WhatsApp Multi Accounts : ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లను వాడొచ్చు తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!
WhatsApp Multi Accounts : రానున్న వారాల్లో ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత, వినియోగదారులు ఒకే యాప్‌లో రెండు మొబైల్ ఫోన్ నంబర్లతో వాట్సాప్ అకౌంట్లను ఉపయోగించుకోవచ్చు.

WhatsApp now allows users to use two accounts on one phone within the app
WhatsApp Multi Accounts : వాట్సాప్ యూజర్లు ఇప్పుడు ఒకే సమయంలో రెండు వాట్సాప్ అకౌంట్లను లాగిన్ చేసుకోవచ్చని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ (Meta CEO Mark Zuckerberg) ప్రకటించారు. అంటే.. మెటా సొంత యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram), ఫేస్‌బుక్ (Facebook) వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న మల్టీ అకౌంట్ల (Whatsapp Mulit Accounts) ఫీచర్‌ల మాదిరిగానే వినియోగదారులు యాప్‌లోని ఒక ఫోన్‌లో 2 వాట్సాప్ అకౌంట్లలో లాగిన్ చేయొచ్చు.
మెటా ప్రకారం.. రాబోయే ఈ కొత్త ఫీచర్ యూజర్ల పని, వ్యక్తిగత ప్రొఫైల్‌ల వంటి విభిన్న అకౌంట్ల మధ్య మారాల్సిన అవసరం ఉన్న యూజర్లకు సహాయకరంగా ఉంటుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు ఇకపై అకౌంట్లను మార్చుకున్న ప్రతిసారీ లాగ్ అవుట్ చేసి తిరిగి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. రెండు వేర్వేరు ఫోన్‌లలో వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేయనవసరం లేదు.
రెండు ఫోన్లు అక్కర్లేదు.. సింగిల్ ఫోన్ ఉంటే చాలు :
పర్సనల్ వంటి అకౌంట్ల మధ్య మారే వ్యక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఇకపై ప్రతిసారీ లాగ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. రెండు ఫోన్‌లను తీసుకెళ్లడం లేదా తప్పు అకౌంట్ నుంచి మెసేజ్ పంపడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాట్సాప్ ప్రతినిధి పేర్కొన్నారు. రెండో వాట్సాప్ అకౌంట్ సెటప్ చేయడానికి, యూజర్లకు రెండో ఫోన్ నంబర్, SIM కార్డ్ లేదా మల్టీ-సిమ్ లేదా eSIM యాక్టివిటీ సపోర్టు ఇచ్చే ఫోన్ అవసరం అని మెటా పేర్కొంది.
వినియోగదారులు మరో డివైజ్‌లో వారి రెండో అకౌంట్ వెరిఫై చేసుకోవడానికి SMS ద్వారా వాట్సాప్ పంపే వన్-టైమ్ పాస్‌కోడ్‌ను స్వీకరించడానికి రెండో ఫోన్ లేదా SIM కార్డ్ కూడా అవసరం పడుతుంది. ఈ ప్రక్రియలో వాట్సాప్ సెట్టింగ్‌లను యాక్సెస్ చేయడం, మీ పేరు పక్కన ఉన్న బాణంపై క్లిక్ చేయాలి. ‘Add Account’ ఎంచుకోవడం వంటివి ఉంటాయి. వినియోగదారులు తమ ప్రతి అకౌంట్ ప్రైవసీ, నోటిఫికేషన్ సెట్టింగ్‌లను కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు.
ఒకే వాట్సాప్‌లో రెండు అకౌంట్లను ఎలా వాడాలంటే? :
* ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లను ఉపయోగించడానికి..
* వాట్సాప్ ఓపెన్ చేసి.. రైట్ టాప్ కార్నర్‌లో ఉన్న త్రి డాట్స్‌పై నొక్కండి.
* ‘Settiings’పై నొక్కండి. ఆపై ‘Account’పై నొక్కండి.
* ‘Add Account’పై నొక్కండి. మీ రెండో అకౌంట్ సెటప్ చేసేందుకు సూచనలను ఫాలో చేయండి.
* మీ రెండో అకౌంట్ సెటప్ చేసిన తర్వాత యాప్ రైట్ టాప్ కార్నర్‌లో ఉన్న త్రి డాట్స్ Tap చేయాలి.
* ఆపై ‘Account’పై Tap చేయడం ద్వారా అకౌంట్ల మధ్య మారవచ్చు.

WhatsApp Multi Accounts on One Phone
త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త అప్‌డేట్ :
ముఖ్యంగా, ఈ ఫీచర్ ప్రస్తుతం (Android) యూజర్లకు మాత్రమే అకౌంట్ల మధ్య మారే సామర్థ్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. వినియోగదారులు రాబోయే వారాల్లో కొత్త అప్‌డేట్‌ని అందుకుంటారు. అదనంగా, మీ ఫోన్‌కి మరిన్ని అకౌంట్లను యాడ్ చేసేందుకు అధికారిక వాట్సాప్ అప్లికేషన్‌ను మాత్రమే ఉపయోగించాలని, అనధికారిక లేదా ఫేక్ వెర్షన్‌లను డౌన్‌లోడ్ చేయకుండా ఉండమని మెటా యూజర్లను సిఫార్సు చేస్తుంది. అధికారిక వాట్సాప్ మీ మెసేజ్‌ల భద్రత, ప్రైవసీని నిర్ధారిస్తుంది.
మల్టీ వాట్సాప్ అకౌంట్లను వాడొచ్చు :
అయితే, ఈ సమయంలో, కొత్త ఫీచర్ మెటా నిర్ణయం వివిధ డివైజ్‌ల్లో మల్టీ వాట్సాప్ అకౌంట్లను ఉపయోగించడానికి యూజర్లను అనుమతినిస్తుంది. 2021లో, ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లు, బ్రౌజర్‌లు లేదా కంప్యూటర్‌లలో యూజర్లు తమ అకౌంట్లను యాక్సెస్ చేయడానికి అనుమతించే మల్టీ-డివైజ్ ఫీచర్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. మెటా ఇప్పుడు అదనపు స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉండేలా ఈ ఫీచర్‌ను పొడిగించింది. మీరు ఇప్పుడు మీ వాట్సాప్ అకౌంట్ ఏకకాలంలో రెండు ఫోన్‌లలో ఉపయోగించవచ్చు.