Whatsapp Online Status : వాట్సాప్‌లో ఫ్రెండ్స్‌తో చాట్ చేసేటప్పుడు మీ ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేయొచ్చు తెలుసా?

Whatsapp Online Status : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ (Whatsapp) అనేక ఫీచర్లను ప్రవేశపెడుతోంది. యూజర్లను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. యూజర్ల కోసం వాట్సాప్ ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ ఫీచర్ తీసుకురానున్నట్టు ప్రకటించింది.

Whatsapp Online Status : వాట్సాప్‌లో ఫ్రెండ్స్‌తో చాట్ చేసేటప్పుడు మీ ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేయొచ్చు తెలుసా?

Whatsapp Online Status _ How to hide online status on WhatsApp while chatting with friends

Whatsapp Online Status : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ (Whatsapp) అనేక ఫీచర్లను ప్రవేశపెడుతోంది. యూజర్లను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. యూజర్ల కోసం వాట్సాప్ ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ ఫీచర్ తీసుకురానున్నట్టు ప్రకటించింది. గత నెలలోనే వాట్సాప్ తమ యూజర్లు యాక్టివ్‌గా ఉన్నప్పుడు కూడా ఆన్‌లైన్ స్టేటస్‌ను హైడ్ చేసుకోవచ్చునని వెల్లడించింది.

రాబోయే రోజుల్లో అధికారిక ఫీచర్ అందుబాటులోకి వస్తుందని మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫాం పేర్కొంది. వాట్సాప్ అధికారిక ఫీచర్ వచ్చేవరకు ఆగలేరా? అయితే మీ కాంటాక్టుల నుంచి మీ ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేసుకునేందుకు ఒక దారి ఉంది. ఈ వాట్సాప్ ట్రిక్స్ ద్వారా మీ Android లేదా iOS యూజర్లు సులభంగా తమ ఆన్ లైన్ స్టేటస్ హైడ్ చేసుకోవచ్చు.

– ముందుగా మీ ఫోన్‌లో WhatsApp యాప్‌ని ఓపెన్ చేయండి.
– మీరు టాప్ రైట్ కార్నర్‌లో మూడు వర్టికల్ డాట్స్ వద్దకు వెళ్లాలి.
– యూజర్లు యాప్‌లో Settings మెనుపై క్లిక్ చేయవచ్చు.
– ఇప్పుడు, అకౌంట్ ఆప్షన్ (Account Option) ఎంపికపై క్లిక్ చేసి, ఆపై Privacy ఆప్షన్ వెళ్లండి.
– చివరిగా స్టేటస్ ఆప్షన్ చూడవచ్చు. అందులో My Contacts, Nobody రెండు ఆప్షన్లు ఉంటాయి. మై కాంటాక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీ ఆన్‌లైన్ స్టేటస్ మీ కాంటాక్టులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రెండవ ఆప్షన్ ఎంచుకుంటే.. Nobody, ప్రతి ఒక్కరి నుంచి Online Statusని హైడ్ చేస్తుంది.

Whatsapp Online Status _ How to hide online status on WhatsApp while chatting with friends

Whatsapp Online Status _ How to hide online status on WhatsApp while chatting with friends

ఈ ఆప్షన్ బెనిఫిట్స్ ‘Nobody’ ఆప్షన్‌పై క్లిక్ చేయడంతో ఇతరుల Online Status కూడా హైడ్ అవుతుందని గమనించాలి. మరో మాటలో చెప్పాలంటే.. మీరు కూడా మీ స్నేహితుడి ఆన్‌లైన్ స్టేటస్ చూడలేరు. ఇప్పుడే ఆప్షన్ ప్రారంభించండి. లేదా రాబోయే వారాల్లో వాట్సాప్ అధికారికంగా హైడ్ ఆన్‌లైన్ స్టేటస్ ఫీచర్‌ను రిలీజ్ చేయనుంది.

ఫీచర్‌ను ప్రకటించిన సమయంలో ఆన్‌లైన్ స్టేటస్ ప్రైవేట్‌గా ఉంచుకోవచ్చు. అందుకోసమే ఈ ఫీచర్ యాడ్ చేసినట్టు వాట్సాప్ తెలిపింది. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఆగస్టులో యూజర్లకు ఈ ఫీచర్‌ను అందించనున్నట్టు ధృవీకరించింది, కానీ అది జరగలేదు. ఈ నెలలో హైడ్ ఆన్‌లైన్ ఫీచర్‌ (Hide Online Feature)ను అధికారికంగా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మీరు WhatsAppని ఓపెన్ చేసి Settings > Account > Privacyకి వెళ్లాలి. ఇప్పుడు, మీరు మీ ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేసేందుకు స్క్రీన్ పైభాగంలో Last Seen, Online అనే ఆప్షన్ చూడవచ్చు.

Read Also : WhatsApp New Feature : వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్ వస్తోంది.. ఇక చాట్‌లోనే స్టేటస్ చూసుకోవచ్చు..!