అందరికి అందుబాటులో ఉంటుందా?

WhatsApp New Interface : వాట్సాప్ కొత్త ఇంటర్‌ఫేస్ అదిరిందిగా.. టాప్ బార్ డిజైన్ ఇదేనట.. అందరికి కనిపిస్తుందా?

WhatsApp Android App Could Get New Interface With White Top App Bar, Suggests Beta Update

WhatsApp New Interface : ప్రముఖ మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఆండ్రాయిడ్ యాప్‌లో కొత్త ఇంటర్‌ఫేస్‌పై పనిచేస్తోందని సమాచారం. నివేదిక ప్రకారం.. వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్‌లో డిజైన్ ఎడ్జెస్ట్ టాప్ యాప్ బార్, UI ఎలిమెంట్‌లను మెరుగుపరుస్తోంది. ఈ కొత్త డిజైన్‌లో, టాప్ బార్ బ్లాక్ కలర్‌లో ఉంటుంది.

ఇతర UI ఎలిమెంట్స్ గ్రీన్ కలర్ కనిపిస్తాయి. వాట్సాప్ రీసోర్ట్ చేసిన డిజైన్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.23.18.18 వాట్సాప్‌లో గుర్తించారు. గూగుల్ ప్లే (Google Play) బీటా ప్రోగ్రామ్ ద్వారా అందుబాటులో ఉంది. అయితే, ఈ కొత్త ఫీచర్ ఇంకా టెస్టర్‌లందరికీ కనిపించదు. ఇటీవల, వాట్సాప్ HD ఫొటోలు, వీడియోలకు సపోర్టును కూడా అందించింది.

Read Also : Moto G84 Launch : భలే ఉంది భయ్యా ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్లతో మోటో G84 మోడల్.. ధర ఎంతో తెలిస్తే కొనాల్సిందే..!

వాట్సాప్ ఫీచర్స్ ట్రాకర్ WABetaInfo నివేదిక ప్రకారం.. వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్ యూజర్ల కోసం కొత్త ఇంటర్‌ఫేస్‌పై పని చేస్తోంది. గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్ ద్వారా అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ 2.23.18.18 బీటా వెర్షన్‌లో డిజైన్ అందిస్తోంది. ఈ కొత్త ఇంటర్‌ఫేస్ ఇంకా డెవలప్‌మెంట్‌లో ఉంది. అన్ని బీటా టెస్టర్‌లకు కనిపించదు. వాట్సాప్ కొత్త డిజైన్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. ఈ స్క్రీన్‌షాట్‌లో, టాప్ యాప్ బార్ వైట్ కలర్‌లో కనిపిస్తుంది.

WhatsApp Android App Could Get New Interface With White Top App Bar, Suggests Beta Update

WhatsApp New Interface Could Get New Interface With White Top App Bar, Suggests Beta Update

అయితే, యాప్ పేరుతో సహా ఇతర UI ఎలిమెంట్స్ గ్రీన్ కలర్‌లో కనిపిస్తాయి. నావిగేషన్ బార్ యాప్ కిందిభాగంలో ఉన్నట్లు కనిపిస్తుంది. వాట్సాప్ రీస్టోరింగ్ అనేది గూగుల్ లేటెస్ట్ మెటీరియల్ డిజైన్ 3 మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ అప్‌గ్రేడ్ చేసిన యూజర్ ఇంటర్‌ఫేస్ ఫ్యూచర్ అప్‌డేట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ iOS యాప్, డిజైన్ రీవాంప్‌పై కూడా పనిచేస్తుందని సమాచారం.

WABetaInfo ప్రకారం.. TestFlight యాప్‌లో iOS 23.17.1.77 అప్‌డేట్ లేటెస్ట్ WhatsApp బీటాతో మార్పులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల ప్రారంభంలో వాట్సాప్ కొత్త టోగుల్ ద్వారా HD వీడియోలను పంపగల సామర్థ్యాన్ని ప్రారంభించింది. హై-రిజల్యూషన్ ఫొటోలను పంపడానికి సపోర్టును కూడా అందించింది. ఆండ్రాయిడ్ 2.23.17.74 అప్‌డేట్‌లో వాట్సాప్‌తో వినియోగదారులు స్టాండర్డ్, డిఫాల్ట్, 480p రిజల్యూషన్‌కు బదులుగా 720p రిజల్యూషన్‌లో వీడియోలను షేర్ చేయవచ్చు.

Read Also : iPhone 13 Price Drop : ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!