WhatsApp Accounts Ban : భారత్‌లో 26.85 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఆగస్టులో కన్నా సెప్టెంబర్‌లోనే 15 శాతం ఎక్కువ..!

WhatsApp Accounts Ban : ప్రముఖ మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (Whatsapp) సెప్టెంబర్‌లో భారత మార్కెట్లో 26.85 లక్షల అకౌంట్లను నిషేధించింది. ఇందులో 8.72 లక్షల వాట్సాప్ అకౌంట్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది.

WhatsApp Accounts Ban : భారత్‌లో 26.85 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఆగస్టులో కన్నా సెప్టెంబర్‌లోనే 15 శాతం ఎక్కువ..!

WhatsApp bans 26.85 lakh accounts in September in India, 15% more than August

WhatsApp Accounts Ban : ప్రముఖ మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (Whatsapp) సెప్టెంబర్‌లో భారత మార్కెట్లో 26.85 లక్షల అకౌంట్లను నిషేధించింది. ఇందులో 8.72 లక్షల వాట్సాప్ అకౌంట్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. యూజర్లకు వార్నింగ్ ఇవ్వాడానికి ముందే ముందస్తుగా వాట్సాప్ అకౌంట్లను నిషేధించారని కంపెనీ తెలిపింది. ఆగస్టులో వాట్సాప్ నిషేధించిన 23.28 లక్షల అకౌంట్ల కంటే సెప్టెంబర్‌లో బ్లాక్ చేసిన వాట్సాప్ అకౌంట్ల సంఖ్య 15 శాతం ఎక్కువని వెల్లడించింది. అంతేకాకుండా, వాట్సాప్ సెప్టెంబర్ నెలలో ‘యూజర్ సేఫ్టీ రిపోర్ట్’లో “సెప్టెంబర్ 01, 2022, సెప్టెంబర్ 30, 2022 మధ్య మొత్తం 2,685,000 WhatsApp అకౌంట్లు నిషేధం విధించింది. వీటిలో 872,000 అకౌంట్లు ముందుగా నిషేధించారు. యూజర్ల నుంచి ఏవైనా రిపోర్టులు ఉంటే.. భారతీయ అకౌంట్ 91 ఫోన్ నంబర్ ద్వారా గుర్తించింది.

2021లో భారత్‌లో అమల్లోకి వచ్చిన కఠినమైన IT నిబంధనలతో అందిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యల వివరాలను పేర్కొంటూ ప్రతి నెలా సమ్మతి నివేదికలను అందించాలని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను (50 లక్షలకు పైగా యూజర్లు) ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తమ ప్లాట్‌ఫారమ్‌లలో విద్వేషపూరిత ప్రసంగం, తప్పుడు సమాచారం, నకిలీ వార్తలపై గతంలో విరుచుకుపడ్డాయి. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఏకపక్షంగా కంటెంట్‌ని అందించడం, యూజర్లను ‘డి-ప్లాట్‌ఫార్మింగ్’ చేయడంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి గత వారమే ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రకటించింది.

WhatsApp bans 26.85 lakh accounts in September in India, 15% more than August

WhatsApp bans 26.85 lakh accounts in September in India, 15% more than August

వాట్సాప్ నివేదిక ప్రకారం.. ప్లాట్‌ఫారమ్‌కు సెప్టెంబర్‌లో 666 ఫిర్యాదులు అందాయి. అయితే 23 మందిపై మాత్రమే వాట్సాప్ చర్య తీసుకుంది. “గ్రీవెన్స్ ఛానెల్ ద్వారా వినియోగదారు ఫిర్యాదులకు ప్రతిస్పందించడంతో పాటు వాటిపై చర్యలు తీసుకోవడం, ప్లాట్‌ఫారమ్‌లో హానికరమైన ప్రవర్తనను నిరోధించడానికి WhatsApp టూల్స్ అమలు చేస్తుంది. ఎందుకంటే హానికరమైన కార్యకలాపాలు జరగకుండా ఆపడం చాలా మంచిదని భావిస్తున్నట్టు కంపెనీ ప్రకటనలో వివరణ ఇచ్చింది.

జూలైలో వాట్సాప్ 23.87 లక్షల భారతీయ అకౌంట్లను నిషేధించినట్లు సమాచారం. నిషేధిత అకౌంట్ల నుంచి యూజర్ల నుంచి ఎలాంటి నివేదిక రాకముందే 14 లక్షల అకౌంట్లు ముందుగానే డిలీట్ చేసింది. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్, జూలైలో తొలగించిన వాట్సాప్ అకౌంట్లలో కన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు చూసిన వాట్సాప్ అకౌంట్లే అత్యధికమని నివేదిక తెలిపింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Self-Chat : వాట్సాప్‌లో సెల్ఫ్ చాట్ ఫీచర్ వస్తోంది.. అది ఎలా పనిచేస్తుందో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!