వాట్సాప్.. ఆపిల్ iPad యూజర్లకు స్పెషల్ యాప్

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడూ అప్ డేట్ చేస్తోంది. వాట్సాప్ తమ ప్లాట్ ఫాంపై తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు కొత్త ఫంక్షనాల్టీతో మార్పులు చేస్తోంది.

  • Published By: sreehari ,Published On : April 9, 2019 / 01:33 PM IST
వాట్సాప్.. ఆపిల్ iPad యూజర్లకు స్పెషల్ యాప్

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడూ అప్ డేట్ చేస్తోంది. వాట్సాప్ తమ ప్లాట్ ఫాంపై తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు కొత్త ఫంక్షనాల్టీతో మార్పులు చేస్తోంది.

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడూ అప్ డేట్ చేస్తోంది. వాట్సాప్ తమ ప్లాట్ ఫాంపై తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు కొత్త ఫంక్షనాల్టీతో మార్పులు చేస్తోంది. ఇప్పటికే ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారానికి సంబంధించి వాట్సాప్ ఫంక్షనాల్టీని మార్చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటివరకూ అన్ని ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్.. ఆపిల్ ఐప్యాడ్ యూజర్లకు అందుబాటులో లేదు. వాట్సాప్ వెబ్ ద్వారా ఆపిల్ ఐప్యాడ్ ఓనర్లను యాక్సస్ చేసుకునేందుకు కంపెనీ వీలు కల్పిస్తోంది.

ఐఫోన్ కనెక్ట్ చేసి Whatsapp Web ను యాక్సస్ చేసుకునేందుకు వీలుంది. కానీ, ఐఫ్యాడ్ డివైజ్ కు సంబంధించి ప్రత్యేకమైన స్టాండ్ లోన్ యాప్ అందుబాటులో లేదు. దీంతో ఆపిల్ ఐప్యాడ్ ఓనర్ల కోసం వాట్సాప్ Special App ను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. WABetaInfo నివేదిక ప్రకారం.. స్పెషల్ యాప్ డెవలప్ మెంట్స్ మొదలైనట్టు తెలిపింది. ఆపిల్ ఐప్యాడ్ డివైజ్ ల కోసం స్పెషల్ యాప్ ను సపరేట్ గా డిజైన్ చేయడం మొదలుపెట్టినట్టు పేర్కొంది. ప్రస్తుతానికి ఈ యాప్.. ఐప్యాడ్ యూజర్ల కోసం ఆపిల్ స్టోర్ లో అందుబాటులో లేదు. 
Read Also : వామ్మో.. ఎంతపెద్ద స్టోన్ : మూత్రనాళంలో భారీ రాయి తొలగింపు ​​​​​​​

టెస్ట్ ఫ్లయిట్ పై వచ్చే బీటా అప్ డేట్ లో మార్పుతో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. Apple iPad యాప్ డిజైన్ ఎలా ఉంటుందనేదానిపై యూజర్లలో ఆసక్తి నెలకొన్నతరుణంలో వాట్సాప్ కంపెనీ.. యాప్ డెవలప్ మెంట్ కు సంబంధించి కొన్ని స్ర్కీన్ షాట్లను తమ బ్లాగ్ లో షేర్ చేసింది. రెగ్యులర్ వాట్సాప్ తరహాలో iOS ప్లాట్ ఫాంపై ఈ ఐప్యాడ్ స్పెషల్ యాప్ డిజైన్ ఉండనుంది. మరో ఫోన్లో ఈ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్పప్పటికీ యూజర్లు దీన్ని వాడుకోవచ్చు. వాట్సాప్ ఐప్యాడ్ యాప్ ల్లో ఫీచర్లు ఐఫోన్లలో యాప్ లా ఒకేలా ఉంటాయి.

ఐప్యాడ్ యాప్ ను పూర్తిగా రీడిజైన్ చేసి యూజర్ ఇంటర్ ఫేస్ ను మార్చేశారు. వాట్సాప్ వెబ్ ఇంటర్ ఫేస్ తరహాలో యూజర్లకు ఐప్యాడ్ స్పెషల్ యాప్ సపోర్ట్ చేయనుంది. ఇందులో హ్యాట్ స్ర్కీన్, కాల్ స్ర్కీన్ స్ప్లిట్ వ్యూలో రీడిజైన్ చేశారు. సెట్టింగ్స్ మెనూ కూడా రీడిజైన్ చేశారు. స్టేటస్ స్ర్కీన్, వాయిస్ కాల్ స్ర్కీన్ ఇంకా రీడిజైన్ చేయాల్సి ఉంది. వాట్సాప్ ఐఓఎస్ యాప్ పై ఎలా కనిపిస్తాయో అలానే ఐప్యాడ్ యాప్ పై కూడా అలానే కనిపిస్తాయి. ఈ యాప్ లో Touch ID ఫీచర్ ను అదనంగా యాడ్ చేశారు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు యాప్ ను లాక్ చేసుకోవచ్చు.  

గమనిక : ఆపిల్ ఐప్యాడ్ యూజర్ల కోసం స్టాండ్ లోన్ యాప్ ను రిలీజ్ చేయనున్నట్టు వాట్సాప్ కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. రిపోర్ట్స్ ప్రకారం.. ఐప్యాడ్ కొత్త యాప్ ప్రస్తుతం డెవలప్ మెంట్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో వాట్సాప్ సపోర్ట్ చేసే ఈ కొత్త ఐప్యాడ్ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 
Read Also : ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్