WhatsApp: వాట్సప్ గ్రూప్‌లో కొత్త ఫీచర్ వస్తోంది.. ఏంటో తెలుసా? | WhatsApp now testing Communities feature to take on Signal, Telegram

WhatsApp: వాట్సప్ గ్రూప్‌లో కొత్త ఫీచర్ వస్తోంది.. ఏంటో తెలుసా?

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ (Meta) సొంత మెసేంజర్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా వాట్సాప్ గ్రూపులో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది.

WhatsApp: వాట్సప్ గ్రూప్‌లో కొత్త ఫీచర్ వస్తోంది.. ఏంటో తెలుసా?

WhatsApp Communities feature  : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ (Meta) సొంత మెసేంజర్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా వాట్సాప్ గ్రూపులో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. కమ్యూనిటీ ఫీచర్ (Community feature). సిగ్నల్, టెలిగ్రామ్ కు పోటీగా వాట్సాప్ ఈ కమ్యూనిటీ ఫీచర్ తీసుకొస్తోంది. ప్రస్తుతం ఈ కమ్యూనిటీ ఫీచర్ పై వాట్సాప్ టెస్టింగ్ చేస్తోంది. గ్రూప్ చాట్‌లను క్రమబద్ధీకరించేందుకు వాట్సాప్ ఈ కొత్త కమ్యూనిటీ ఫీచర్ తీసుకురానుంది. ముందుగా XDA డెవలపర్ ఈ ఫీచర్​ గుర్తించగా.. వాట్సాప్​ బీటా ఇన్ఫో (WABetaInfo) వెల్లడించింది.

ఈ కొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌కు కమ్యూనిటీలో ప్రత్యేక ఫీచర్లను యాడ్ చేయనుంది. తద్వారా వాట్సాప్​ గ్రూప్‌లపై గ్రూప్ అడ్మిన్లకు మరింత కంట్రోల్ ఇవ్వనుంది. చాటింగ్ యాప్ డిస్‌కార్డ్ (Discord) ప్లాట్‌ఫాం కమ్యూనిటీ ఫీచర్ మాదిరిగానే ఈ కొత్త వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్ వర్క్ అవుతుంది. వాట్సాప్​ కమ్యూనిటీలోని సభ్యులు వేర్వేరు గ్రూప్​లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఆయా గ్రూప్​లకు ఎండ్​ టు ఎండ్​ ఎన్​క్రిప్షన్​ ప్రొటెక్షన్​ కూడా అందిస్తుంది.

కమ్యూనిటీలకు అడ్మిన్​గా ఉండే యూజర్లు తమ కమ్యూనిటీలోని అన్ని గ్రూప్​లలోకి కూడా మెసేజ్​లు పంపుకోవచ్చు. సాధారణ వాట్సాప్​ గ్రూప్ మాదిరిగానే కమ్యూనిటీ అడ్మిన్లు ఇతరులను Invite Link, క్యూఆర్​ (QR Code) కోడ్​ ద్వారా మాన్యువల్​గా గ్రూప్​లలోకి యాడ్ చేయొచ్చు. ఈ మాదిరిగా గ్రూపులో చేరిన సభ్యులకు కొన్ని ఫీచర్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

వాట్సాప్​ కమ్యూనిటీలోకి కొత్తగా యాడ్ అయిన వ్యక్తి ఇతర సభ్యులతో చాట్​ చేయవచ్చా? లేదా? అనేది కమ్యూనిటీ అడ్మిన్​ డిసిషన్. వాట్సాప్​ బీటా ఇన్ఫో ప్రకారం.. ఈ కమ్యూనిటీ ఐకాన్ నాలుగు మూలలు చతురస్రాకారం ఉండి నాలుగు వైపులా రౌండ్​ ఎడ్జ్ కలిగి ఉంటుంది. కమ్యూనిటీలోని గ్రూప్​ అడ్మిన్​ అయిన యూజర్ ఎవరైనా.. ఇతర గ్రూప్​లకు వేర్వేరు చాట్ ఐకాన్లు క్రియేట్​ చేసుకునేందుకు అనుమతినిస్తుంది. కమ్యూనిటీ ఫీచర్​ ద్వారా డేటాను ఎక్కువ మంది వాట్సాప్​ యూజర్లకు పంపుకోవచ్చు. ఎక్కువ మందితో సమాచారం షేర్ చేయవచ్చునని వాట్సాప్​ బీటా ఇన్ఫో పేర్కొంది.
Read Also : Whatsapp: ఫెంటాస్టిక్ ఫీచర్.. వాట్సప్‌లో మెసేజ్ ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు

×