Google and Apple : స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా..గూగుల్, ఆపిల్ కు చేరుతున్న డేటా

స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా..అయితే..మీ మొబైల్ డేటా గూగుల్ లేదా ఆపిల్ కు చేరుతుందని నివేదిక వెల్లడిస్తోంది.

Google and Apple : స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా..గూగుల్, ఆపిల్ కు చేరుతున్న డేటా

Your phone shares

phone shares data : స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా..అయితే..మీ మొబైల్ డేటా గూగుల్ లేదా ఆపిల్ కు చేరుతుందని నివేదిక వెల్లడిస్తోంది. ఇలా చేరుతుందని తెలిసినా..ప్రతి ఐదు నిమిషాలకు మొబైల్ లోని డేటా చేరుతుందన్న విషయం చాలా మందికి తెలియదు. ఐర్లాండ్ లోని ట్రినిటీ కాలేజ్ రీసెర్చర్ డగ్లస్ లీత్ చేసిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. యూజర్ల నుంచి గూగుల్, ఆపిల్ ఏ డేటాను ఎలా సేకరిస్తున్నాయన్న అంశంపై అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనం ప్రకారం..ప్రతి 4 లేదా 5 నిమిషాలకు మొబైల్ డేటా గూగుల్ లేదా ఆపిల్ కు చేరుతోందని తెలుసుకున్నారు.

ఆండ్రాయిడ్ అయితే..గూగుల్ కు, ఐఓఎస్ అయితే..ఆపిల్ కు మీ మొబైల్ లోని సమాచారం వెళుతోందని తేలింది. మొబైల్ వాడకపోయినా సరే..అందులోని డేటా మొత్తం వాళ్లకు చేరుతూనే ఉందని అధ్యయనం తేల్చింది. ఈ రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఫోన్ ఐఎంఈఐ, హార్డ్ వేర్ సీరియస్ నంబర్, సిమ్ సీరియల్ నంబర్, ఐఎంఎస్ఐ, హ్యాండ్ సెట్ ఫోన్ నెంబర్, ఇతర సమాచారాన్ని ఆపిల్, గూగుల్ కు చేరవేస్తాయని వెల్లడైంది. ఫోన్ అస‌లు వాడ‌క‌పోయినా 12 గంట‌ల వ్య‌వ‌ధిలో 1 MB Dataను ఆండ్రాయిడ్ షేర్ చేసింద‌ని కూడా ఈ అధ్య‌య‌నం తేల్చింది.

ఆపిల్‌తో పోలిస్తే ఆండ్రాయిడ్ 20 రెట్లు ఎక్కువ డేటాను యూజ‌ర్ల నుంచి సేక‌రించి గూగుల్‌కు షేర్ చేస్తున్న‌ట్లు లీత్ చేసిన అధ్య‌య‌నంలో తేలింది. అధ్య‌య‌నంలో భాగంగా ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఉన్న‌ గూగుల్ పిక్సెల్ 2, ఐఓఎస్ 13.6.1 ఉన్న ఐఫోన్ 8ల‌ను లీత్ వాడారు. ఆండ్రాయిడ్ గూగుల్ సెర్చ్ బార్‌, క్రోమ్‌, యూట్యూబ్‌, గూగుల్ డాక్స్‌, సేఫ్టీహ‌బ్‌, గూగుల్ మెసెంజ‌ర్‌, డివైజ్ క్లాక్ నుంచి డేటా సేక‌రిస్తున్న‌ట్లు గుర్తించారు అదే ఐఓఎస్ మాత్రం సిరి, స‌ఫారీ, ఐక్లౌడ్ నుంచి డేటా సేక‌రిస్తోంది.
దీనిని Google ఖండించింది. అధ్యయనం కోసం ఉపయోగించిన తీరు సరిగ్గా లేదని వెల్లడించింది.

Read More : మైనారిటీలకు 78 శాతం పదవులు ఇచ్చాం