108మెగా పిక్సెల్స్‌తో Xiaomi ఫోన్

108మెగా పిక్సెల్స్‌తో Xiaomi ఫోన్

స్మార్ట్ ఫోన్ అంటే మెగా పిక్సెల్స్ రొటీన్ అయిపోయాయి. మార్కెట్లో ప్రతి ఫోన్ 12మెగా పిక్సెల్‌తో అందుబాటులో ఉండటంతో పిక్సెల్ దేనిలో ఎక్కువ ఉంటే దానికే మొగ్గుచూపుతున్నారు యూజర్లు. ఇటీవల నోకియా 41మెగా పిక్సెల్‌తో పునర్వైభవాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. వాటికి తలదన్నేలా హవా కొనసాగిస్తున్న జియోమీ 48మెగా పిక్సెల్, 64మెగా పిక్సెల్‌లే కాకుండా సంచలనమైన ప్రొడక్ట్ ను భారత మార్కెట్లోకి తీసుకువస్తోంది. 

Xiaomi Mi Note 10 to launch in India

 

చైనా తర్వాత అతిపెద్ద మార్కెట్ అయిన భారత్‌లోకి 108మెగా పిక్సెల్స్ ఉన్న జియోమీ నోట్ 10ను లాంచ్ చేస్తున్నారు. ఎమ్ఐ సీసీ9 ప్రొ లేదా ఎమ్ఐ నోట్10 ఐదు కెమెరాల సాయంతో అందుబాటులోకి వస్తోంది. భారత్‌లోకి అడుగుపెడుతుందని మను కుమార్ జైన్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. 

 

ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయితే మాత్రం కెమెరా ప్రాధాన్యంగా మార్కెట్లోకి వచ్చిన వన్ ప్లస్, ఒప్పో, వీవోలకు కాంపిటీషన్ గా మారడం ఖాయం. ధర విషయంలోనూ వాటితో సమానంగా తూగే ఈ ఫోన్ 2017తర్వాత ఎమ్ఐ కంపెనీ నుంచి వస్తున్న తొలి నాన్ ఆండ్రాయిడ్. ఈ మొబైల్ ధర భారత్‌లో  6GB/128GB మోడల్ ఫోన్ రూ.43వేలు ఉండగా, 8GB/256GB మోడల్ ఫోన్ రూ. 51వేలుగా ఉంటుందని సమాచారం. 

Xiaomi Mi Note 10 to launch in India

జియోమీ ఎమ్ఐ నోట్ 10ఫీచర్లు
బ్యాటరీ కెపాసిటీ: 5260mAh
కలర్స్: వైట్, గ్రీన్, మిడ్ నైట్ బ్లాక్
డిస్ ప్లే: 6.47అంగుళాలు
రిసొల్యూషన్: 1080×2340 పిక్సెల్స్
ప్రొసెసర్: 2.2 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ
ర్యామ్: 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజీ: 128జీబీ
కెమెరా: 108 మెగా పిక్సెల్ బ్యాక్/ 32మెగా పిక్సెల్ ఫ్రంట్