WhatsApp Chat Filters : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ పాత చాట్ క్షణాల్లో వెతికిపెడుతుంది..!

WhatsApp Chat Filters : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ పాత చాట్ క్షణాల్లో వెతికిపెడుతుంది..!

Whatsapp May Soon Introduce Chat Filters For All Users In Future Update

WhatsApp Chat Filters : ప్రముఖ ఇన్‌స్టంట్ వాట్సాప్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. చాట్ ఫిల్టర్ ఫీచర్ (WhatsApp Chat Filters). ఈ కొత్త ఫీచర్ ద్వారా మీ పాత చాట్ ఏదైనా చూడాలంటే వెతికి పెట్టేస్తుంది. చాట్ ఫిల్టర్‌ చేసి.. మీ కావాల్సిన చాట్ మెసేజ్ వేగంగా సెర్చ్ చేసి కనిపెడుతుంది. చాట్ ఫిల్టర్ ఫీచర్ ఇప్పటికే బిజినెస్ అకౌంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు వాట్సాప్ దీనిని వ్యాపారేతర అకౌంట్లకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. WhatsApp ఇటీవల 2GB వరకు ఫైల్‌లను ట్రాన్స్ ఫర్ చేయగల సామర్థ్యం, ​​ఎమోజి రియాక్షన్లు వంటి మరిన్ని ఆసక్తికరమైన అప్ డేట్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Wabetainfo ప్రకారం.. WhatsApp Android, iOS, Desktop కోసం బిజినెస్ అకౌంట్లలో అధునాతన సెర్చ్ ఫిల్టర్‌లను రూపొందించింది. ఈ ఫీచర్ పాత చాట్‌లను త్వరగా కనుగొనడానికి సాధారణ చాట్ ఫిల్టర్‌లతో కనుగొనవచ్చు. వాట్సాప్ ఫీచర్ అప్‌డేట్‌లో యూజర్లందరికి ఈ ఫీచర్‌ను అందుబాటులోకి వస్తుందని నివేదిక పేర్కొంది. WhatsApp చాట్ బాక్సులో చదవని చాట్‌లు, కాంటాక్ట్‌లు, నాన్-కాంటాక్ట్‌లు, గ్రూపుల కోసం సెర్చ్ చేసేందుకు ఫిల్టర్ బాగా ఉపయోగపడుతుంది. ప్రైమరీ WhatsApp అకౌంట్లలో కూడా యాప్ ఫీచర్ అప్ డేట్ తీసుకురానుంది.

Whatsapp May Soon Introduce Chat Filters For All Users In Future Update (1)

Whatsapp May Soon Introduce Chat Filters For All Users In Future Update 

ఈ ఫిల్టర్ బటన్ మీరు చాట్‌లను మెసేజ్‌ల కోసం సెర్చ్ చేసినప్పుడు కూడా ఎల్లప్పుడూ కనిపిస్తుంది” అని నివేదిక పేర్కొంది. చాట్ ఫిల్టర్ ఫీచర్.. డెస్క్‌టాప్‌లో WhatsApp బీటాలో కనిపించింది. ఫ్యూచర్ అప్‌డేట్‌లో.. ఆండ్రాయిడ్ iOSలోని బీటా టెస్టర్‌ల కోసం WhatsApp ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు వారాల క్రితమే WhatsApp బీటా UWP 2.2216.4.0 వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసిన యూజర్లకు అందుబాటులో ఉందని నివేదికలు చెబుతున్నాయి. ప్రామాణిక WhatsApp అకౌంట్ల కోసం.. ఈ ఫీచర్ ఇప్పటికీ టెస్టింగ్ దశలోనే ఉంది.

Read Also : Android 13 beta : మీ ఫోన్లో ఆండ్రాయిడ్ 13 బీటా అప్‌డేట్ చేయండిలా..!