WhatsApp Blocked Tips : వాట్సాప్‌లో మీ కాంటాక్ట్ బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవచ్చు.. ఇదిగో ఈ 5 టిప్స్ మీకోసం..!

WhatsApp Blocked Tips : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది. యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపర్చేందుకు ప్రతి నెలా కొత్త ఫీచర్లను లాంచ్ చేస్తుంది.

WhatsApp Blocked Tips : వాట్సాప్‌లో మీ కాంటాక్ట్ బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవచ్చు.. ఇదిగో ఈ 5 టిప్స్ మీకోసం..!

Blocked 5 quick tips to know if someone blocked you on WhatsApp

WhatsApp Blocked Tips : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది. యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపర్చేందుకు ప్రతి నెలా కొత్త ఫీచర్లను లాంచ్ చేస్తుంది. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ ఎప్పుడూ యూజర్ల ప్రైవసీకే పెద్ద పీట వేస్తోంది. యూజర్ల ప్రైవసీ కోసం అనేక ఫీచర్లను అందిస్తోంది. ప్రైవసీ ఫీచర్లలో ఒకటి బ్లాక్ ఆప్షన్ (Whatsapp Block). ఈ బ్లాక్ ఆప్షన్ ద్వారా ఇతర వాట్సాప్ యూజర్లు మీకు ఎలాంటి మెసేజ్‌లను పంపకుండా నిరోధించవచ్చు. మీ WhatsApp లిస్టులో ఏదైనా నంబర్ లేదా సేవ్ చేసిన కాంటాక్ట్‌ని బ్లాక్ చేయవచ్చు. మీరు వాట్సాప్ యూజర్లను బ్లాక్ చేసిన తర్వాత.. మీ స్టేటస్ అప్‌డేట్స్, ఆన్‌లైన్ స్టేటస్, ప్రొఫైల్ ఫొటోను కూడా చూడలేరు.

మీరు ఎవరిని బ్లాక్ చేయాలనుకుంటున్నారు? మీ WhatsApp అప్‌డేట్‌లను షేర్ చేయకూడదని అనుకునే వారిని వెంటనే బ్లాక్ చేయవచ్చు. ఏదైనా కాంటాక్ట్ బ్లాక్ చేయడానికి WhatsApp Settings > Account > Privacy > Blocked Contacts > యాడ్ ఆప్షన్‌కు వెళ్లాలి. మీరు బ్లాక్ చేయాలనుకునే కాంటాక్ట్ కోసం సెర్చ్ చేయవచ్చు. మీ బ్లాక్ లిస్టులో యాడ్ చేయవచ్చు.

Blocked 5 quick tips to know if someone blocked you on WhatsApp

Blocked 5 quick tips to know if someone blocked you on WhatsApp

మీరు Save చేయని కాంటాక్ట్ లేదా మరేదైనా అకౌంట్ బ్లాక్ చేయాలనుకుంటే.. మీరు బ్లాక్ చేసే కాంటాక్ట్ చాట్ విండోను ఓపెన్ చేయండి > కాంటాక్ట్ ఆప్షన్‌ కోసం త్రి డాట్స్ ఆప్షన్ నొక్కండి > More> Block > కన్ఫర్మ్ చేయండి. అయితే ఎవరైనా మిమ్మల్ని వాట్సాప్‌లో బ్లాక్ చేస్తే? అది మీ బెస్ట్ ఫ్రెండ్, కుటుంబ సభ్యుడు లేదా మీ పార్టనర్ అయినా? ఏ కాంటాక్ట్ మిమ్మల్ని బ్లాక్ చేసిందో లేదో చెక్ చేసే ఫీచర్ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకునేందుకు మీకు సాయపడే ఐదు సులభమైన టిప్స్ ఉన్నాయి. ఓసారి ట్రై చేసి చూడండి.

వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో చెక్ చేయడం ఎలాగంటే? :

Check for Last seen : మీరు ఆన్‌లైన్ స్టేటస్ లేదా కాంటాక్ట్ Last Seen ఆప్షన్ చూడలేకపోతే, మీరు బ్లాక్ అయ్యారని అర్థం చేసుకోవచ్చు.

* ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేసే యూజర్లను అనుమతించే కొత్త ప్రైవసీ సెట్టింగ్‌ను WhatsApp యాడ్ చేసేందుకు ఆలోచిస్తోంది. ఈ ఫీచర్ ఇంకా రిలీజ్ కాలేదు.

Check Status And Profile Photo : మీరు మీ కాంటాక్ట్ ప్రొఫైల్ ఫొటో స్టేటస్ చూడలేకపోతే.. ఇతర యూజర్లు మిమ్మల్ని బ్లాక్ చేసినట్టే. ఎంపిక చేసిన కాంటాక్టుల నుంచి ప్రొఫైల్ ఫొటోను హైడ్ చేయడానికి ఒక ఆప్షన్ కూడా అందిస్తుందని గుర్తుంచుకోండి. స్టేటస్ విషయంలో కూడా ఇతరులు మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో సులభంగా గుర్తించవచ్చు. ఈ మార్గాల్లో సులభంగా తెలుసుకోవచ్చు.

Blocked 5 quick tips to know if someone blocked you on WhatsApp

Blocked 5 quick tips to know if someone blocked you on WhatsApp

Send Message : మీకు డబుల్ టిక్ రాకపోతే.. మీ మెసేజ్ డెలివరీ కాలేదని గుర్తించుకోండి. కాంటాక్ట్ మెసేజ్ పంపడానికి ప్రయత్నించండి. కొన్ని గంటల తర్వాత కూడా మెసేజ్ రిసీవ్ కాకపోతే.. ఆ కాంటాక్ట్ మిమ్మల్ని బ్లాక్ చేసింది.

Call The Contact : మీ కాంటాక్ట్ కాల్ చేయడానికి ప్రయత్నించండి. కాలింగ్ స్టేటస్ ‘Ringing’కి మారకపోతే మీరు బ్లాక్ అయినట్టు గుర్తించాలి.

Create a WhatsApp group : మీ కాంటాక్టుతో WhatsApp గ్రూపు కొత్తగా క్రియేట్ చేయండి. అందులో మీరు ఏయే కాంటాక్ట్ మిమ్మల్ని బ్లాక్ చేసిందని భావిస్తున్నారో గ్రూపులో యాడ్ చేసేందుకు ప్రయత్నించండి. మీరు ఆ కాంటాక్ట్ గ్రూప్‌కి యాడ్ చేయలేరు. అంటే.. మీ కాంటాక్ట్ బ్లాక్ చేశారని గుర్తించాలి.

Read Also : Whatsapp Online Status : వాట్సాప్‌లో ఫ్రెండ్స్‌తో చాట్ చేసేటప్పుడు మీ ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేయొచ్చు తెలుసా?